|
|
చేతనైతే ఉద్యమాన్ని నడిపించు..
సిటీబ్యూరో, టీ మీడియా : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉద్యమాన్ని ఇంత కాలం సజీవంగా ఉంచిన కేసీఆర్‌ను విమర్శించే హక్కుమోత్కుపల్లి నర్సింహులుకు లేదని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంక సూచించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ను విమర్శించే బదులు మోత్కుపల్లికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నుంచి బయటకు వచ్చి నీవు స్వతంత్య్ర ఉద్యమం నడిపిస్తే మేమంతా నీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పోరాటం చేతకానప్పుడు కేసీఆర్‌ను విమర్శించే అర్హత నీకు లేదని గుర్తుంచుకొవాలని మోత్కుపల్లికి హితవు పలికారు. టీడీపీ కనుమరుగవుతున్న పరిస్థితిలో చంద్రబాబు బీసీ డిక్లరేషన్ పేరుతో మోసం చేయడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీ గతంలో సైతం బీసీలకు వంద సీట్లు ఇస్తానని నమ్మబలికి 30 నుంచి 40 మంది బీసీలకు మాత్రమే సీట్లు ఇచ్చి మోసం చేసిన చరిత్ర ఉందన్నారు.
Other News
|
|||||