Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Khammam >>  General News
బొగ్గుగనిలో విషవాయువు

రుద్రంపూర్,జూన్13(టీ మీడియా):కొత్తగూ డెం ఏరియా వీకే 7 షాప్ట్ బొగ్గు గనిలోని విషయవాయువు విడుదల కావడంతో కంటిన్యూయస్ మైనర్‌తో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 7 షాప్ట్ బొగ్గు గనిలోని కింగ్ సిమ్‌లోని సీఎంపీ -5ఏ ప్యానల్ (గోఫ్)లో సోమవారం స్పాంటినీయస్ హీటింగ్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ సీల్ విషవాయువు వెలువడిన విషయం సింగరేణి అధికారులు గోప్యంగా ఉంచారు.ండు రో జులుగా విషవాయువు వెలువడటంతో రెస్క్యూ టీం ఆధ్వర్యంలో రక్షణ చర్యలుచేపడుతున్నారు. కంటిన్యూస్‌మైనర్‌తో బొగ్గు ఉత్పత్తి చేసే టప్పు డు విషవాయువులు ఉత్పన్నమయినట్లయితే సీఓటు సహాయంతో నివారించేందుకు వీకే 7 షా ప్ట్ బొగ్గు బావి వద్ద సీఓటు ట్యాంకును ఏర్పాటు చేశారు.

కానీ పైప్ లైన్‌ను అండర్ గ్రౌండ్‌కు ఏ ర్పాటు చేయడంతో యాజమాన్యం నిర్లక్ష్యం వ హించడం వల్ల విషవాయువులు మూడు రోజులుగా విడుదలవుతున్నా వాటిని అదుపుచేయలేక పోతున్నారు. సీఓటు ట్యాంకు పైప్ లైన్ ఎరక్షన్ పనులు పూర్తి చేసి ఉంటే విషయవావులు వెలువడిన ఒక్కరోజులోనే వాటిని అదుపు చేసి ఉండే వారని కార్మికులు చర్చించుకుంటున్నారు. గత రెండు రోజులుగా కార్బన్ డై ఆక్సైడ్ ట్యాంకునుం చి అండర్ గ్రౌండ్‌కు యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ ఎరెక్షన్ పనులు చేస్తున్నారు. ఈ పనులు గురువారం పూర్తి కావచ్చని అధికారుల అంచ నా. కార్బన్ డై ఆక్సైడ్ ట్యాంక్‌ను ఇప్పటి వరకు వినియోగంలోకి తేకపోవడం సింగరేణి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆ ట్యాంకులో సీఓ టు లేకపోవడం గమనార్హం. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో సింగరేణి యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

పైకి మాత్రం పెద్దపులి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ విషయమై డీజీఎంఎస్ ఇన్‌స్పెక్టర్ సమాచారం ఉందో లేదో అనే అనుమానాలు కార్మికులనుంచి వ్యక్తమవుతున్నాయి. వివరాలు అడిగేందుకు మీ డియా ప్రయత్నించగా 7షాప్ట్ మేనేజర్ ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. వీకే 7 షాప్ట్ మైన్‌ను ఏ రియా జీఎం సీహెచ్. విజయరా వు బుధవారం సందర్శించి పరిస్థితిని మేనేజర్‌ని అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా 7 షాప్ట్ మేనేజర్ విషవాయువు వెలువడుతున్న దృష్ట్యా కార్మికులకు జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు.

మేనేజర్ సూచనలు..
కంటిన్యూయస్ మైనర్‌తో బొగ్గు తీసే పనిస్థలంలో కార్బన్ మోనాక్సైడ్ (సీఓ) 5 పీపీఎం మించి ఉన్నట్లయితే బొగ్గు కటింగ్ బంద్ చేసి సురక్షిత స్థలానికి చేరుకోవాలి.
- 33డీ /59ఎల్ సీఓ 2000 పీపీఎం మించిన ఎడల సీఎంపీ - 5ఏ ప్యానల్ లో పనులన్ని నిలిపి వేసి ప్యానల్‌ను మూసివేయాలి.
- 65 ఎల్‌ఎన్/2డీ మూసివేసినాము. దీని ద్వారా సీఓటును గ్యాస్‌ను పంపడం జరుగుతున్నది, సీఓటును అన్ని షిప్టుల్లో సూపర్ వైజర్ ఆధ్వర్యంలో పంపించాలి.
- 64 ఎల్‌ఎన్ /2డీ, 63ఎల్‌ఎన్/2డీ, 62ఎల్‌ఎల్/2డీ, 61ఎల్‌ఎన్/2డీ, 60ఎల్‌ఎన్/2డీ, 2ఆర్/60ఎల్ లలో ఫైర్ సీల్స్ ఒకదాని వెంట మరొకటి కట్టాలి.
- అన్ని గోఫ్ ఎడ్జ్‌ల వద్ద గాలి గోప్‌లోనికి వెళ్లకుండా బ్రిటీసులు కట్టవపూను.ఒక 33డీ/ 29 ఎల్ గోప్ ఎడ్జ్ మూయకుండా తెరిచి ఉంచాలి.
- సీఎంపీ -5 ఏ ప్యానల్‌లోని పనులను షిప్టు అసిస్టెంట్ మేనేజర్ ఆధ్వర్యంలో జరగవపూను.
పై పనులన్ని రెస్క్యూ అధికారుల సమన్వయంతో పూర్తి చేయాలని మేనేజర్ శ్రీనివాసరా వు ఈ సూచనలను జారీ చేశారు.
జీఎం వివరణ.. వీకే 7 షాప్టులో వెలువడ్డ విషవాయువును ముందుగాను గుర్తించితగు రక్షణ చర్యలు చేపట్టామని ఏరియాజీఎం విజయరావు ‘టీమీడియా’కు తెలిపారు.కార్బన్ మోనాక్సైడ్ విషవాయువును అదుపు చేసేందుకు చంద్రాపూర్ నుంచి కార్బన్ డై ఆక్సైడ్ గ్యాస్ ట్యాంకర్‌ను తెప్పిస్తున్నామన్నారు. ఆ ట్యాంకర్‌తో గురువా రం విషవాయువును చేయగలమన్నారు. ఎ లాంటి ప్రమాదం లేదని, బొగ్గు ఉత్పత్తికి కూడా ఎలాంటి ఆటంకం కలగలేదనిఆయన తెలిపారు. ఈ విషయం డీజీఎంఎస్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd