‘హస్త’ లాఘవం.. ‘ఆమ్’ బుక్క
(టీ మీడియా, హుజూరాబాద్):వైఎస్సార్ అభయహస్తం : స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉండి వైఎస్సార్ అభయహస్తం ఇ న్సూన్స్ స్కీంలో పేరు నమోదు చేయించుకున్న వారి పిల్లలకు ఈ స్కాలర్‌షిప్ అందుతుంది. 9, 10 తరగతులతో పాటు, ఇంటర్‌కు సమానంగా ఉండే అన్ని కోర్సుల విద్యార్థులకూ సంవత్సరానికి రూ.1200 అందిస్తారు. ఆమ్ ఆద్మీ భీమా పథకం : నిరుపేద కుటుంబాలకు చెందిన స్వశక్తి సంఘం సభ్యురాలి భర్త పేరు న రూ.15 చెల్లించి ఆమ్ ఆద్మీ బీమాలో చేరాలి. వీరికి ఇన్సూన్స్‌తో పాటు 9, 10 తరగతులతో పాటు, ఇంటర్ స్థాయి కోర్సులు చదివే విద్యార్థులకు యేటా రూ.1200 ఉపకార వేతనం ఇస్తారు.
మూడేళ్లలో రూ.20కోట్ల పంపిణీ
జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాలను 2009-10 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. ఇప్ప టి వరకు మొత్తం సుమారు రూ.20కోట్లను స్కాలర్‌షిప్ల రూపేణా పంపిణీ చేశారు. వైఎస్సార్ అభయహస్తం స్కీంలో 2009-10 సంవత్సరంలో 33,552 మంది విద్యార్థులకు రూ.4కోట్ల 26లక్షల 2వేల 400, 2010-11లో 30, 349 మం ది విద్యార్థులకు రూ.3కోట్ల 64లక్షల 18వేల 800, 2011-12లో 43,494 మందికి రూ.5కోట్లా 21లక్షలా 92వేల 800 అందించా రు. ఆమ్‌ఆద్మీ బీమా యోజనలో 2009-10లో 18, 111 మందికి రూ.2కోట్ల 17లక్షల 33వేల 200, 2010-11లో 19,230 మందికి రూ.2కోట్లా 30లక్షల 76వేలు, 2011-12లో 23,461 మందికి రూ. 2కోట్లా 81లక్షల 53వేల 200 ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే వీటిలో అనేకం అనర్హుల చెంతకు చేరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా రూ.5కోట్ల దాకా స్వాహా అయినట్లు స్వయంగా ఐకేపీ సిబ్బందే అంగీకరిస్తున్నారు. కేవలం సర్టిఫికెట్ల ధ్రువీకరణ ఆధారంగానే మంజూరు చేయాల్సి ఉండడంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలనా లేకుండానే అధికారులు స్కా లర్‌షిప్‌లు మంజూరు చేసి, ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.
అసలేం జరుగుతోంది..
స్వశక్తి సంఘాల సభ్యులు నిబంధనలను తోసిరాజని ‘‘సర్కారు సొమ్మే కదా ఎవరిదేం పోయిందం’’టూ వ్యవహరిస్తున్నారు. ఇందిరాక్షికాంతి పథం (ఐకేపీ) పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉపకార వేతనాల పంపిణిపై ‘ టీ మీడియా ’ పరిశీల న జరపగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశా యి. శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెం దిన చిమ్మని సాయికుమార్ మండల కేంద్రంలోని శ్రీ కేశవ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అతను 9వ తరగతి చదువుతున్నట్లు ధ్రువీకరణ పత్రం పొంది, స్కాలర్‌షిప్ మంజూరు చేయించుకున్నాడు. అదే గ్రామంలో ఓ విద్యార్థి 2010లో మృతి చెందగా, అతని పేరుతో 2011 లో ఉపకార వేతనం అందింది. ఓ యువతి ప్రైవే ట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, హుజూరాబా ద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నట్లు నకిలీ పత్రం సృష్టించి స్కాలర్‌షిప్ పొందగా పెండింగ్‌లో ఉంది. మొలంగూర్‌కు చెందిన ప్రమీల తనకు పిల్లలు లేకున్నా, ఇద్దరు పిల్లలున్నట్లు నకిలీ పత్రాలు తె చ్చి ఏటా స్కాలర్‌షిప్ పొందుతోంది. అదే గ్రా మంలో సహీరాబాను రెండో తరగతి చదువుతుండగా 9వ తరగతి సర్టిఫికేట్ సృష్టించి స్కాలర్‌షిప్ పొందుతోంది. హుజూరాబాద్ మండలం చెల్పూర్‌కు చెందిన గొడుగు రాజ్‌కుమార్ తన పేరున మొలంగూర్‌లో ఉపకార వేతనం పొందుతున్నా డు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటివి కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. అయితే మంజూరైన స్కాలర్‌షిప్‌లలో మూడో వంతు మేరకు బోగస్‌వే ఉంటున్నట్లు స్వయంగా ఐకేపీ ఉద్యోగులే పేర్కొంటున్నారు. ఎక్కడైనా ఫిర్యాదులొస్తే వాటిని నిలిపివేస్తున్నారే కానీ కారకులపై చర్యలు తీసుకోవడం లేదు. కొందరైతే రెండు పథకాల్లోనూ లబ్ధి పొందుతుండడం గమనార్హం.
సామాజిక కార్యకర్త లదే హవా
ఆమ్‌ఆద్మీ బీమా అభయహస్తం స్కాలర్‌షిప్‌ల స్వాహాలో సామాజిక కార్యకర్తలదే హవా కొనసాగుతున్నట్లు సమాచారం. బోగస్ ఎన్‌రోల్‌మెంట్ల ను వీరే సృష్టిస్తున్నట్లు కూడా ఐకేపీ అధికారులు చెబుతున్నారు. స్కాలర్‌షిప్ మంజూరైన వారి జా బితాను గ్రామ పంచాయతీల ముందు అంటించా ల్సి ఉన్నా అలాంటిదెక్కడా కనిపించడం లేదు. స్కాలర్‌షిప్ డబ్బులను సీఏలు మరి కొందరితో కలిసి కాజేస్తున్నట్లు సమాచారం. గతంలో లబ్ధిదారులకు నేరుగా నగదును ఇచ్చేశారు. నిరక్షరాస్యుల సంతకాలను సీఏలే ఫోర్జరీ చేసి, డబ్బులను కాజేసినట్లు కూడా మహిళలు చెప్తున్నారు. సీఏలకు చెక్ పెట్టేందుకు అధికారులు చెక్కుల ద్వారా చెల్లింపు పద్ధతిని తీసుకొచ్చారు. పెద్ద మొత్తంలో చెక్కుబుక్కులను ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తుండడం తో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. లబ్ధిదారులందరికీ బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి ఆన్‌లైన్ ద్వారా స్కాలర్‌షిప్‌లను అందించే ఏర్పాట్లు వచ్చే ఏడాది నుంచి చేస్తున్నట్లు వినికిడి. కాగా ఉపకార వేతనాల పంపిణీపై పూర్తి స్థాయిలో విచారణ జ రిపి, సర్టిఫికెట్లు జారీ చేస్తున్న వారిని, మోసం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Other News