Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Khammam >>  General News
పోలీసుల అదుపులో నకిలీ నక్సల్?

డబ్బుకోసం ఓ వైద్యునికి బెదిరింపులు..


ఖమ్మం, టీమీడియా: ఓ ప్రయివేటు వైద్యున్ని బెదిరించి డబ్బు గుంజే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఖమ్మం పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద గల ఓ ప్రయివేటు వైద్యున్ని డు రోజులుగా తనకు రూ2 లక్షల నగదు చెల్లించాంటూ డిమాండ్ చేస్తున్నాడు. వైద్యునికి రోజూ ఫోన్ చేస్లూ బెదిరించసాగాడు. దీనిపై శనివారం కూడా సదరు వ్యక్తి తాను నక్సలైట్‌నని, తనకు ఈరోజు కచ్చితంగా డబ్బు ఇవ్వాల్సిందేని, లేకుంటే అంతు చూస్తానని బెదిరించసాగాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ వైద్యుడు నకిలీ నక్సలైటును రహస్య ప్రదేశానికి పిలిపించాడు.

కచక్యంగా వ్యవహరించి పోలీసులకు పట్టించాడు. శనివారం సాయంత్రం ఓ ప్రదేశానికి రమ్మని పిలిపించి వన్ టౌన్ సీఐకి సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో ఆయన ఐడీ పార్టీ సిబ్బందిని పంపి వారిచే ఆ నకిలీ నక్సల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు ఇంకా తెలియాల్సి ఉంది.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd