|
|
డెయిరీ నిర్వీర్యానికి తొట్టి గ్యాంగ్ కుట్ర
పెద్దపల్లి, టీ మీడియా : కరీంనగర్ విజయ డెయిరీని నిర్వీర్యం చేయడానికే ఎంపీ పొన్నం తొట్టిగ్యాంగ్ కంకణం కట్టుకొందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారా వు ఆరోపించారు. ఆదివారం పెద్దపల్లిలో తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. 4వేల లీటర్ల పాల ఉత్పత్తితో ప్రారం భ మై, ప్రస్తుతం లక్షా 20వేల లీటర్ల పాల ఉత్పత్తి సాధించి తెలంగాణలో కరీంనగర్ డెయిరీ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. డెయిరీ ద్వారా జిల్లా లో దాదాపు 2లక్షల మంది ఉపాధి పొందుతు న్నారని, వీరిని రోడ్డు మీద పడే విధంగా ఎంపీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అసలు ఆయన ఆలోచన ఏంటో ప్రజలకు చెప్పాలని, ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకొని పాడి రైతు లకు క్షమాపణ చెప్పాలని విజయరమణారావు డిమాండ్ చేశారు. Other News
|