Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Mahaboobnagar >>  General News
అల్లుడి సొమ్ము అత్త సొంతం

వడ్డేపల్లి, టీ మీడియా : అన్ని విధాలా ఉన్నప్పుడు అల్లుడిని దగ్గరకు చేర్చుకొని విధి వక్రీకరించి అతనికి పక్షవాతం వచ్చి బాధపడుతుండగా అతని ఆస్తినంతా అత్తా, భార్య కాజేసి ఉడాయించిన సంఘటన వడ్డేపల్లి మండలం రామాపురంలో బుధవారం వెలుగుచూసింది.

బాధితుడు లిఖిత పూర్వకంగా తెలిపిన వివరాల ప్రకారం రామాపురం గ్రామానికి చెందిన రామారావు కర్నూలు టాటా కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుండేవాడు. వనపర్తిలోని సుభాష్‌వాడకు చెందిన శ్రీనివాసరావు, నాగమ్మ రెండో కూతురు సుబ్బ లక్ష్మికి, రామారావుకు 2003లో వివాహమైంది. వనపర్తిలో భార్య ఇంటిలోనే ఉండేవారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. ఇంతవరకు వీరి కాపురం సాఫీగా సాగినా అసలుకథ ఆ తర్వాత జరిగింది. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రామారావుకు ఉద్యోగం. పని వత్తిడితో విశ్రాంతి లేక పక్షవాతం వచ్చి ఎడమ కాలు, చేయి పడిపోయింది. వీరి కాపురంలో కష్టాలు ప్రారంభమయ్యాయి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమయంలో సృహలోలేని సమయంలో బ్యాంకు ఖాతాలను, క్రెడిట్ కార్డులను భార్య సుబ్బలక్ష్మి, బావమరిది రాజేశ్వర్‌రావు, అత్త నాగమ్మ తీసుకొని ఆయా ఖాతాల్లో ఉన్న రూ.7లక్షల 0వేలు కాజేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు భార్య కాపురానికి రావడంలేదని రామారావు విలపించాడు. బ్యాంకు స్టేట్‌మెంట్లతో కూడిన అన్ని ఆధారాలతో జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తే శాంతినగర్ ఎస్‌ఐ రూ.70 వేలు ఇప్పించాడని మిగతా డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాడు.

అన్నీ ఉండి ధీనస్థితిలో ఉన్నా...
గతంలో టాటా కంపెనీలో నెలకు రూ. 35 వేలు సంపాదించేవాడినని పక్షవాతం వచ్చాక 30 ఏళ్ళ వయసులోనే దిక్కులేని వాడిని అయ్యానని రామారావు వాపోయాడు. దీంతో తన మకాం రామాపురానికి మార్చానని, చీకటి గదిలో ఒక్కడినే ఉన్నానని పనులు చేసుకోలేనని 70 ఏళ్ళ తల్లిని పోషించాల్సిన సమయంలో ఆమెకు భారమయ్యానన్నాడు. దుర్భర జీవితం గడుపుతున్నానని లేవలేను నడవలేను ఏపని చేయలేను ఆర్థికంగా, మానసికంగా బాధపడుతున్నానని వండి పెట్టేవారు కూడా లేరని విలపించాడు.
అతని కుటుంబ సభ్యులే డ్రాచేశారు.

మా అల్లుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు సంవత్సరంన్నర పాటు మా ఇంట్లోనే ఉంచుకొని వైద్యం చేయించాము. ఆసుపత్రి ఖర్చులకు అవసరమైనప్పుడల్లా డబ్బులు అతని కుటుంబ సభ్యులే డ్రా చేసి తీసుకొని వచ్చేవారు. అతని భార్యను నిత్యం వేధించేవాడు. మానసికంగా దెబ్బతిని ఇలా ప్రవర్తిస్తున్నాడు. రూ లక్ష మా కుమారుడికి కారు కొనుకొని రమ్మని ఇచ్చాడు. వాటిని కూడా ఈ మధ్యే తిరిగి ఇచ్చేశాము.

- నాగమ్మ, బాధితుడి అత్త

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd