Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Hyderabad>>  General News
తగ్గిన విద్యుత్ కోతలు

సిటీబ్యూరో- టీ మీడియా : గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇదో శుభవార్త. ఇప్పటి వరకు మూడు గంటల పాటు ఉన్న విద్యుత్ కోతలను కుదిస్త్తూ సీపీడీసీఎల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 33/11కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం నుంచి గంట పాటు మాత్రమే కరెంట్ కోత ఉంటుందని ప్రకటించారు. ఎన్‌టీపీసీ, ఆర్‌టీపీపీల్లో విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లండించారు. ఇన్నాళ్లు ఉక్కపోత, దోమల బెడత, వ్యాపారం ఢీలాతో బేజారైన ప్రజలకు కోతల నుంచి కాస్త ఉపశమనం దొరికినట్లైంది. శుక్రవారం నుంచి విద్యుత్ కోత ఉండే ఆయా ప్రాంతాలివే...
- గ్రూప్ ‘ఏ’ లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, ఏసీగార్డ్స్, అత్తాపూర్, సీఆర్‌పీఎఫ్, బారాదరి, దుర్గానగర్, ఎగ్జిబిషన్, గోల్కొండ, గన్‌రాక్, హకీంపేట్, హుస్సేన్‌సాగర్, ఇందిరా పార్క్, ఆర్‌పీ నిలయం, ఆసిఫ్‌నగర్, లేక్‌వ్యూ, లంగర్ హౌజ్, మచ్చ బొల్లారం, మాదాపూర్, మైత్రివనం, ఎల్లాడ్డిగూడ, శంషాబాద్, తుర్కయాంజల్, తాండూర్, ఉప్పరపల్లి, ఎండీపల్లి, ఎన్‌ఐఆర్‌డీ, మామిడిపల్లి, ఎన్‌పీఏ, అప్పా, వికారాబాద్, ఇబ్రహీంపట్నం, నందనవనం, సీబీఐటీ, చంపాపేట్, లెనిన్‌నగర్, వనస్థలిపురం, పుప్పాలగూడ, జల్‌పల్లి సబ్‌స్టేషన్ల పరిధిల్లో విద్యుత్ సరఫరా ఉండదని సీపీడీసీఎల్ అధికార వర్గాలు పేర్కొన్నాయి.
- గ్రూప్ ‘బి’ లోఉదయం 10 నుంచి 11 గంటల వరకు అంబర్‌పేట్, భూదేవినగర్, బోయిన్‌పల్లి, చిన్నతోకట్ట, క్లాక్‌టవర్, ఈఎన్‌టీ ఆస్పత్రి, ఫలన్‌నూమా, గోషామహల్, హెచ్‌ఏఎల్, హైదర్‌గూడ(సెంవూటల్), ఐడీపీఎల్ ఐఐసీటీ, జేమ్స్ స్ట్రీట్, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మిరాలం, యాకుత్‌పురా, మోండా మార్కెట్, స్ట్రీట్ నెంబర్ 8 (హెచ్‌జీ)ఐడీఏ ఉప్పల్, ఉప్పల్, మౌలాలి, వాజ్‌పేయినగర్, నాచారం, మల్లాపూర్, కొత్తపేట్, మోహన్‌నగర్, మారుతినగర్, బండ్లగూడ, ఆటోనగర్, హయత్‌నగర్, రాజీవ్‌స్వగృహ(సరూర్‌నగర్)తట్టి అన్నారం సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ కోతలు ఉంటాయి.
- గ్రూప్ ‘సీ’ లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అడ్డగుట్ట, నెహ్రూనగర్, ఎయిర్‌పోర్టు, ఆల్విన్, కందికల్‌గేట్, రోడ్‌నెంబర్ 2 (కొత్త) అయ్యప్ప సొసైటీ( గచ్చిబౌలి, బంజారాహిల్స్), బన్సీలాల్‌పేట, బేగంపేట, చంచల్‌గూడ, చిలకలగూడ, ఈఎస్‌ఐ, ఫీవర్‌హాస్పిటల్, ఫిల్మ్‌నగర్, గ్రీన్‌లాండ్స్, సంజీవయ్య పార్కు, సంతోష్‌నగర్, పీట్లబుర్జ్, పంజేషా, ఎస్‌డీ హాస్పిటల్, కొంపల్లి, సుభాష్‌నగర్, ఉషాముళ్లపూడి, జగద్గిరిగుట్ట, విజయానగర్ కాలనీ, బాచుపల్లి, డీపీపల్లి, సూరారం, జీడీమెట్లఎస్‌ఎస్1, జీడీమెట్లఎస్‌ఎస్2, జీడీమెట్ల ఎస్‌ఎస్ 3, ఏఎల్‌ఈఏపీ, ఆర్‌జీకే సూరారం, మయూరినగర్, మదీనాగూడసబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో కోత ఉంటుంది.
- గ్రూప్ ‘డీ’ లో మధ్యాహ్నం 12 నుంచి1 గంట వరకు కంచన్‌బాగ్, కార్వాన్, కిల్వత్, కిమ్స్, లాలాగూడ, లుంబినిపార్క్, ఎల్‌వీ ప్రసాద్ హాస్పిటల్ మార్గ్, మలక్‌పేట్ గంజ్, ఎమ్మెల్యే కాలనీ, మోతిమహల్, మూసారాంబాగ్, నారాయణగూడ, నిమ్స్, ప్రాగా టూల్స్, ప్రశాంతినగర్, పబ్లిక్‌గ్డాన్, రోడ్‌నెంబర్ 22 సుల్తాన్ బజార్, విఠల్‌వాడీ, సాలార్‌జంగ్, టోలిచౌకి, రామంతాంపూర్, ఎన్‌జీఆర్‌ఐ, వినాయక్‌నగర్, మల్కాజ్‌గిరి, ఆనంద్‌బాగ్, సైనిక్‌పురి, కుషాయిగూడ, చర్లపల్లి 1, సాకేత్, యాప్రాల్ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదు.
- గ్రూప్ ‘ఈ’ లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు గుడి మల్కాపూర్, జింఖానా, హెచ్‌ఎంటీ, బతుకమ్మకుంట, సీతారాంబాగ్, జవహర్‌నగర్, జూబ్లీహిల్స్, కుందన్‌బాగ్, మలక్‌పేట, మారెడ్‌పల్లి, అస్మాన్‌గడ్, నాంపల్లి, మోతీనగర్, పాటిగడ్డ, సీతాఫల్‌మండి, శ్రీనగర్ కాలనీ, రోడ్‌నెంబర్ 12, యూసుఫ్‌గూడ, బాలాజీ నగర్, కేబీహెచ్‌బీ, ఐజేఎం, చందానగర్, నానక్‌రాంగూడ, ఈఎస్‌సీఐ, పాపిడ్డి కాలనీ, గచ్చిబౌలి, ఐఐఐటీ, ఎల్ అండ్ టీ, సేజ్, కొత్తగూడ, ల్యాంకోహిల్స్, అయ్యప్ప సొసైటీ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd