Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  General News
ఆటో నరేష్...!

- విద్యార్థినీని పెళ్లి చేసుకొని వదిలేసిన వైనం
- ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాలికపై పోలీసుల దౌర్జన్యం
- పుస్తెల తాడును తెంపిపడేసిన మహిళా కానిస్టేబుళ్లు
- ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు

మహబూబ్‌నగర్, టీ మీడియా ప్రతినిధి : పదో తరగతి చదువుతున్న బాలికకు ప్రేమపేరుతో ఓ యువకుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అనంతరం పెళ్లి పేరుతో మరోసారి మోసం చేశాడు. మూడు నెలలు కలిసి కాపురం చేసి బాలికను ఒంటిరిగా వదిలేశాడు. దిక్కుతోచని బాలిక పోలీసులను ఆశ్రయించింది.అక్కడ కూడా న్యాయం జరగలేదు. పైగా బాలికపై పోలీసులు దౌర్జన్యం చేసి పుస్తెలతాడును తెంపిపడేశారు. గురువారం ఉదయం జిల్లా ఎస్పీ నాగేంవూదకుమార్ ఎదుట ఆ బాలిక తన గోడు వెల్లబోసుకున్నది. బాధితురాలి కథనం ప్రకారం... జిల్లా కేంద్ర సమీపంలోని అప్పన్నపల్లి గ్రామానికి చెందిన సంతోష(16) మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలతో పదో తరగతి చదువుతుండేది. రోజూ గ్రామం నుంచి పాఠశాలకు వచ్చే సందర్భంలో అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నరేష్ (23) పరిచయమయ్యాడు. ఒకే గ్రామం కావడంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది.

ఈ చనువును ఆసరాగా చేసుకున్న నరేష్ ఓ సమయంలో తన ప్రేమ విషయాన్ని సంతోషకు చెప్పాడు. ఇందుకు సంతోష అభ్యంతరం చెప్పడంతో బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. నన్ను ప్రేమించకపోతే మీ అన్నను చంపి మీకు వారసున్ని లేకుండా చేస్తానని సంతోషను భయవూభాంతులకు గురిచేశాడు. ఇలాగే ఓ రోజు బయపెట్టి ఆటోలో తీసుకెళ్లి బలవంతం చేసి తన వాంఛ తీర్చుకున్నాడు. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడు ఆటోలో తీసుకెళ్లి వాంఛ తీర్చుకునేవాడు. ఈ విషయాన్ని మా ఇంట్లో చెబుతానని నరేష్‌ను సంతోష నిలదీసింది. దీంతో గత మార్చి 13న నరేష్, అతని మిత్రులు గొల్ల యాదయ్య, హన్మంతు, తెలుగు అంజి, తెలుగు శ్రీను, మరొకరు కలిసి భూత్పూర్ మండలంలోని కరి గ్రామానికి తీసుకెళ్లి ఆ రాత్రి అంజి తమ్ముడు వరుసైన యువకుడి ఇంట్లో ఉంచారు. మరుసటి రోజు ఉదయం నరేష్ జడ్చర్లకు వెళ్లి తాళి, మెట్టెలు, పెళ్లిబట్టలు తెచ్చాడు.

అదేరోజు కరి గ్రామ శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పాలమూరుకు చేరుకుని మెట్టుగడ్డలో ఉంటున్న మిత్రుని ఇంట్లో వారం రోజుల పాటు నరేష్, సంతోష కలిసి కాపురం చేశారు. కొద్ది రోజులకు అక్కడి నుంచి మకాం మార్చి మర్లు ఏరియాలో నరేష్ పెద్దమ్మ కొడుకు గదిలో 15 రోజుల పాటు ఉన్నారు. మళ్లీ అక్కడి నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి మకాం మార్చారు. తన తల్లిదంవూడులను రూరల్ పోలీసులు పట్టుకెళ్లారని, వారిని విడిపించాలంటే నా అంతకు నేనే పారిపోయి పెళ్లి చేసుకున్నానని పోలీసులకు చెప్పాలని నరేష్ సంతోషకు చెప్పాడు. సంతోష పోలీసుల ఎదుట నరేష్ చెప్పినట్టే చెప్పింది. ఈ సమయంలో ఎస్‌ఐ కల్పించుకుని సంతోషను నానా బూతులు తిట్టి మహిళా కానిస్టేబుళ్లలో మెడలో ఉన్న పుస్తెల తాగు తెంపి సంతోషను ఆమె తల్లి వెంట పంపించారు. మళ్లీ మూడు రోజులకు పదోతరగతి పరీక్షలు రాసేందుకు సంతోష మహబూబ్‌నగర్‌కు వచ్చి వెళుతుంటే నరేష్ అడ్డుకుని తన వెంట రాకుంటే చంపేస్తానని బెదిరించాడు.అతని తప్పించుకున్న సంతోష ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లిదంవూడులను చెప్పింది. అదే నెల 21 వ తేదీన జిల్లా కేంద్రంలో సంతోషను నరేష్ బలవంతంగా ఆటో ఎక్కించుకుని గద్వాల సమీపంలో ఉన్న బీచుపల్లి ఆలయానికి తీసుకెళ్లి మళ్లీ తాళి కట్టాడు. అక్కడి నుంచి నేరుగా జిల్లా కేంద్రానికి వచ్చి ప్రేంనగర్‌లో ఓ గది తీసుకుని కాపురం పెట్టారు.నెల రోజుల తరువాత నరేష్ మాటమార్చాడు.

తన తల్లిదంవూడులు తిడుతున్నారని సంతోషకు చెప్పి ఎటో వెళ్లిపోయాడు. సంతోష అతని కోసం ఎంత వెతికినా అడ్రస్ దొరకలేదు. రెండు మూడు రోజులకు నరేష్ తండ్రి లింగమయ్య, తల్లి భారతమ్మ, మేనమామ యాదయ్య(పోలీసు శాఖలో ఉద్యోగి) సంతోష వద్దకు వచ్చి నరేష్‌ను వదిలేయకుంటే చంపివేస్తామని బెదిరించారు. లేకుంటే రూ.5 లక్షలు, 5 తులాల బంగారు తెస్తే నరేష్‌ను కలువనిస్తామని బెదిరించి వెళ్లారు. అక్కడి నుంచి సంతోష జడ్చర్లలో ఉంటున్న నరేష్ చిన్నమ్మ ఇంట్లో ఆశ్రయం పొందింది. కొద్ది రోజులకు అక్కడికి వచ్చిన నరేష్ మళ్లీ మాయమాటలు చెప్పి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. ఇరు పెద్దలు కలిసి ఈనెల 9వ తేదీన జడ్చర్ల సమీపంలోని గంగాపురం ఆలయంలో పెళ్లికి సిద్ధం చేశారు. మూహూర్తం సమయానికి నరేష్ చెప్పాపెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు. కొద్ది సేపటికి సంతోష తల్లిదంవూడులకు ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇలా అడుగడుగునా మోసం చేసి తనకు తీరని అన్యాయం చేశాడని ఎస్పీ ఎదుట సంతోష వాపోయింది.తనకు న్యాయం చేసి నరేష్‌ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆ బాలిక ఎస్పీని వేడుకుంది.

బాలికకు నచ్చజెప్పి పంపించాము : రూరల్ ఎస్‌ఐ
పెళ్లి చేసుకుని నరేష్ అనే యువకుడు మోసం చేశాడని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సంతోష అనే బాలికకు తల్లిదంవూడుల ఎదుటే నచ్చజెప్పామని, నరేష్‌పై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని కూడా చెప్పినా ఫిర్యాదు చేయలేదని మహబూబ్‌నగర్ రూరల్ ఎస్‌ఐ అంజద్‌అలీ గురువారం సాయంత్రం ‘టీ మీడియా’కు తెలిపారు. నరేష్ నుంచి రూ.లక్ష ఇప్పించాలని కోరడంతో ఇది తమ పరిధిలో లేదని చెప్పామని ఆయన పేర్కొన్నారు. కానీ పోలీస్‌స్టేషన్‌లో బాలికపై దౌర్జన్యం చేయలేదని, పుస్తెలు తెంపినట్లు బాలిక చెప్నపడం అవాస్తమని ఎస్‌ఐ తెలిపారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd