దవాఖానాల్లో ధనదాహం
మహబూబ్‌నగర్, టీ మీడియా ప్రతినిధి: మన శత్రువు బలహీనతే మనకు బలం అన్న చందంగా ప్రైవేట్ ఆస్పవూతుల తీరు మారింది. వసతుల లేమితో సతమతమవుతున్న సర్కారు దవాఖానాల బలహీనతను ఆసరా చేసుకున్న ప్రైవేట్ ఆస్పవూతులు రోగులనుంచి అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 6, ఉప కేంద్రాలు 674 ఉన్నా వాటిలో కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపవూతుల వైపు బారులు కడుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని పొరుగు జిల్లా అయిన కర్నూలు నుంచి వైద్యులు పాలమూరుకు దిగుమతి అయ్యారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 362 ప్రైవేటు నర్సింగ్ హోంలు వెలిశాయి. వైద్య, ఆరోగ్య శాఖ గుర్తింపు పొందనవి చాలానే ఉన్నాయి. నర్సింగ్‌హోమ్‌లు నిర్వహించాలంటే డిగ్రీలు ఉండాల్సిన అవసరం లేదు. కష్టపడి ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏదో ఒక పేరు పొందిన ఆసుపవూతిలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా మూడు, నాలుగేళ్లు అనుభవం గడిస్తే చాలు. వారికదే పెద్ద వైద్య డిగ్రీ. పీఆర్‌ఓ కాకపోతే ఆర్‌ఎంపీగా ఏదేని క్లీనిక్‌లో చేసిన అనుభవం ఉంటే చాలు. వారే ముగ్గురు, నలుగురు షేర్ చేసుకొని నర్సింగ్ హోంను నెలకొల్పి నడుపుతున్నారు. ఇదీ పాలమూరు జిల్లాలో నర్సింగ్‌హోమ్‌ల పరిస్థితి. ప్రజల అవసరాలను బట్టి డబ్బును గుంజుకోవడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలుగా ప్రైవేట్ ఆసుపవూతులు తయారయ్యాయి. రోగులనుంచి వసూలుచేస్తున్న డబ్బులు సరిపోలేదన్నట్లు పసిపిల్లల విక్రయానికి పూనుకున్నారు. ఒకర, ఇద్దరా జిల్లా కేంద్రంలోనే ఐదుగురు ఆడశిశువులను విక్రయించారంటే వారు ఎంతటి గనుల్లో ఇప్పటికే అర్థమై ఉంటుంది.
శనివారం జిల్లా కేంద్రంలోని సాయిశ్రీ ఆసుపవూతిలో పసిపాప విక్రయంతో ప్రైవేట్ ఆస్పవూతుల అసలు రంగు బయటపడింది. జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపవూతులపై వైద్య, ఆరోగ్య శాఖ ఉదాసీనత అవలంభించడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. సాయిశ్రీ ఆసుపత్రి అనుమతి లేదని ముందుగానే ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి సంఘటనలు సంభవించి ఉండేవి కావు. ఇందులో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పూర్తి వైఫల్యం కనబడుతోంది. మహబూబ్‌నగర్ పట్టణమే కాకుండా అచ్చంపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, షాద్‌నగర్ తదితర పట్టణాల్లో స్కానింగ్ సెంటర్‌లలో లింగ నిర్ధారణలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. అయినా వైద్యశాఖ అధికారులు తనిఖీలు చేసినట్లు మచ్చుకైనా కన్పించలేదు. గిరిజన తండాలు, గ్రామాల్లో లింగ నిర్ధారణ నేరమనే ప్రచారాన్ని పూర్తి స్థాయిలో కల్పించడం లేదు.
సాయిశ్రీ ఆసుపత్రి నిర్వాహకులు ఎక్కడ?
శిశువుల విక్రయంలో వెలుగులోకి వచ్చిన సాయిశ్రీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వాహకులు పోలీసులకు ఇంకా దొరకలేదు. ఈ ఆసుపవూతిని గతంలో ఓ మహిళా డాక్టర్ న్యూటౌన్‌లో నెలకొప్పారు. కొద్ది రోజుల తరువాత రాము అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు ఈ ఆసుపవూతిని కొనుగోలు చేశారు. ఇక్కడి నుంచి ఆరు నెలల క్రితం న్యూటౌన్‌లోని కెనరా బ్యాంక్ పక్క సందులోకి మార్చారు. నిర్వాహకులు ఇక్కడి నుంచే అసలు తతంగం నడిపారు. ఇందులో రాము అనే వ్యక్తి అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామానికి చెందినవాడు. ఆయన గతంలో పాలమూరులోని పలు ఆసుపవూతుల్లో పీఆర్‌ఓగా పనిచేశాడు. దీంతో అతని పలువురు ఆర్‌ఎంపీలతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకు ఆసుపవూతిని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగగాడు. సాయిశ్రీ ఆసుపత్రి కొనుగోలు చేశాక ఆర్‌ఎంపీలతో ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు తెరలేపాడు. వారి అండతో గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో పేదరికంతో మగ్గుతున్న కుటుంబాలను గుర్తించేవాడు. ఈ కుటుంబాల్లో పిల్లలు పుడితే వారితో బేరసారాలు చేసి తక్కువ ధరకు శిశువులను కొనుగోలు చేసేవాడు. అనంతరం తను నిర్వహిస్తున్న సాయిశ్రీ ఆసుపవూతికి తరలించేవాడు. ఇక్కడి నుంచే శిశువులను పిల్లలు లేని దంపతులకు విక్రయించేవాడు. ఒక్కో శిశువును రూ.25 వేల నుంచి 40 వేల వరకు విక్రయించేవాడని తెలిసింది. ఇది వరకు ఈ ఆసుపత్రి నుంచి ఐదుగురు శిశువులను విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం ఈ తతంగం వెలుగు చూడడంతో నిర్వాహకులు పరారీలో ఉన్నారు. అసలు నిందితుడు రాము పట్టుబడితే శిశువుల విక్రయి రాకెట్ బట్టబయలవుతుంది.
రిజిస్ట్రేషన్ లేని ఆసుపవూతులపై చర్యలు
జిల్లాలో గుర్తింపు లేకుండా నిర్వహించే ఆసుపవూతులకు నోటీసులు ఇచ్చాం. ప్రైవేట్ ఆసుపవూతులను ఆర్‌ఎంపీలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేశాం. నిరంతరం 19మంది క్లస్టర్ అధికారులు వారి పరిధిలో నిర్వహించే ప్రైవేటు వైద్యంపై నిఘా ఉంచి తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. జిల్లా కేంద్రంలో జరిగిన సంఘటన ఇతర ప్రాంతాల్లో జరుగకుండా చర్యలు చేపడతాం. గుర్తింపు లేని వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటాం. అలాగే వారు నిర్వహించే ఆసుపవూతుల గుర్తింపును రద్దు చేస్తాం. ఇప్పటికే జిల్లాలోని షాద్‌గనగర్, వనపర్తి తదితర ప్రాంతాల్లో పర్యటించి కొన్ని ఆస్పవూతులను సీజ్ చేశాం.
-జనార్దన్, ఇన్‌చార్జి డీఎండీహెచ్‌ఓ
Other News