Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Karimnagar>>  Genaral News
అడ్డంకి వెనుక అసలు కథ!

కరీంనగర్, ఆగస్టు 6 (టీమీడియా) : జిల్లా కేంద్రంలో అంతకంతకూ జనాభా పెరిగిపోతోంది. 2011 లెక్కల ప్రకారం, నగర జనాభా ఇంచుమించు మూడు లక్షలకు చేరుకుంది. ఇంతకు రెండింతల జనం వివిధ అవసరాల నిమిత్తం జిల్లాకేంవూదానికి నిత్యం వచ్చిపోతుంటారు. ఈ మేరకు వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం, రోడ్లు ఇరుగ్గా ఉండడంతో నగరంలో తరుచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో స్పందించిన కలెక్టర్ స్మితాసబర్వాల్ ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘కమాన్-ఇందిరాచౌక్ ’ రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. మొదట్లో పలువురు వ్యతిరేకించినా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అందరూ సహకరించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొన్ని ప్రార్థనా స్థలాలను కూడా తొలగించాల్సి వస్తోంది. ఇందుకు రెండు వర్గాల ప్రజలు ఒప్పుకున్నా, ఓ ప్రార్థనా స్థలాన్ని తొలగించేందుకు ఓ వర్గం ససేమిరా అంటోంది. కలెక్టర్ బుజ్జగింపుతో మొదట్లో ఒప్పుకున్న సదరు వర్గీయులు, ఆ తర్వాత హైదరాబాద్ స్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో ఇప్పుడు ససేమిరా అంటున్నారు. వారు తొలగించనీయకపోతే తాము కూడా ఒప్పుకోమని మిగతా వర్గీయులు మొండికేశారు. ఈ క్రమంలో పలు సంఘటనలు చోటు చేసుకోగా ప్రస్తుతమిది శాంతిభవూదతల సమస్యగా తయారైంది.

హైదరాబాద్ కేంద్రంగా చక్రం..
అప్పట్లో జిల్లాలో పనిచేసిన ఓ ఐఏఎస్ స్థాయి అధికారి, బియ్యం అక్రమ రవాణా, లెవీ కేటాయింపుల్లో మిల్లర్లకు సహకరించారనే ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురయ్యారు. నాడు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ స్మితాసబర్వాల్, అతడిని ప్రభుత్వానికి సరెండర్ చేసేదాకా ఊరుకోలేదు. దీంతో ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ కోపాన్ని మనస్సులో పెట్టుకున్న సదరు అధికారి, ఆ వర్గానికి చెందిన కీలక నేతలతో ఉన్న అనుబంధాన్ని ఆసరాగా చేసుకొని కలెక్టర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విస్తరణ పనులకు అడ్డుపుల్ల వేసినట్లు జిల్లా స్థాయి అధికారుల నుంచి ప్రజావూపతినిధుల దాకా చెప్పుకుంటున్నారు.

ఆ వర్గానికి చెందిన కీలక నేతతో సీఎంపై ఒత్తిడి తేవడం, జిల్లాలో సమావేశం సందర్భంగా ‘ప్రార్థనా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించనీయవద్దు’ అంటూ ప్రకటన చేయించడం వెనుక సదరు అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా సహకరిస్తామన్న ఆ వర్గీయులు తీరా ఇప్పుడు ససేమిరా అంటుండడంతో మిగతా వర్గాలకు చెందినవాళ్లు సైతం తామూ ఒప్పుకోమని భీష్మిస్తున్నారు. ‘అక్కడ తొలగించాకే ఇక్కడకు రండి..’ అని అధికారులకు తేల్చి చెబుతున్నారు. దీంతో సాఫీగా సాగుతున్న విస్తరణ పనులు కాస్తా వివాదాస్పదమయ్యాయి. మరోవైపు నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విద్యావంతులు, మేధావులు, సీనియర్ సిటీజన్లు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గితే నష్టపోయేది మనమేనని స్పష్టం చేస్తున్నారు.

ముఖమైనా చూపకుండానే..
ఇప్పటివరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పనిచేసిన ముఖేష్‌గౌడ్ ఆ పదవికే మచ్చతెచ్చి వెళుతున్నారు. కనీసం ముఖమైనా చూపకుండానే నిష్క్రమిస్తున్నారు. ఒకే ఒక్కసారి.. అదీ హెలిక్యాప్టర్‌లో ముఖ్యమంత్రి వెంట మంథనికి వచ్చి వెళ్లారంటే నేటి వరకు పత్తా లేరు. ఆయన గారు లేక అప్పట్లో డీఆర్సీ సమావేశాలు సహా అనేక అభివృద్ధి కార్యక్షికమాలు నిలిచిపోయాయి. జిల్లాలో జరిగిన ఏ ఒక్క డీఆర్‌సీ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. నిజానికి మూడు నెలలకోసారి, లేదంటే ఆరునెలలకోసారి జరగాల్సిన ఈ సమావేశాలు ఆయన కారణంగా ఒకసారి ఏడాదిపాటు వాయిదా పడ్డ సందర్భాలున్నాయి. ఆ తర్వాత ఆయన లేకుండా సమావేశాలు జరిగాయి. ఇన్‌చార్జి మంత్రిగా ముఖేష్ ఏనాడూ సమావేశం ఊసెత్తలేదు. అప్పట్లో వేములవాడలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన శివరాత్రి ఉత్సవాలకు గానీ, ప్రాణహిత పుష్కరాలకుగానీ హాజరు కాలేదు. జిల్లాలో రైతులు సహా వివిధ వర్గాలు వివిధ సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆయన స్పందించలేదు.

కరువు రాజ్యమేలినా కన్నెత్తి చూడలేదు. ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు జరక్క అన్నదాతలు తల్లడిల్లిన సందర్భంలో గిడ్డంగుల శాఖ మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేదు. అస్తవ్యస్త కరెంటు, అందని తాగునీరు, వ్యాధుల విజృంభన, అధ్వానపు రోడ్లు.. ఇలా సమస్యపూన్నున్నా మంత్రి ముఖం చూపలేదు. నిజానికి ఆయన వైఎస్‌ఆర్ హయాంలో నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడూ డీఆర్సీ సమావేశాన్ని నిర్వహించిన పాపాన పోలేదు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాను వరదలు అతలాకుతలం చేసినపుడు కూడా అటువైపు కన్నెత్తి చూడని ఘనత ఆయనది! అయితే తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉన్న జిల్లాలో పర్యటిస్తే నిరసనలు ఎదురవుతాయనే భయంతోనే రావడం లేదనే విమర్శనలను కూడా ముఖేష్ ఎదుర్కొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd