|
|
రెడ్డీస్ ల్యాబ్‌లో మహిళా కార్మికులపై...లైంగిక వేధింపులు
దుండిగల్, జూలై 22 (టీ మీడియా) : నగర శివారు ప్రాంతాల్లోని పలు పరిక్షిశమల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు భద్రత లేకుండా పోతోంది. వారాంతపు సెలవుల్లో తమతో ఏకాంతంగా గడిపితేనే రెగ్యులర్‌గా పనుల్లోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ తమ దారికి తెచ్చుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామ పరిధిలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబో రేటరీస్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూరా రం కాలనీకి చెందిన ఓ వివాహిత పక్షంరోజుల క్రితం రెడ్డీస్ ల్యాబ్‌లో పని చేసేందుకు చింతల్‌కు చెందిన ఓ ప్లేస్‌మెంట్ సంస్థ ద్వారా ప్రాసెసింగ్ సెక్షన్‌లో విధుల్లో చేరింది. కాగా ఈనెల 1వ తేదీన వారాంతపు సెలవు రావడంతో ఇంటి వద్దనే ఉన్న ఆమెకు తాను పనిచేస్తున్న కార్యాలయంలోని ల్యాండ్‌నైన్ (040-44643523)నుంచి ఆమె సెల్‌కు సాయంత్రం 5:0గంటలకు ఫోన్ వచ్చింది. తాను సెక్షన్ సూపర్‌వైజర్‌నని పరిచయం చేసుకున్న అతను మీ ఆయనేం చేస్తుంటాడు.. ఎంతమంది పిల్లలు.. నీ వయసెంత...? ఇలా అడగరాని ప్రశ్నలు అడగడంతోపాటు ఇకనుంచి వారాంతపు సెలవు రోజు నేను చెప్పిన చోటుకు వచ్చి తనతో గడిపితేనే ఉద్యోగం ఉంటుందని, లేదంటే రేపటి నుంచి రావద్దంటూ వేధించాడు. దీంతో సదరు మహిళ భర్తకు విషయాన్ని తెలియజేయడంతో వెంటనే అతన్ని ఫోన్‌లోనే నిలదీశాడు. అయితే విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దని, నీ భార్యను యథావిధిగా పనికి పంపవచ్చని ఆ ప్రబుద్ధుడు వేడుకున్నాడు. ఈ విషయాన్ని సదరు మహిళ భర్త మీడియా ప్రతినిధులతో కలిసి కంపెనీ హెచ్‌ఆర్‌డీ దృష్టికి నాలుగు రోజుల క్రితమే తీసుకు కానీ కంపెనీ యాజమాన్యం మాత్రం సదరు ప్రబుద్ధుడిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో మీనమేశాలు లెక్కిస్తుందని బాధితులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని ‘టీ మీడియా’ ప్రతినిధి కంపెనీ హెచ్‌ఆర్‌డీని వివరణ కోరగా నిందితుడు దొరికితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని తెలిపారు.
Other News
|
|||||