సంతృప్తి కోసం నాటకాలు
సినిమాల్లో ఇప్పటి వరకు తనకు హాస్య, ప్రతినాయక పాత్రలే వచ్చాయని, ఎప్పటికైనా కంటతడి పెట్టించే పాత్రలను కూడా పోషిస్తానని సినీ నటుడు జయప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆయన మహబూబ్‌నగర్‌కు వచ్చిన సందర్భంగా టీ మీడియాతో మాట్లాడారు. తనకు నాటకాలంటేనే అమితమైన ప్రేమ అని, సంపాదన కోసం సినిమాల్లో నటిస్తున్నానని, ఈ రెండు రంగాలు తనకు రెండు కళ్లు అని ఆయన చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చునని ఆయన సందేశమిచ్చారు.
పాలమూరు, టీ మీడియా : ఇన్ని రోజులు ప్రేక్షకులను భయవూభాంతులకు గురిచేసే విధంగా విలన్‌పావూతలు, నవ్వించే పాత్రల్లోనూ నటించాను. సినిమా రంగంలో నాకు ఇలాంటి పాత్రలే వస్తున్నాయి. ఎప్పటికైనా ప్రేక్షకుల కంటతడిపెట్టించే పాత్రలను పోషించాలని ఉందని ప్రముఖ సినీ, రంగస్థల నటుడు జయవూపకాష్‌డ్డి తన మనోభావాలను వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో అలెగ్జాండర్ అనే సాంఘిక నాటక ప్రదర్శన ఏర్పాట్లలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన టీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన మనస్సులోని భావాలను వ్యక్తం చేశారు.
టీ మీడియా: మీ సొంత జిల్లా ఏది? విద్యాభ్యాసం ఎక్కడెక్కడ జరిగింది?
జయవూపకాష్‌డ్డి: మాది నల్గొండ జిల్లా. నాన్న సాంబిడ్డి, అమ్మ సామ్రాజ్యం. నాన్న పోలీసు ఉద్యోగి కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాభ్యాసం కొనసాగింది. 30 ఏళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించాను. నాన్న స్వతహాగా రంగస్థల నటుడు కావడంతో ఆ రంగంపై కొంత ఆసక్తి ఏర్పడింది.
టీ మీడియా: మొదటిసారిగా నాటక రంగంలో ఎప్పుడు అడుగుపెట్టారు?
జయవూపకాష్‌డ్డి: అనంతపూర్ జిల్లాలో ఎస్‌ఎల్‌సీ చదివే రోజుల్లో మా సీనియర్లు నాటకాలు వేస్తుండేవారు. ఆ నాటకంలో మా మిత్రులతోపాటు నేను నాటకం వేయాలని భావించాను. సాంస్కృతిక కార్యక్షికమాలు నిర్వహించే మాస్టార్ దగ్గరికి వెళ్లి మా అభివూపాయాన్ని వ్యక్తం చేశాం. దుర్యోధన గర్వభంగం నాటకానికి సంబంధించిన పద్యాలు, సన్నివేశాలను బట్టీపట్టి మాస్టారు ముందు ప్రదర్శించి ఆయనతో చివాట్లు పడాల్సి వచ్చింది. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో నాలో పట్టుదల మరింతగా పెరిగింది. 196లో గుంటూరు హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదివే సమయంలో స్టేజి రాచరికం అనే నాటకంలో స్త్రీపావూతలను ధరించి అందరి అభినందనలు అందుకున్నాను. అప్పటి నుంచి నాటక రంగంలో వెనుదిరగాల్సిన అవకాశం లేకుండా పోయింది.
టీ మీడియా: మీరు ఇప్పటివరకు ఎన్ని నాటకాలు ప్రదర్శించారు? వాటిలో మీకు సంతృప్తి ఇచ్చిన పాత్రలు ఏవి?
జయవూపకాష్‌డ్డి: ఇప్పటివరకు నేను 2వేలకుపైగా నాటక ప్రదర్శనలు ఇచ్చాను. వాటిలో నాకు బాగా సంతృప్తి ఇచ్చినవి మండువాలోగిలి, బానిస, త్రీఇన్‌వన్, వీరపాండకట్టవూబహ్మణ, గప్‌చిప్, కొత్త సైన్యం, రాణిరువూదమ, అలెగ్జాండర్ తదితర పాత్రలు బాగా సంతృప్తిని ఇచ్చాయి.
టీ మీడియా: సినిమా రంగంలోకి వచ్చే అవకాశం ఎలా దక్కింది?
జయవూపకాష్‌డ్డి: నల్గొండ జిల్లాలో మాది నాటక రంగ సమాజం ఉండేది. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ పాత్రికేయ మిత్రుడు తన పత్రిక ఆవిష్కరణకు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తదితరులను ఆహ్వానించారు. ఆ సమయంలో మా నాటక సమాజం ప్రదర్శించిన నాటకాన్ని స్వయంగా దాసరి చూశారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత దాసరి దర్శకత్వంలో నిర్మాత రామానాయుడు నిర్మించిన బ్రహ్మపువూతుడు సినిమాలో సీనియర్ నటుడు సత్యనారాయణ స్థానంలో పోలీసుపాత్ర పోషించే అవకాశం లభించింది. దీంతో నేను ఉద్యోగానికి సెలవుపెట్టి భార్య, బిడ్డలతో చెన్నై వెళ్లాను. కానీ సినిమా రంగంలో తగినంత గుర్తింపు లభించినా జీవించడానికి సరిపడ డబ్బులు రాలేదు. దీంతో తిరిగి ఉద్యోగంలో చేరాను. 1997లో రామానాయుడు తిరిగి ఆహ్వానించి ప్రేమించుకుందాంరా సినిమాలో అవకాశం ఇచ్చారు. అక్కడ నుంచి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
టీ మీడియా: సినిమా రంగంలో మీకు బాగా నచ్చిన పాత్రలు ఏవి?
జయవూపకాష్‌డ్డి: నేను పోషించిన పాత్రలు నాకు బాగా సంతృప్తిని ఇచ్చాయి. ప్రేమించుకుందాం రా, సమరసింహాడ్డి, ఢీ, రెడీ, ఎవడిగోల వాడిదే సినిమాల్లోని పాత్రలు బాగా నచ్చాయి. ఇప్పటిదాకా కూృరమైన పాత్రల్లోనూ, హాస్యరసపావూతల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాను. మున్ముందు ప్రేక్షకుల కంటనీరు పెట్టించే పాత్రలు నటించాలని ఉంది.
టీ మీడియా: మీకు బాగా నచ్చిన నటీ, నటులు ఏవరు?
జయవూపకాష్‌డ్డి: కమలహాసన్, ఆర్.నాగేశ్వర్‌రావు, సూర్యకాంతం తదితరులు బాగా నచ్చిన నటీ, నటులు.
టీ మీడియా: నాటక, సినీ రంగాల్లో మీరు బాగా ఇష్టపడే రంగం ఏది?
జయవూపకాష్‌డ్డి: ఆత్మసంతృప్తికి నాటకరంగాన్ని ఇష్టపడతా. సినీరంగం సంపాదన అందిస్తుంది. రెండు రంగాలు నాకు రెండు కళ్లులాంటివి.
టీ మీడియా: కొత్తగా నాటక, సినీరంగాల్లోకి రావాలనుకునే వారికి మీరిచ్చే సందేశం ఏమిటి?
జయవూపకాష్‌డ్డి: ఏ రంగంలో రాణించాలన్నా కృషి, పట్టుదల ఉండాలి. ఓటములు ఎదురైనప్పుడు కృంగిపోవద్దు. మరింత పట్టుదలగా కృషి చేస్తే ఏ రంగంలోనైనా విజయం అదే చేకూరుతుంది.
Other News