Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Khammam >>  General News
‘అక్షరాల’ ఖర్చు..350 కోట్లు..!

-ప్రారంభమైన ‘విద్యా వ్యాపారం’
-జిల్లాలో 4.51 లక్షల విద్యార్థులు
-‘ప్రైవేటు’గా చదివేవారి సంఖ్య 1.6 లక్షలు
-కార్పొరేట్ పూతపూస్తున్న యాజమాన్యాలు
-ఫీజుల రూపేణా 250 కోట్లు చెల్లిస్తున్న తల్లిదండ్రులు
-విద్యా సామగ్రి పేరిట మరో 100 కోట్ల ఖర్చు
-అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నస్టేషనరీ ధరలు
-కన్నవారి జేబులు గుల్ల అవుతున్న వైనం


టీమీడియా ప్రతినిధి, ఖమ్మం:పిల్లోడికి నాలుగేళ్లు దాటుతున్నాయంటే కన్నవారి గుండెల్లో గుబులు మొదలవుతోంది. గుండెలపై తన్నే బుడిబుడి అడుగుల వయసు దాటి కాస్త పెద్దవుతుంటే గుండెలు బాదుకునే భారం చేరువలో ఉన్నట్లే లెక్క. ఎల్‌కేజీ.. యూకేజీ చదువులకే వేలల్లో సొమ్ములు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇక ఆపై చదువులకయ్యే వ్యయం సంగతి చెప్పనవసరంలేదు. అయితే పాఠశాలల్లో ఫీజుల మాట ఒక ఎత్తైతే.. పుస్తకాలు, బ్యాగులు, బూట్లు.. ఇలా అయ్యే ఖర్చు కూడా తల్లిదంవూడులకు పెనుభారంగానే మారుతోంది. తాజాగా అంగట్లో సరుకుగా మారిపోయిన చదువుకు కార్పొరేట్ పూత పూయడంతో కన్నవారికయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇలా జిల్లాలో చదువులు ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో అయ్యే మొత్తం వ్యయం ఎంతో తెలుసా! అక్షరాలా 350 కోట్ల రూపాయలు. నమ్మశక్యంగా లేకున్నా ఇది పచ్చి నిజం. ఫీజుల రూపేణా యాజమాన్యాలు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. తమ పిల్లాడిని మంచి పేరున్న పాఠశాలలో చేర్పించాలని భావిస్తున్న తల్లిదంవూడులకు కోరికలను పలు విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. కాగా ఫీజుల విషయంలో అధికారుల నియంవూతణ లేకపోవడంతో పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని తల్లిదంవూడులు మారుమాట్లాడకుండా యాజమాన్యాలు చెప్పే ఫీజులు చెల్లించేందుకు ఓకే అంటున్నారు.

కొనుగోళ్లతో తల్లిదంవూడులు బిజీబిజీ..
ఎంతో విలువైన వస్తువుగా మారిపోయిన చదువు ఇప్పుడు గుండెలపై కుంపటిని రగిలిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఈ రంగానికి సంబంధించిన వస్తువుల క్రయ విక్రయాలు బాగా జోరందుకున్నాయి. ఈ సీజన్‌లో జరిగే ఖర్చు రూ.వంద కోట్లకు చేరుతుందని ఓ అంచనా. కేవలం విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే జిల్లాలో రూ.10 కోట్ల మేర వ్యాపారం సాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న ఏ విక్రయ కేంద్రాన్ని తరచిచూసినా సందడి కనిపిస్తోంది. బుక్‌స్టాళ్లు, దుస్తుల షాపులన్నీ విద్యార్థులు, వారి తల్లిదంవూడులతో కటకిటలాడుతున్నాయి. చదువులకు పయనమయ్యే తమ పిల్లలకు పుస్తకాలు, బూట్లు, యూనిఫాం, బ్యాగులను కొనివ్వడంలో తల్లిదంవూడులు తలమునకలై కనిపిస్తున్నారు. మారిన విద్యావిధానం.. పెరిగిన కారొర్పోరేట్ హంగులే జిల్లాలో విద్యా సంబంధిత వస్తువుల వ్యాపారం రూ.కోట్లకు చేరడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

4.51 లక్షల మంది విద్యార్థులు..
జిల్లాలో ప్రాథమిక విద్యనందిస్తున్న పాఠశాలల్లో ప్రభుత్వ బళ్లు 2354 ఉండగా, ప్రైవేటు యాజమాన్యాలవి 452 ఉన్నాయి. అలాగే ఎయిడెడ్ పాఠశాలలు మరో 47 నడుస్తున్నాయి. ఇక అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 471 ఉండగా, ప్రైవేటు పాఠశాలలు 160, ఎయిడెడ్ పాఠశాలలు 3 ఉన్నాయి. ఇవిగాక పదో తరగతి వరకు విద్యనందించే 426 ప్రభుత్వ హైస్కూళ్లు, 249 ప్రైవేటు పాఠశాలలు, మరో 20 ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. ఇక గుర్తింపు పొందిన, గుర్తింపు లేని పాఠశాలల విషయానికొస్తే ఇవి 700లకుపైనే ఉన్నాయి. ఈ పాఠశాలలన్నింటిలో కలిపి 4 లక్షల 51 వేల మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ఒక్కో విద్యార్థికి పాఠశాల ప్రారంభ నెలలో యూనిఫారం, బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, ఇతరత్రా సామగ్రి కొనుగోళ్లు తప్పనిసరి. ఈ ఖర్చు ఒక్కో విద్యార్థికి సగటున రూ.3000 నుంచి రూ.4000 వరకు ఖర్చవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇలా జిల్లాలో ఈ ఒక్క నెలలో అయ్యే ఖర్చు నూరు కోట్లకు చేరుతున్నట్లు తెలుస్తోంది.


ఏ ఖర్చు ఎంతవుతుందంటే..
ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలు, నోట్ పుస్తకాలు కొనుగోలు చేయడం తప్పనిసరి. విద్యా సంవత్సరం ప్రారంభంలో వీరికి రూ.1 కోట్ల మేర ఖర్చవుతుండగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 కోట్లు ఖర్చవుతుంది. దీంతో ప్రతీ ఏటా స్టేషనరీ కోసం తల్లిదంవూడులు రూ.23 కోట్లు ఖర్చు చేయక తప్పడంలేదన్న మాట. ఇక ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు రెండు రకాల బూట్లు తప్పనిసరి. సగటున ఒక్కో విద్యార్థికి బూట్లు, సాక్స్‌లతో కలిపి రూ.300 నుంచి రూ.400 వరకు చేతి చమురు వదులుతుంది. అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ ఖర్చు రూ.15 కోట్లకు చేరుతున్నట్లు తెలుస్తోంది. పుస్తకాల గొడవ వదిలితే.. విద్యార్థులు సౌలభ్యంగా స్కూలుకెళ్లి రావడానికి బ్యాగు తప్పనిసరే. మేలు రకమైన బ్యాగు కావాలంటే కనీసం రూ.300 నుంచి రూ.500 మధ్య వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు గతంలో ప్లాస్టిక్ బస్తా సంచులతో తయారు చేసిన బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకుని బడికెళ్లే వారు. ఇప్పుడు వారు కూడా ఈ విధానానికి స్వస్తి పలికారు. షాపుల్లో మెరిసిపోతున్న రెడీమేడ్ బ్యాగులకు ఆకర్షితమవడంతో జిల్లాలో వీటి కొనుగోళ్లు మరో రూ.15 కోట్లకు చేరింది. సీజన్ ప్రారంభమవడంతో ముంబయి, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ నుంచి బ్యాగుల దిగుమతి విపరీతంగా పెరిగింది. ఇక ఇవి కాకుండా క్యారేజీ బాక్స్‌లు, ప్లాస్టిక్ బుట్టలు, వాటర్ బ్యాగులు, కంపాక్స్‌లు వంటి సామగ్రి తల్లిదంవూడులకు అదనపు ఖర్చుగా షాకిస్తున్నాయి.

ఈ సామగ్రి అమ్మకాలు చదువుల సీజన్ ప్రారంభంలో మరింతగా పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇలా జిల్లాలోని విద్యార్థులందరికీ పాఠశాలలు ప్రారంభమైన రెండు, మూడు నెలల్లో కేవలం విద్యార్థుల సామక్షిగికయ్యే ఖర్చు నూరు కోట్లకు చేరుతోంది.
అసలేం జరుగుతోంది..
నాకు తెలియాలి
-రూ.కోట్ల మొబలైజేషన్ నిధుల్లో 31లక్షలే ఖర్చు చేశారెందుకు?
-ప్రభుత్వం డబ్బులు ఎక్కువై విడుదల చేస్తోందా..?
-ఇంజనీరింగ్‌శాఖ అవినీతిమయమైంది..
-కాంట్రాక్టర్లు అధికారులకు చుట్టాలా..?
-ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో కలెక్టర్ సీరియస్..
-ముచ్చటగా ముగ్గురే హాజరైన ప్రజాప్రతినిధులు

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd