Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Karimnagar>>  Genaral News
వ్యవ‘సాయం’చేసింది మేమే

- యాంత్రీకరణతో మార్పులు తెచ్చాం..
- ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలిస్తున్నాం..
- వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు ఇస్తున్నాం..
- రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నాం
- వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

‘‘వ్యవసాయ రంగానికి అన్ని విధాలా సాయమందించి, రైతులను ఆదుకున్నది మా ప్రభుత్వమే.. 2004కు ముందు అధికారంలో ఉన్నవారు వ్యవసాయమే దండుగన్నారు.. కానీ, మేము ఆసమయంలో దిక్కుతోచని రైతాంగానికి రూ.13 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి భరోసా కల్పించాం..ఇక ముందూ రైతుల సంక్షేమానికి పాటు పడతాం. రుణాలు సకాలంలో చెల్లించినవారికి వడ్డీ మాఫీ చేస్తాం.’’ అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ‘యంత్ర లక్ష్మి’ (వ్యవసాయ యాంత్రీకరణ) ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. సుమారు 30 కంపెనీలు ప్రదర్శనకు పెట్టిన వ్యవసాయ యంత్రాలను, పరికరాలను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు.

కరీంనగర్ అగ్రికల్చర్ (టీ మీడియా): వ్యవసాయ రంగానికి అన్ని విధాల సహాయమందించి రైతాంగాన్ని ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని ఆ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యంత్ర లక్ష్మి (వ్యవసాయ యాంత్రీకరణ) వ్యవసాయ యంత్రాల ప్రదర్శనను ప్రారంభించారు. తొలుత మంత్రికి కాంగ్రెస్ ప్రజా ప్రతిని ధులు ఘన స్వాగతం పలికారు. సుమారు 30 కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రా లు, పరికరాలను జిల్లా మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 2004కు ముందు అధికారంలో ఉన్న వారు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని, ఆ సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి 13 వేల కోట్ల రూపాల రుణాలు మాఫీచేసి భరోసా కల్పించామని అన్నారు.

వ్యవసాయ బడ్జెట్‌తో సంబంధం లేకుండా గత ఖరీఫ్‌లో నష్టపోయిన రైతంగానికి ₹1,800 ఇన్‌పుట్ సబ్సిడీని అందించామన్నారు. పంటల దిగుబడులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నది తమ ప్రభుత్వమేనని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించిన త ర్వాత వ్యవసాయ రంగం ఆధునిక పద్ధతులవైపు పరుగులు పెడుతోందన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వెయ్యి కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేస్తుండగా ₹500 కోట్లు సబ్సిడీ దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని రీతిలో తామిస్తున్నామని అన్నారు. కూలీల కొరత తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో గంటలో ఎకరం నాటు వేసుకునే అవకాశం ఆధునిక వ్యవసాయ యంత్రాల ద్వారా కలగడం సంతోషించాల్సిన పరిణామమని అన్నారు. ప్రస్తు ఖరీఫ్ సీజన్‌లో పత్తి విత్తనాలు దొరక లేదని ప్రతి పక్షాలు చేస్తున్న వాదనలో ఏ మాత్రం నిజం లేదని ఖండించారు. రైతులకు చేదోడుగా ఉంటూ అన్ని విధాల ఆదుకుంటున్నామని, ఇక ముందుకూడా ఇదే కృషిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం...
అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తోందని, ఇక నుంచి అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలబె ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని మ రింత ముందుకు తీసుకెళ్లేందుకు యాంత్రీకరణ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నేదునూర్ గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేం ద్రాన్ని దశల వారిగా పూర్తి చేస్తామని, ప్రస్తుతం 700 మెగావాట్లతో నిర్మిస్తామన్నారు.

విద్యుత్ సరఫరా ముఖ్యం..
ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రధానంగా సాగునీరు కావాలని, ఇపుడు సాగునీరు కావాలంటే విద్యుత్ సరఫరా ముఖ్యమని, ఇవి ఉన్నపుడే యాంత్రీకరణ పథకం సద్వినియోగం అవుతుందని అన్నారు. నేదునూర్, శంకర్‌పల్లి గ్రామాల్లో చేపట్టిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 2009లో శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడం దురదృష్ట కరమన్నారు.

సమస్యలు వివరించిన కలెక్టర్
సమావేశ ప్రారంభంలో ప్రసంగించిన కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి కన్నా లక్ష్మినారాయణ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో సోయాబిన్ సాగువైపు రైతులు దృష్టి సారిస్తున్నారని, గతేడాది 70 వేల హెక్టార్లలో ఆరుతడి పంటలు సాగు చేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఖరీఫ్‌లో 8 వేల హెక్టార్లలో డ్రమ్ సీడర్ల ద్వారా వరి సాగు చేయించామని, వచ్చే రబిలో 50 శాతం వరి సాగు చేసేందుకు కృషి చేస్తామని అందుకు సరిపడే యంత్రాలు జిల్లాకు అందించాలని కోరారు.

2009లో పంటలు నష్టపోయిన రైతులకు ₹ 8 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ రావల్సి ఉందని దానిని వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా బ్యాం కర్లు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తేవాలని సూచించారు. వాటర్ పైప్ యూనిట్స్‌ను జిల్లాలో రైతులు ఎక్కువగా వినియోగించుకుంటున్నారని మరో 500 యూనిట్లు జిల్లాకు అదనంగా మంజూరు చేయాలని కోరగా మంత్రి అందుకు సమ్మతించారు. కార్యకరమంలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎంపీ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిడ్డి ప్రవీణ్‌డ్డి, ఆగ్రోస్ ఎండీ శశిధర్, జాయింట్ కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, జేడీఏ బొప్పాన ప్రసాద్, కేడీసీసీబీ చైర్మన్ కొం డూరు రవిందర్ రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారయణగౌడ్, కరీంనగర్, గంగాధర మార్కెట్ కమిటీల చైర్మన్లు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఉప్పుల అంజనీ ప్రసాద్, వ్యవసాయ అధికారులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd