Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Karimnagar>>  Genaral News
హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ కలేనా

మోకాలడ్డుతున్న ఆర్థిక శాఖ నిధులు లేవని దస్త్రం వెనక్కి... భూపయత్నాలు తీవ్రం : ఈటెల
హుజూరాబాద్, జూలై 22 (టీమీడియా) : 25 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రజలకు ప్రతి ఏటా నిరాశే ఎదురవుతోంది. హుజూరాబాద్ రెవెన్యూ సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కలగానే మిగులుతోంది. నిధులు లేవన్న సాకుతో ఆర్థి క శాఖ మోకాలడ్డుతోంది. తెలంగాణ జిల్లాల్లో 6 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లి అన్ని శాఖల క్లియన్స్ పొంది చివరకు ఆర్థిక శాఖ తిరస్కరణకు గురైనట్లు సమాచారం. ఈ జాబితా లో హుజూరాబాద్ కూడా ఉండడం విచారకరం. పరిపాలన సౌలభ్యం కోసం హుజూరాబాద్ కేం ద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్న ప్ర తిపాదనకు ఏళ్లు గడిచినా మోక్షం కలుగడం లేదు. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు పట్టించుకునే నా థుడు కరువయ్యారు. 1985-86లో హుజూరాబాద్, మంథని, సిరిసిల్ల కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి అప్పటి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. అదే సంవత్సరంలో జిల్లాలో పర్యటించిన అప్పటి సీఎం ఎన్టీరామారావు సిరిసిల్ల, మం థనిలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్‌ను మాత్రం విస్మరించారు. దీనికి రాజకీయ నేపథ్యమే కారణమని ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి హు జూరాబాద్ రెవెన్యూ డివిజన్‌కు మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. దీని కో సం ఈ ప్రాంత ప్రజలు అధికారయంవూతాంగానికి, ప్రజా ప్రతినిధులకు అనేక సార్లు విజ్ఞాన ప త్రాలు సమర్పించారు. గత ముఖ్యమంత్రి రాజశేఖర్‌డ్డి హయాంలో కొత్త డివిజన్‌ల ఏ ర్పాటు ప్రతిపాదనపై కసరత్తు జరిపినప్పుడు హు జూరాబాద్ ప్రముఖంగా వినిపించింది. ఆచరణలో మాత్రం రిక్తహస్తమే చూపించారు.

ప్రయోజనాలు ఎన్నో
హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడితే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతి పనికి కరీంనగర్ వెళ్లి రావాల్సి వస్తుంది. అధికారులు కూడా చిన్నమీటింగ్‌లకు కూడా జిల్లా కేంద్రానికి వెళ్లక తప్పడం లేదు. హుజూరాబాద్‌లో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేస్తే హుజూరాబాద్‌తో పాటు జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నంమండలాల ప్రజలకు లబ్ది చేకూరుతుంది. కరీంనగర్ రెవెన్యూ డివిజన్ ఎక్కువ మండలాలతోవిస్తరించి ఉండడం మూలంగా భూముల వివాదాలతో పాటు అనేక సమస్యలు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ప్రస్తుతం డివిజన్ స్థాయిలో పోలీసు, విద్యాశాఖ, ట్రాన్స్‌కోలో హుజూరాబాద్ డివిజన్‌గా గుర్తిస్తూ ఆ స్థాయి అధికారులను ఇక్కడ నియమించారు. ఒక రెవెన్యూ శాఖ నుంచి మాత్రమే స్పందన లేదు.

1952లోనే రెవెన్యూ డివిజన్..
1952 సంవత్సరానికి పూర్వమే హుజూరాబా ద్ కేంద్రంగా డివిజన్ పనిచేసింది. దీని పరిధిలో మంథని, పరకాల, హుజూరాబాద్ తా లుకాలు ఉండేటివి. మంథని ప్రాంత రాజకీయ నాయకుల ఒత్తిడిల మూలంగా పెద్దపెల్లికి రెవెన్యూ డివిజన్‌ను మార్చారు. జిల్లాల పునఃవిభజనలో పరకాల వరంగల్ జిల్లాలోకి వెళ్ళింది. ఇప్పుడు అదే తరహాలో హుజూరాబాద్‌లో రెవెన్యూ డివిజన్ కోసం ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు వివక్షే
జిల్లాల్లో రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటులోనూ తెలంగాణపై ఆంధ్రపాలకులు వివక్ష చూపుతున్నారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రలో 6నుంచి 8 మండలాలకే రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు 8వరకు ఆర్డీవో కేంద్రాలు ఉన్నాయి. అదే తెలంగాణలో మాత్రం 10 నుంచి 14 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు.

తొందరలోనే ఏర్పాటు.. : ఈటెల
హుజూరాబాద్ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు శాయశక్తుల కృషి చేస్తున్నాం. ఆర్థిక శాఖ తిరస్కరించినప్పటికి మళ్లీ నివేదికలు తయా రు చేయించి పరిశీలనకు పంపిస్తాం. హుజూరాబాద్ ప్రాంత ప్రజలకు తప్పనిసరిగా రెవెన్యూ డివిజన్‌ను అందుబాటులోకి తెస్తాను.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd