‘దోపిడీ దొంగను దొరగా వర్ణిస్తున్నారు’
-టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి
మహబూబ్‌నగర్ టౌన్, టీ న్యూస్ : తెలంగాణలోని 10 జిల్లాలను సస్యశ్యామలం చేయాల్సిన గోదావరి, కృష్ణా జలాలను సీమాంధ్ర ప్రాంతానికి దొంగిలించిన దోపిడీ దొంగ దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డి అని తెలంగాణ ప్రజావూఫంట్ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి తీవ్రంగా విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్ బతికుంటే చేవెళ్ల సస్యశ్యామలం అయ్యేదని వైఎస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అబద్దం ఆడిందన్నారు. గోదావరిపై పొలవరం ప్రాజెక్టు కట్టి నాలుగు లక్షల గిరిజన కోయ గూడారాల్లో నిప్పు పోశాడని విమర్శించారు. తెలంగాణను ముంచి సీమాంవూధకు నీళ్లు తరలించి ఆకలి, కరువు, వలసలు, ఆత్మహత్యలకు వైఎస్ కారకుడయ్యారన్నారు. జనాన్ని నిలువునా దోచిన వైఎస్ జగన్ బయట పడిపోయారని, తల్లిగా తనయుడి తప్పును సమర్థించుకుంటూ యాత్రలు చేయడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రజలు ఈ దోపిడీదారుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు హనీఫ్‌అహ్మద్, బాలరాజు, గోపాల్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Other News