Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Khammam >>  General News
ప్రకృతి వైపరీత్యాలపట్ల అప్రమత్తంగా ఉండండి

అధికారుల సమావేశంలో కలెక్టర్ సిద్దార్థాజైన్

ఖమ్మం, మీడియా: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టాన్ని కనీస స్థాయికి పరిమితం చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిద్దార్థాజైన్ తెలిపారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో విపత్తు నిర్వహణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వరద నష్ట నివారణ చర్యలకై రూపొందించిన ఫ్లడ్ మ్యానువల్‌ను ఆధునీకరించాలని సూచించారు. హైరిస్క్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సకాలంలో పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. కృష్ణాబేసిన్ పరిధిలో ఉన్న భూ ప్రకంపనలు వస్తున్నాయని, సాధారణ స్థాయిలో వస్తున్న ఈ ప్రకంపనల వల్ల పడవద్దని, అప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని అన్నారు.

శాఖల వారీగా విపత్తుల నిర్వహణ ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ, టీఏ జయచందర్, సీపీఓ ఆనందనాయక్, డిజార్డర్ మేనేజ్‌మెంట్ అధికారి ఆశాలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd