Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Karimnagar>>  Genaral News
ఎస్సీ, ఎస్టీల భూసమస్యలను సత్వరమే పరిష్కరించండి..

కరీంనగర్, జూలై 11 (టీమీడియా) : ఎస్సీ, ఎస్టీల భూసమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్మితాసబర్వాల్ ఆ ర్డీఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ‘ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధం.. అంటరానితనం నిర్మూలన’పై జరిగిన జిల్లాస్థాయి విజిపూన్స్‌అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ నిధుల దుర్వినియోగంపై అదనపు జేసీతో విచారణ జరిపించామనీ, అందులో జిల్లా రెవెన్యూ అధికారి పాత్ర లేదని తేలినట్లు చెప్పారు. ఎస్పీ కార్యాలయం నుంచి నివేదిక, బిల్లులు తయారీలో ఆలస్యం వల్లే చెక్కుల పంపిణీలో జాప్యం జరిగిందని వివరించారు. ఆలస్యానికి కారకులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు. అస్నాపూర్ భూ నిర్వాసితుల్లో అర్హులైన వారికి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. ఈ గ్రామం నుంచి దరఖాస్తులు అందాయనీ, వీటిలో 76 మంది అర్హులను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 12 మందికి వారం రోజుల్లో, అతి త్వరలో మిగిలిన వారికి పంపిణీ చేస్తామన్నారు. రామడుగు మండలం వన్నారంలో హతమైన అశ్వత్థామ కుటుంబ సభ్యులకు ఇంటి స్థలంతో పాటు ఇల్లును మంజూరు చేస్తున్న ట్లు కలెక్టర్ తెలిపారు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేట గ్రా మంలో ఎస్టీలకు ఇచ్చిన భూమిపై వివాదం తలెత్తగా, రెండు జిల్లాల సర్వేయర్లతో సర్వే చేయించామనీ వారం రోజుల్లో హద్దులు నిర్ణయించి అప్పగిస్తామన్నారు. గంగాధర మండలంలో వరదకాలువ నిర్మాణ బ్లాస్టింగ్‌లతో ఇళ్లు దెబ్బతిన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని కలెక్టర్ వెల్లడించారు.

అంటరానితనం లేదు..
జిల్లాలో అంటరానితనం లేదనీ, ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కమలాపూర్ మండలం వంగపల్లిలో దళితులకు పట్టాలిచ్చినా భూమి ఇవ్వని విషయాన్ని కలెక్టర్ దృ ష్టికి తీసుకువచ్చారు. హుస్నాబాద్‌లో కస్తూర్బా పాఠశాల నిర్మాణం పూర్తయినా, ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్నందున మార్చాలని కోరారు. జగిత్యా ల ఎమ్మెల్యే రమణ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న ఆసుపవూతులు ని బంధనల మేరకు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ సదుపాయమున్న ఆసుపత్రు ల వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. కుల వివక్ష ఉన్న గ్రామాలో పౌరహక్కుల దినాన్ని నిర్వహించి, అవగాహన కల్పించాలని సూచించారు.

సత్వర విచారణ..
పోలీస్‌స్టేషన్లకు వచ్చే భూవివాదాలకు సంబంధించి వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు డాక్టర్ రవీందర్ చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమా ర్, అదనపు జేసీ సుందర్‌అబ్నార్, ఎ స్సీ, ఎస్టీ, అట్రాసీటీ కమిటీ సభ్యులు జె.చంద్రయ్య, వెన్న రాజమల్లయ్య, గ జ్జెల స్వామి, రాజవీరు, కిషన్‌నాయక్, జయరాజ్, స్వామి, రాధాకిషన్, ఈడీ సారయ్య, రామస్వామి పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd