Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Khammam >>  General News
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా బాలరాజు

టీ మీడియా ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల నియామక ప్రక్రియ మంగళవారం పూర్తి చేసింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పసుపులేటి బాలరాజును జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించింది. ఈయన విశాఖపట్టణం జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి గెలుపొంది, గిరిజన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మన జిల్లాకు చెందిన రాష్ట్ర ఉద్యానవనశాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి వరంగల్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు రాంరెడ్డి మహబూబ్‌నగర్ ఇన్‌చార్జ్‌గా కొనసాగారు. కాగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు కరీంనగర్ జిల్లా కేటాయించారు. 2010 డిసెంబర్ 24వ తేదీన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నాల పూర్తిగా
విఫలమయ్యారనే అపవాదు మూటకట్టుకున్నారు. గడిచిన సంవత్సరంన్నర కాలంలో కేవలం మూడుసార్లు మాత్రమే డీఆర్‌సీ సమావేశాలు నిర్వహించి, మమ అనిపించారే తప్ప, పూర్తిస్థాయిలో సమస్యలపై దృష్టి కేంద్రీకరించలేదు.

తాజాగా ఈ మధ్య కాలంలో జరిగిన డీఆర్‌సీలో అధికారులపై చిందులుతొక్కి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటడ్డి, డిప్యూటీ స్పీకర్ భట్టివిక్షికమార్క పొన్నాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఇన్‌చార్జ్ మంత్రి మాకొద్దంటూ ముఖ్యమంవూతికి మొరపెట్టుకున్నారు. ఫలితంగానే పొన్నాలకు కరీంనగర్ కేటాయించి, బాలరాజుకు ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పజెప్పారు. కాగా జిల్లాలోని ఏజెన్సీ పల్లెల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నందున గిరిజన మంత్రికి బాధ్యతలు అప్పగించారనే ప్రచారం ఉంది. అయితే ఏడాదిన్నరకు పైగా బాధ్యతలు మోసిన పొన్నాల లక్ష్మయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా విఫలమవగా.. కొత్తగా నియమించిన బాలరాజు ఏమేర సఫలీకృతులవుతారో వేచి చూడాల్సిందే.
ప్రభుత్వ షెడ్యూల్ ఖరారు

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd