నీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు
మహబూబ్‌నగర్, టీ మీడియా : తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ గిరిజాశంకర్ అ న్నారు. వివిధ పథకాల కింద మంజూరైన తాగునీటి ప థకాల ద్వారా ప్రజలకు తాగునీటిని అందించాలని సూ చించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో జిల్లాలో తాగునీటి సరఫరా, సంపూర్ణ పారిశుధ్యం, నిర్మల్ గ్రామ పురస్కార్ తదితర అంశాలపై ఆర్‌డబ్ల్యూస్ ఎస్‌ఈలతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న తాగునీటి వనరులు ప్రస్తుతం ఏ పథకం ద్వారా సరఫరా చేస్తున్నది, తాగునీటికి సమస్య ఉన్న గ్రామాల వివరాలతో కూడిన నివేదికను తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా 234 గ్రామాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నామని, 305 బోర్లు లీజుకు తీసుకున్నామని అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
రక్షిత మంచినీటి పథకాలు, మినీ పథకాలను సంబంధిత మండల ఏఈలు తప్పనిసరిగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటిని సరఫరా చేసే ట్యాంకర్లపై ‘ప్రభుత్వ మంచినీటి పథకాల ట్యాంకరు’ అని స్పష్టంగా రాయించాలని చెప్పారు. ప్రతి రోజు ఏ గ్రామానికి ఎన్ని ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారనే విషయాలపై పట్టిక రూపొందించి గ్రామాల్లో ఉంచాలన్నారు. గ్రామాల వారీగా తాగునీటి సరఫరా, తాగునీటి వనరుల సమస్యల వివరాలను గురువారం సాయంవూతంలోగా సమర్పించాలని ఆదేశించారు. నాన్‌సీఆర్‌పీఎఫ్ నిధుల ద్వారా చేపట్టిన పనులన్నింటిని జూలై చివరినాటికి పూర్తి చేయాలన్నారు. సమగ్ర మంచినీటి పథకాలు, ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకాలు, సంపూర్ణ పారిశుధ్యం, నిర్మల్ గ్రామ పురస్కార్, పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృపాకర్‌డ్డి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు జయచంవూదబాబు, రాంచందర్, సంజీవరావు, క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఈఈ పద్మజ పాల్గొన్నారు.
Other News