Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Hyderabad>>  General News
ఈద్ ముబారక్

- నేడు ఈద్-ఉల్-ఫితర్
- ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు
- 36 అదనపు బస్సులు నడపనున్న ఆర్టీసీ
- రద్దీ దృష్ట్యా వాహనాల మళ్లింపు
- నగరంలో భారీ బందోబస్తు

సిటీబ్యూరో, టీమీడియా: పవిత్ర రంజాన్ మాస ఉపవాసదీక్షలు ముగియడంతో సోమవారం ముస్లిం సోదరులు ఈదుల్ ఫితర్ వేడుకలు నిర్వహించనున్నారు. నెలరోజుల పాటు దీక్షలు, ప్రత్యేక ప్రార్థనల నిర్వహించిన అనంతరం షవ్వాల్ నెల మెదటి రోజు భక్తిక్షిశద్ధలతో పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఈద్గాలు, మసీదుల్లో ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ప్రార్థనలు నిర్వహిస్తారు. మక్కామసీద్, మీరాలం, మాదన్నపేట్ ఈద్గా, ఏసీగార్డ్స్ ప్లే గ్రౌండ్స్, ఈద్గా కార్వాన్, జామియా ఉస్మానియా ఈద్గా, చిలకలగూడ ఈద్గా, అంబర్ పేట్ ఈద్గా, గుట్టల బేగం ఈద్గా , ఈద్గా ఫస్ట్‌లాన్సర్, రాయల్ మసీదు, స్పానిష్ మసీదు, సంగ్ మసీదు, బడీ మసీదు, జామియా మసీదు, మసీదు సూజాయి, మల్లేపల్లి మసీదు, అలంగీర్ మసీదు, జనరల్ జబార్ మసీదు, బార్కస్ జామియా మసీదు తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నమాజ్ ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య నిర్వహించనున్నారు.

అర్ధరాత్రి వరకూ షాపింగ్...
గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు దుకాణాలు కళకళలాడాయి. ముఖ్యంగా పాతబస్తీలోని చార్మినార్, మదీనా, పత్తర్‌గట్టీ, లాడ్‌బజార్, అబిడ్స్, కోఠి, చాదర్‌ఘాట్, యూసుఫెయిన్ దర్గా, బజార్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో కొనుగోళ్లు జరిగాయి. షాపింగ్ మాల్స్‌లో పండుగ ఆఫర్లు ప్రకటించడంతో కిక్కిరిసిన రద్దీతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగింది. ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ఆర్టీసీ 36 బస్సులను నడుపుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు...
మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా, సికింవూదాబాద్‌లో సోమవారం జరిగే ప్రత్యేక ప్రార్థన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11.30ల వరకు అమలులో ఉంటాయన్నారు.

- మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా వద్ద ప్రార్థనలు జరిగే సమయంలో ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ప్రత్యామ్నయ మార్గాలలో మళ్లిస్తున్నారు.
- ఈద్గా దగ్గరకు సైకిల్ రిక్షాలు, సైకిళ్లలకు అనుమతి లేదు. ఈద్గా క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న మైదానంలో పార్కింగ్ చేయాలి.
- శివరాంపల్లి, నేషనల్ పోలీసు అకాడమీ నుంచి బహదూర్‌పురాకు వెళ్లే వాహనాలను దానమ్మ హట్స్ టీ జంక్షన్ మీదుగా అలియాబాద్ వైపు మళ్లిస్తున్నారు.
- ప్రార్థనలు పూర్తయిన వెంటనే అక్కడి నుంచి వెళ్లే వాహనాలను పురానాపూల్ మీదుగా సిటీ కాలేజ్ వైపు దారి మళ్లిస్తున్నారు.
సికింవూదాబాద్‌లో....
- బ్రూక్‌బాండ్ సెంటర్ నుంచి సీటీఓ చౌరస్తా

వైపు వెళ్లే వాహనాలను ఈద్గా జంక్షన్ నుంచి తాడ్బాన్ వైపు మళ్లిస్తున్నారు.
- రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రార్ణనా మందిరాల వద్ద పోలీసు నిఘా పెంచారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

ప్రత్యేక పాల విక్రయ కేంద్రాలు...
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ప్రత్యేక పాల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నుట్లు ఏపీ డెయిరీ వైస్ చైర్మన్ ఎండా రఫత్ అలీ తెలిపారు. విజయ టోన్డ్ మిల్క్ ప్యాకెట్లు, చిల్లరగా అమ్మడాకినిక ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రకటించారు. రూ.32 లకు లీటర్ చోప్పున విక్రయిస్తామని జంట నగరాల్లోని ఇతర మిల్క్ బూతుల్లో కుడా అమ్ముతామని చెప్పారు. ఆదివారం సాయంత్రం నుంచి ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, సోమవారం తెల్లవారుజామున తిరిగి తెరుస్తామన్నారు.

కేంద్రాల వివరాలు: ఏపీసీసీఐ గాంధీ భవన్, నాంపల్లి, సనత్‌నగర్, ఫలక్‌నుమా, చార్మినార్, యాకుత్‌పురా, మెహదీపట్నం, పంజాగుట్ట, బోరబండ, చంచల్‌గూడ, కేపీహెచ్‌బీ కాలనీ, బోయిన్‌పల్లి, పటాన్‌చెరు, మాదన్నపేట్, సయ్యద్‌నగర్, మణికేశ్వర్‌నగర్, లాలాగూడ, వారాసిగూడ, సీతారాంబాగ్, సోమాజిగూడ, శాంతినగర్. వివరాలకు 27019185, 64643133, 98481 72642, 98481 72640, 99125 26611 నెంబర్లలో సంప్రదించవచ్చు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd