‘పుట్ట’డు కష్టాలు
వైఎస్సార్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు జిల్లా కన్వీనర్ పుట్ట మధు తీరుపై రగిలిపోతున్న నాయకులు
ఒక్కొక్కటిగా బయట పడుతున్న లుకలుకలు విజయమ్మ పర్యటనపై అనుమానాలు.
(టీ మీడియా, కరీంనగర్ సిటీబ్యూరో):వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కటిగా వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. జిల్లా కన్వీనర్ పుట్ట మధుకర్ ప్రవర్తనపై నాయకులు మంగళవారం బహిరంగ వీరంగానికి దిగడం ఇందుకు బలం చేకూర్చుతోంది. మరో ఐదారు రోజుల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సిరిసిల్ల చేనేత కార్మికుల కోసం ఒక రోజు దీక్ష చేప వస్తున్న నేపథ్యంలో పార్టీలో బయటపడుతున్న లుకలుకలుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీ జిల్లా కన్వీనర్‌కు వ్యతిరేకంగా రెండు మండల శాఖల కన్వినర్లు జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన దీక్షకు దిగడం, పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కన్వినర్ మధుపై కార్యకర్తలు దాడికి యత్నించడం వంటి సంఘటనలు ఆ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలకు అద్దం పడుతున్నాయి.
జిల్లా కన్వినర్ పుట్ట మధు తన సామాజిక వర్గానికి చెందిన నాయకులను మాత్రమే ప్రోత్సహిస్తూ మిగతా వర్గాల నాయకులపై వివక్ష చూపుతున్నారనేది పార్టీలో విబేధాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మధుకర్ పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారని, మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలోఉన్న సందర్భంలో పార్టీని బతికించుకున్నామని, ఇపుడు పార్టీలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని, ఆ పార్టీ సీనియర్ నాయకులు చాలా కాలంగా మధు నాయకత్వాన్ని విభేదిస్తూ వస్తున్నారు. పార్టీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నా యకులతో మధుకర్‌కు సఖ్యత లేదనే విమర్శలూవస్తున్నాయి. ముఖ్యంగా ఓ నాయకుడి ముందు మరో నాయకుడిపై నోటి దురుసు వెల్లగక్కడం మధుకర్‌కు బాగా అలవాటైందని పార్టీ సీనియర్ నాయకుడు సింగిడ్డి భాస్కర్‌డ్డి లాంటి నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కొందరు మహిళా నాయకులపై పార్టీ సమావేశాల్లోనే బాహాటంగా అనుచిత వ్యాఖ్యలు చే స్తున్నాడని మరి కొందరు చెబుతున్నారు. జిల్లాలోని 57 మండలాల్లో ఇద్దరు దళిత నాయకులకు మండల కన్వీనర్లుగా అవ కా శం వస్తే, బోయినపల్లికి చెందిన కాంపెల్లి శరత్‌కుమార్‌ను ఏకపక్షంగా తొలగించి తన సామాజిక వర్గానికి చెందిన నాగరాజు ను ఆ మండల కన్వీనర్‌గా ప్రకటించారని ఎస్సీ సెల్ జిల్లా కన్వినర్ అక్కెనపల్లి కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ధర్మపురి మండల కన్వీనర్‌గా తాను వెంకవూటావ్ అనే కార్యకర్తను సూచి స్తే, మూడు నెలలుగా ఎటూ తేల్చకుండా బోయినపల్లి మం డల కన్వీనర్ విషయంలో మాత్రం పార్టీలో చర్చించకుండా ఏ కపక్షంగా వ్యవహిరించారని పార్టీలో మెజార్టీ నాయకులు విభేదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే తిమ్మాపూర్ మండల కన్వీనర్ కనపర్తి ప్రవీణ్ వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపుతూ కనీసం ఒక షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించడం సీనియర్ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తోంది. పార్టీ నిర్మాణం విషయంలో కూడా మధుకర్ తన నియోజక వర్గంలోని ఆరు మండలాలకు రెండు మండలాల్లో మాత్రమే కన్వీనర్లను నియమించారని, మొన్నటి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వివిధ పార్టీల నుంచి నాయకులు తమ పార్టీ లో చేరేందుకు వస్తున్న నాయకులు ఉన్నా మధుకర్ ప్రవర్తన కారణంగా ఎవరూ ముందుకు రావడం లేదని కొందరు నాయకులు వాపోతున్నారు. పార్టీ ఆవిర్భావ సమయంలో ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో చేరిన కొందరు సీనియర్లు ఇపుడు పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతుతున్నారు.
అయితే మంగళవారం కరెంట్ కోతలపై నిరసన వ్యక్తం చేసేందుకు ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళుతు న్న సందర్భంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి అయిలు రమేష్‌తో కన్వీనర్ మధుకర్ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఆయనపట్ల ఇదే వైఖరిని ప్రదర్శించడంతో కార్యకర్తలు, నాయకులు తీవ్రస్థాయిలో గొడవకు దిగారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి, ఒక దశలో మధును కొట్టేందుకు యత్నించడంతో సమావేశం రసాభాసగా మారింది. అయితే పార్టీలో విభేదాలు కొత్తేమీ కాకున్నా ఈ నెల 23న వైఎస్ విజయమ్మ జిల్లాకు వస్తున్న తరుణంలో పార్టీలో విభేదాలు రచ్చకెక్కడం ఇక్కడ చర్చానీయాంశమై, ఆమె పర్యట పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది వరకే మధుపై అధిష్ఠా నానికి ఫిర్యాదు చేసిన పార్టీ నాయకులు జిల్లా నుంచి పార్టీలో కీలక పదవుల్లో ఉన్న కేకే మహేందర్‌డ్డి, ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. మధుకర్‌ను కన్వీనర్‌గా కొనసాగిస్తే తామంతా పా ర్టీకి దూరం కావాల్సి వస్తుందనే హెచ్చరికలు కూడా అధిష్ఠానానికి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానమే జోక్యం చేసుకుని పార్టీలో విభేదాలను పరిష్కరించాలని తటస్థ నాయకులు పేర్కొంటున్నారు.
‘నన్ను కథలాపూర్ ఎస్‌ఐ కొట్టాడు..!’
కోరుట్ల టౌన్: తాను ఏ తప్పు చేయకున్నా కథలాపూర్ ఎస్‌ఐ ఠాణాకు పిలిపించి, తనను అకారణంగా కొట్టాడని ఆరోపిస్తూ కోరుట్ల ప్రభుత్వాసుపత్రి ఎదుట కథలాపూర్ మాజీ ఎంపీటీసీ వర్ధినేని నాగేశ్వర్‌రావు మంగళవారం ఆందోళనకు దిగా డు. అక్కడికి వచ్చిన విలేకురులతో తన గోడు వె ల్లబోసుకున్నాడు. ఐదు రోజుల క్రితం పోసానిపేట్‌లోని తన స్నేహితుడు శ్రీనివాస్‌కు చెందిన కోళ్లఫారంలో గొడవ జరిగిందనీ, దీంతో తనకు సం బంధం లేకున్నా విచారణ పేరిట మంగళవారం కథలాపూర్ ఎస్‌ఐ మొగిలి, తనను అకారణంగా పోలీసుస్టేషన్‌కు పిలిపించి కొట్టాడని వాపోయా డు. దీనిపై ఎస్సై మొగిలి మాట్లాడుతూ, నాగేశ్వర్‌రావు పోసానిపేట్ శ్రీనివాస్‌కు చెందిన కోళ్ల ఫా రంలోని ఓ వ్యక్తిపై దాడి చేశాడనీ, అతడి ఫిర్యాదు మేరకు స్టేషన్‌కు పిలిపిస్తే తాగొచ్చి పోలీసులను తిట్టాడని చెప్పారు. అందుకే ఆల్కహాల్ పరీక్ష నిర్వహించేందుకు కోరుట్ల ఆస్పవూతికి తీసుకురాగా, ఇక్క డ బైఠాయించినట్లు చెప్పారు. మద్యం తాగాడని పరీక్షలో తేలినందున, కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. అతనిని కొట్టామన్నదాంట్లో వాస్తవం లేదని వివరించారు.
Other News