‘కోతల’ కాలం
- నేటి నుంచే కరెంట్ ‘కట్’కట..!
- నగరాలకు ఐదు గంటలు..
- మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో 6గంటలు..
- గ్రామాల్లో 12 గంటలు..
- పరిశ్రమలకు వారంలో మూడు రోజులు..
- ఆందోళనలో జిల్లా ప్రజలు..
విద్యుత్ సంక్షోభం తారస్థాయికి చేరుకోవడంతో జిల్లావాసులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నేటి నుంచి నగరాల్లో 5గంటలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో 6 గంటల చొప్పున కోతలు అమలు కానున్నాయి. ఇక గ్రామాల్లోనైతే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా.. అంటే ఏకంగా 12 గంటలు కరెంట్ ఉండదుగాక ఉండదు..! అంటే గ్రామీణులు కేవలం రాత్రుల్లో బల్బులను మాత్రమే వెలిగించుకోవచ్చన్నమాట..! ఇటు పరిశ్రమలకు కూడా వారంలో మూడు రోజులు కరెంట్ ‘కట్’కట తప్పదు! తాజా కోతలపై జిల్లావాసుల్లో ఆందోళన మొదలుకాగా, పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది..!
కరీంనగర్ సిటీబ్యూరో, జూలై 12 (టీ మీడియా): విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి.. వర్షాలు లేక రిజర్వాయర్లు అడుగంటిపోవడం, రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌రాకపోవడం, కొన్ని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి కారణాలతో కోతలు అనివార్యమైనట్లు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన డిస్కంల ఎండీల సమాశంలో ట్రాన్స్‌కో సీఎండీ హిరాలాల్ సమారియా ప్రకటించారు. అధికారికంగా విధిస్తున్న కోతలను వివరాలను వివరించారు. జిల్లా కేంద్రంతోపాటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో రోజుకు ఐదు గంటలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, విద్యుత్ ఉప కేంద్రాలున్న గ్రామాల్లో రోజుకు ఆరు గంటల చొప్పున గృహ అవసరాలకు ఇస్తున్న కరెంటులో కోతలు పెడుతున్నారు. ఇక మిగతా గ్రామాల్లో కేవలం రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల కోసమే కరెంట్ సరఫరా చేస్తున్నారు. పరిక్షిశమలకు వారంలో మూడు రోజులు, చిన్న తరహా పరివూశమలకు రెండు రోజులు పవర్ హాలీడే ప్రకటించారు. వ్యవసాయ ఆధారిత పరిక్షిశమలైన రైస్ మిల్లులు, కోళ్ల పరిక్షిశమలకు 40 శాతం విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సింగరేణి, తాగునీటి ప్రాజెక్టులు, ఆస్పవూతులు, రైల్వే శాఖలను కోతల నుంచి మినహాయించారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌ను అందించేందుకే తప్పని సరై కోతులు విధిస్తున్నట్లు ట్రాన్స్‌కో సీఎండీ హిరాలాల్ సమారియా ప్రకటించారు. విధించిన కరెంట్ కోతలను గురువారం నుంచి అధికారికంగా అమలు చేయాలని ఈ మేరకు జిల్లా అధికారులకు ఫోన్ మెస్సెజ్ అందింది.
కోతల వేళలు..
జిల్లాలో కోతల వేళలను ఉత్తర విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ ఎస్ రంగారావు బుధవారం రాత్రి ప్రకటించారు. కరీంనగర్, రామగుండం కార్పోరేషన్లలో ఉదయం .00 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.00 నుంచి 3.30 గంటల వరకు, మున్సిపాలిటీలలో ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు, మండల కేంద్రాలు, విద్యుత్ ఉపకేంవూదాలు ఉన్న గ్రామాల్లో ఉదయం 7.00 నుంచి 10.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. మిగతా గ్రామాలకు దినమంతా కరెంట్ కత్తిరిస్తున్నారు. సాయంత్రం 6.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు రాత్రి వేళలో లైటింగ్ కోసం మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
వారంలో నాగులు రోజులే...
చిన్న తరహా పరిక్షిశమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే పాటించాలని, మరో రోజు వారాంతపు సెలవు పాటించాలని ఆదేశాలు ఇచ్చారు. సుమారు 3,500 వరకు ఉన్న చిన్న తరహా పరిక్షిశమలకు ఇది కొంత ఊరట కలిగించే అంశమే. కాగా, మధ్యతరహా, భారీ పరిక్షిశమలకు వారంలో నాలుగు రోజులు మాత్రమే కరెంట్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఒక వారాంతపు సెలవుతోపాటు రెండు రోజులు పవర్ హాలీడేస్‌ను పాటించాలని ఆదేశించారు. ఇది చాలదన్నట్లు అన్ని తరహాల పరివూశమలకు రోజుకు నాలుగు గంటల పాటు కోతలు అమలులో ఉంటాయి. సాయంత్రం 6. 30 నుంచి రాత్రి 10. 30 వరకు పవర్ పీక్‌లోడ్ ఉంటున్న కారణంగా పరివూశమలు ఉత్పత్తి చేయరాదని ఆంక్షలు పెట్టారు.
సింగరేణి, రైల్వే, అత్యవసర సేవలు అందించే ఆస్పవూతులకు మాత్రం కోతలు ఉండవని అధికారులు ప్రకటించారు. అయితే ప్రత్యేక ఫీడర్ల సదుపాయం ఉన్న ఆస్పవూతులకే నిరంతర విద్యుత్ అందించే అవకాశాలున్నాయి. వ్యవసాయ ఆధారిత పరిక్షిశమలైన రైస్‌మిల్లులు, కోళ్లపరిక్షిశమలు, కోల్డ్ స్టోరేజీలకు 40 శాతం విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 60 శాతం విద్యుత్‌ను మాత్రమే వాడుకునేలా చర్యలు తీసుకోవాలని, కింది స్థాయి అధికారులను ఎస్‌ఈ ఆదేశించారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు మిగతా రంగాలకు కోతలు అనివార్యమయ్యాయని ఆయన తెలిపారు.
జిల్లా కోటా దాటలేదు..
జిల్లాలో మొత్తం 11 లక్షలకు పైచిలుకు కనెక్ష న్లు ఉన్నాయి. ఈ నెలలో జిల్లాకు 7.75 మిలియ న్ల విద్యుత్ కోటాను కేటాయించారు. ఇందులో 7.00 మిలియన్ యూనిట్లు మాత్రమే వాడుకుంటున్నాం. 3.50 లక్షల విద్యుత్ కనెక్షన్లుకు ప్రతి రోజు 7 .00 గంటల చొప్పున సరఫరా చేస్తే 3.52 నుంచి 4 మిలియన్ యూనిట్ల విద్యుత్ అ వసరం ఉంటుంది. వ్యవసాయ పనులు సాగితే ఇప్పటికే 10.00 మిలియన్ యూనిట్లుకు డి మాండ్ ఉండేది. అయితే వర్షాలు లేక జిల్లాలో వ్యవసాయ పనులు ఇంకా ఊపందుకోలేదు. ప దిరోజులుగా ఇతర జిల్లాల్లో అనధికారికంగా వి ద్యుత్ కోతలు అమలవుతున్నా దాని ప్రభావం జిల్లాపై పడలేదు. ఎందుకంటే కోటాకు మించి జి ల్లాలో వినియోగం కాలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోయి జల విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం, రామగుం డం, విజయవాడ థర్మల్ విద్యుత్‌లో సమస్యలు ఏర్పడటం వంటి కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా అమలోకి వచ్చిన కోతలు జిల్లాపైనా ప్రభావం చూపుతున్నాయి. వర్షాలు అనుకూలించి విద్యుత్ ఉత్పత్తి ఊపందుకునే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులు నిండుకుంటే మరింత గడ్డకాలం ఎదురు కావచ్చు.
Other News