Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Karimnagar>>  Genaral News
దుమ్మురేపిన ధూంధాం

- వర్షంలోనూ భారీగా తరలివచ్చిన జనం
- విజయమ్మను అడ్డుకుంటామని శపథం
- ‘నేతకార్మిక కుటుంబాల దీక్షా విరమణ సభ’ విజయవంతం


విజయమ్మ రాకను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల గాంధీ చౌక్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ధూంధాం దుమ్మురేపింది.. ఖాకీ నిర్బంధాన్ని ఛేదించుకొని మరీ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం, తమ బొందిలో ప్రాణమున్నంత వరకు విజయమ్మను అడుగుపెట్టనివ్వబోమని శపథం చేశారు.. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకుని మరీ రెండు గంటల పాటు జేఏసీ చైర్మన్ కోదండరాం, ఎంపీ విజయశాంతి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్రసంగాలను ఆద్యంతం ఆసక్తిగా వినడమే కాదు, రసమయి బాలకిషన్ పాటకు గొంతు కలిపారు..

(టీమీడియా, కరీంనగర్/సిరిసిల్ల):విజయమ్మ రాకను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల గాంధీ చౌక్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ధూంధాం విజయవంతమైంది. సభ ప్రారంభానికి ముందు గా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన కేటీఆర్, మహిళలతో భారీ ర్యాలీగా తరలివచ్చారు.
- విజయమ్మరాకను నిరసిస్తూ ఐదు రోజులుగా దీక్షలు చేపట్టిన మహిళలకు ఎంపీ విజయశాంతి, జేఏసీ చైర్మన్ కోదండరాం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ధూం ధాం సభకు ‘నేతకార్మిక కుటుంబాల దీక్షా విరమణ సభ’గా నామకరణం చేసి, ‘విజయమ్మ తెలంగాణకు జై కొట్టి అడుగుపెట్టాలనీ, లేకుంటే అడ్డుకుంటా’మని అదే వేదిక మీదుగా హెచ్చరించారు.
- ధూంధాంలో పాల్గొన్న వక్తలు సోమవారం నాటి సిరిసిల్ల బంద్‌ను విజయవంతం చేసి, విజయమ్మ రాకకు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
- జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, చీమ చిటుక్కుమనకుండా బంద్‌ను విజయవంతం చేసి, విజయమ్మను నిలదీయాలని పిలుపునిచ్చారు.
- మాలమహానాడు నేత అద్దెంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు విజయమ్మకు లేదన్నారు.
- ‘సభకు హాజరుకండి.. జై తెలంగాణ అనండి.. తెలంగాణపై ఆమె వైఖరి ఏమిటో నిలదీయండి’ అని కేటీఆర్ పి లుపునిచ్చారు. జిల్లా ఎస్పీ పులి ఎమ్మెల్యే సభకు అనుమతించి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం లో సభ ఏర్పాటు చేస్తానంటే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సోమవారంలోగా తమను ఎ ప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని, ప్రజలంతా విజయమ్మ సభకు హాజరై నిలదీయాలని పిలుపునిచ్చారు.
- కేటీఆర్ వేదికపై కాకుండా కిందే ప్రజల మధ్య కూర్చున్నారు.
- ప్రొఫెసర్ కోదండరాం సాయంత్రం మూడుగంటలకు సిరిసిల్లకు చేరుకోగా, మెదక్ ఎంపీ విజయశాంతి ఐదుగంటలకు చేరుకొని తొలుత కేటీఆర్ ఇంటికి వెళ్లారు. అనంతరం కోదండరాంతో కలసి దీక్షా శిబిరం వద్దకు వచ్చి దీక్షను విరమింపజేశారు.
- వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కర్ర సహాయంతో నడుచుకుంటూ వేదికపైకి వచ్చారు.
- సభా ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం ప్రారంభమైంది. ప్రజలు చత్రిలు పట్టుకు కూర్చుని తెలంగాణపై తమకున్న ప్రేమను చాటారు.
- సిరిసిల్ల జేఏసీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య అధ్యక్షతన జరిగిన ధూంధాం సభలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మెదక్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రఘునందన్‌రావు, జేఏసీ జిల్లా చైర్మన్ వెంకటమల్లయ్య, సమన్వయ కర్త వెంక టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ, ఠాకూర్ రవీందర్ సింగ్, నాయకులు చీటి నర్సింగరావు, అర్బన్ బ్యాంకు చైర్మన్ బొల్లి రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd