|
|
ముగిసిన ‘గ్రూప్-2’
కరీంనగర్ ఎడ్యుకేషన్, జూలై 22 (టీమీడియా): ఏపీపీఎస్సీ గ్రూప్-2 రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. శనివారం పేపర్-1 నిర్వహించగా ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 వరకు పే పర్-2 పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పేప ర్-3 పరీక్ష జరిగింది. పేపర్-2కు 20553, పేపర్-3 పరీక్షకు 20410 మంది హాజరయ్యారు. కరీంనగర్‌లో 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పది నిముషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులనూ అనుమతించారు. 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది లైసన్ ఆఫీసర్లు, 52 మంది డిప్యూటీ తహసీల్దార్లు సిట్టింగ్ స్క్వాడ్లుగా, 16 మంది రూట్ ఆఫీసర్లుగా విధులు నిర్వహించారు. 8 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. పేపర్-2కు 76.45 శాతం, పేపర్-3కి 75.92 శాతం మంది హాజరయ్యారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో కరీం‘నగరం’ కిక్కిరిసింది. ఉదయం పేపర్-2 రాసిన అభ్యర్థులు భోజనం కోసం హోటళ్లకు వెళ్లడంతో అన్నీ కిటకిటలాడాయి. పరీక్ష ముగించుకున్న అభ్యర్థులు గమ్య స్థానాలకు వెళ్లేందుకు బస్సుల కోసం నిరీక్షణ తప్పలేదు. Other News
|