|
|
పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
ఉప్పల్, ఆగస్టు 6 (టీ మీడియా): పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఎస్సై నాగాచారి కథనం ప్రకారం... నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన చామకూర మహిపాల్ (3) ఇబ్రహీంపట్నం పోచారం గ్రామంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం చైతన్యపురికి చెందిన మిత్రుడు రంగాతో కలిసి పల్సర్ (ఏపీ 29 బీజే 1299)పై మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉప్పల్ రింగ్‌రోడ్డు వైపు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ (ఏపీ 12 వీ 570) ఢీకొనడంతో మహిపాల్ ట్యాంక్ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పల్ సీఐ లక్ష్మికాంతడ్డి ఆధ్వర్యంలో ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Other News
|
|||||