Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Karimnagar>>  Genaral News
ధర్మపురిలో భక్తుల సందడి

ధర్మపురి, జూలై 22 (టీ మీడియా): ధర్మపురి క్షేత్రం భక్తులతో కళకళలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం వేలదిగా తరలివచ్చిన భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గోదావరిలో స్నానాలు చేశారు. స్వామి వార్లను దర్శనానికి బారులు తీరారు. లక్ష్మీ నృసింహ స్వామి (యోగ, ఉగ్ర)లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలను చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినా భక్తుల రద్దీ తగ్గలేదు. గోదావరి ఒడ్డున ఎలాంటి సౌకర్యాలు లేక పోవడంతో మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవస్థానంలో, ఆలయ ప్రాంగణంలోనూ భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామి వారిని దర్శించుకున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd