Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Karimnagar>>  Genaral News
టీఆర్‌ఎస్ కన్నెర్ర

- జిల్లావ్యాప్తంగా విద్యుత్ ఉపకేంద్రాల ముట్టడి
- ఇల్లంతకుంట సబ్‌స్టేషన్‌పై దాడి, ఫర్నిచర్ ధ్వంసం
- రాష్ట్ర సర్కారు వివక్షపై నేతల ఆగ్రహం
- మా విద్యుత్ సీమాంధ్రకెట్ల? కెప్టెన్ ధ్వజం

కరెంట్ కోతలపై టీఆర్‌ఎస్ కన్నెర్ర జేసింది.. సోమవారం జిల్లా వ్యాప్తంగా సబ్‌స్టేషన్ల ముట్టడించింది.. ఇక్కడి విద్యుత్‌ను సీమాంధ్రకు తరలిస్తూ జిల్లా రైతుల పొలాలను ఎండబెడుతున్న సర్కారు తీరుపై ధ్వజమెత్తింది.. వెంటనే విద్యుత్ కోతలు ఎత్తివేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది..

- టీ మీడియా, కరీంనగర్ సిటీబ్యూరో



టీ మీడియా, కరీంనగర్ సిటీబ్యూరో:కరెంట్ కోతలపై టీఆర్‌ఎస్ కన్నెర్ర చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. పలుచోట్ల సబ్‌స్టేషన్లు ముట్టడించి, కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. హుస్నాబాద్ మండల కేంద్రంలోని విద్యుత్ కేంద్రం ముట్టడిలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. రామగుండం ఎన్‌టీపీసీలో ఉత్పత్తవుతున్న విద్యుత్‌లో కేంద్రం వాటా తీసేయగా, మిగిలిన కరెంట్‌తో తెలంగాణకు నిరంతర విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి విశాఖపట్నం, చిత్తూరు, కృష్ణా జిల్లాలకు సరఫరా చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 30 లక్షల బోర్లుంటే తెలంగాణలో 20 లక్షలున్నాయనీ, ఇదేమీ పట్టని ప్రభుత్వం కరెంట్ కోతలు విధించి ఇక్కడి రైతులను ముంచుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మానకొండూర్ నియోజక వర్గ ఇన్‌చార్జి ఓరుగంటి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఇల్లంతకుంట విద్యుత్ ఉప కేంద్రం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు కార్యాలయంపై దాడిచేసి, అద్దాలు ధ్వంసం చేసి, నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో సర్దార్ రవీందర్ సింగ్, ఎడ్ల అశోక్ తదితరుల ఆధ్వర్యంలో ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యకర్తలు లోపలకు రాకుండా పోలీసులు గేట్లు వేయగా, లోపలికి చొచ్చుకెళ్లి ముఖ్యమంవూతికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు పలువురిని ఈడ్చివేయగా, కార్యాలయం గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. జగిత్యాలలో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట, ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. మెట్‌పల్లిలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్ నాయకులు, జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సిరిసిల్లలో విద్యుత్ డివిజనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డివిజన్‌లోని అన్ని మండలాల్లో నిరసన కొనసాగింది. హుజూరాబాద్ విద్యుత్ డివిజన్ పరిధిలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పెద్దపల్లిలో మనోహర్‌డ్డి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గోదావరిఖనిలో కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. మంథని , మహాముత్తారం మండలాల్లో జరిగిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd