ప్రభుత్వ పథకాలను సద్వినియోగపర్చుకోండి
- వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నాగిరెడ్డి
అమ్రాబాద్ రూరల్, టీ న్యూస్: గిరిజన చెంచు రైతులకు ప్రభుత్వం అందించే ప్రత్యేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నాగిడ్డి అన్నారు. అమ్రాబాద్‌లో శనివారం ఎన్జీ రంగవిశ్వవిద్యాలయం రాజేందర్‌నగర్ వారి ఆధ్వర్యంలో గిరిజన ఉప పథకం ద్వారా రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్షికమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గిరిజన ఉపపథకం ద్వారా మండలంలో గల జంగండ్డిపల్లి, వెంక మాచారం, చిట్లంకుంట, పదర, పెట్రాల్‌చేను తదితర గ్రామాల గిరిజన చెంచు రైతులకు విత్తనాలు, ఎరువులు 100మంది రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన రైతుల కష్టనష్టాలను సాగులో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన చెంచు రైతుల అభ్యున్నతికి ప్రభుత్వ పథకాలు ఎంతగానో దోహదపడుతాయని అభివూపాయపడ్డారు. ప్రభుత్వం గిరిజన రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు సాగు అవసరమయ్యే పనిముట్లు, ఎద్దుల బం డ్లు, కోత యంత్రాలు అందించి నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి ప్రోత్స హం కల్పిస్తుందన్నారు. అధిక దిగుబడులను ఇచ్చేందుకు హైబ్రి డ్ విత్తనాలను, ఇతర పనిముట్లను 75శాతం సబ్సిడీతో అందిస్తున్నామన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పంటనష్టానికి సంబంధించిన రైతులు సంబంధిత అధికారుల వద్ద నష్టపరిహారం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రైతులు విధిగా బ్యాంకులో ఖాతాలు తెరిచి బ్యాంక్ ద్వారా పంట నష్టపరిహారాన్ని పొందాలన్నారు. ఈ సందర్భంగా ఆయన అధిక దిగుబడులను సాధించిన రైతులకు ఆయన ప్రశంసించారు.
ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం ఇచ్చి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను ఎంచుకొని సాగి చేసి అధిక దిగుబడులను పొందాలని కోరారు. ఈ కార్యక్షికమంలో వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వినయ్‌చంద్, ఐటీడీఏ పీఓ మురళిధర్, ఆచార్య ఎన్‌జీ రంగావిశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్‌లు స్వర్ణలత, సుధాకర్, నాగేష్, గోవర్ధన్, రామాంజనేయులు, గౌరిశంకర్, అచ్చంపేట ఏడీఏ సరళాకుమారి, ఏఓ రాజశేఖర్, జిల్లా చెంచుసేవాసమితి నాయకుడు నాగయ్య, చైతన్యరైతుమిత్ర సొసైటీ నాయకులు ఆంజనేయులు, రామస్వామి, వెంక గుండేలు, మహిళా గిరిజన రైతులు, వివిధ గ్రామాల చెంచు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Other News