Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Karimnagar>>  Genaral News
విద్యారంగానికి ఉద్యమ దన్ను

- సీమాంధ్రకు దీటుగా ఎదుగుదల
- తెలంగాణ వస్తే జగిత్యాల జిల్లా
- ఏస్ టెక్నో స్కూల్ ప్రారంభోత్సవంలో కేసీఆర్


జగిత్యాల, టీ మీడియా : విద్యా రంగానికి తెలంగాణ ఉద్య మం దన్నుగా నిలుస్తోందని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. జగిత్యాల పట్టణంలో ఏస్ టెక్నో పాఠశాల నూతన భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత జిల్లాల పునర్విభజన కార్యక్ర మం ఉంటుందన్నారు. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాంలక్ష్మణ్, పేర్వారం రాములు, తదితరులతో కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొం దిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాల పునర్విభ జన ఎలా ఉండాలో బ్లూప్రింట్‌ను అందించారన్నారు. ఇందు లో జగిత్యాల డివిజన్‌ను జిల్లా కేంద్రంగా మార్చాలని సూచిం చారని పేర్కొన్నారు. దీంతో పాటు అభివృద్ధిని సాధించిన జిల్లా గా తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా మారుతుందన్నారు. సీమాంధ్రుకు దీటుగాతె లంగాణలో నాణ్యమైన విద్యనందిస్తు న్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు భావి భారత పౌరులను తయారుచేసే మహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్నారని కొనియా డారు. ప్రతి చిన్నా రికి తల్లి ఒడి మొదటి బడని, అక్కడి నుండి పాఠశాలకు వచ్చే చిన్నారులకు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యా యులదేనన్నారు. తాను ఈ రోజు గొప్ప ప్రసంగకుడిగా ఉండ డానికి తన గురువు మృత్యుంజయ శర్మే కారణమని పేర్కొన్నా రు. అనాటి ఉపాధ్యాయుడి సహకారమే తనలోని సాహిత్య పిపాసకు తలుపులు తెరిచేలా చేసిందన్నారు. ఇంటర్‌లో తనకు బోధన చేసిన చుక్కా రామయ్యను సైతం కేసీఆర్ జ్ఞప్తికి చేసు కున్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో తనకు చరిత్ర పాఠాలు చెప్పిన డాక్టర్ జైశెట్టి రమణయ్యతో వేదిక పంచుకోవడం తన కు ఆనందంగా ఉందన్నారు.

ఉపాధ్యాయులు విద్యార్థుల అభి రుచిని గమనించి వారికి విద్యా బోధన సాగించాలని ఆయన సూచించారు. విద్యా రంగంలో అత్యున్నత స్థాయికెదిగిన చుక్కా రామయ్య నేతృత్వంలో ఏస్ టెక్నో పాఠశాల నిర్వహి స్తున్నారని, త్వరలో ఉత్తమ పాఠశాలగా రూపుదిద్దుకోవడం ఖాయమన్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలం గాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం సైతం విద్యా రంగంలో ముందుకు సాగుతుందన్నారు. నేటి పోటీ రంగంలో రాణించాలంటే విద్య ప్రధాన సాధనమని పేర్కొన్నారు. ఎమ్మె ల్యేలు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, సోమారపు సత్య నారాయణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జగిత్యాల ఆర్డీఓ హన్మంతరావు, ఏఎస్పీ రమారాజేశ్వరి, టీఆర్ ఎస్ నాయకు లు మాజీ ఎంపీ వినోద్‌కుమార్, రాజేశంగౌడ్, చరిత్ర కారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య, జితేందర్‌రావు, రమ ణరావు, డాక్టర్ గంగారెడ్డి, తుల ఉమ, పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాదినేని రా జేందర్, తదితరులు న్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతి క కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అతిథులను శాలువాలతో కరస్పాండెంట్ సత్కరించారు.

అందరి చూపూ వారిపైనే..
కేసీఆర్, జీవన్‌రెడ్డి మస్తు ముచ్చటించడం పలువురిని ఆకర్షింపజే సింది. మాజీ మంత్రి తన ప్రసంగంలో టీఆ ర్‌ఎస్ అధినేతను పొగ డ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ దశాబ్ద కాలం గా సాగిస్తున్న ఉద్యమం ఉధృత స్థాయికి చేరుకుందని, త్వరలో నే తెలంగాణ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జీవనన్న హ్యాండ్ లక్కీ అంటూ ఆయన మెచ్చుకున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd