|
|
పంచమి పూజకు ఆలయాల ముస్తాబు
హిందూ పండుగలు, ఉత్సవాలకు ప్రకృతితో విడదీయరాని సంబంధం ఉంటుంది. అంతేకాదు పూజలు, వ్రతా లు విశ్వాసాలపై ఆధారపడినవే. అయినా వీటి నిర్వహణకు మాత్రం కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. శ్రావణ మాసంలో వర్షాలు జోరుగా కురుస్తాయి. అందువల్ల ఈ కాలంలో పుట్టలు పాములకు నివాసయోగ్యంగా ఉండవు. అందువల్ల అవి పుట్టల నుంచి బయటి ఆవాసాల్లోకి ప్రవేశిస్తాయి. ఆహారం కోసం, ఆశ్రయం కోసం అవి నివాస ప్రాంతాలవైపు వెళతాయి. అందువల్ల మనుషులకు, పశువులకు ఈ కాలంలో సర్పాల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా తెలిసోతెలియకో పాముకు హాని తలపెడితే నాగ దేవత ఆగ్రహిస్తుందని, దీంతో సర్ప గండం, సర్ప దోషం ఉంటుందని హిందువులు భావిస్తారు. హిందువులు విశ్వసించే జాతకాల ప్రకారం పంచమ స్థానంలో కుజుడు, రాహువు, కేతవు ఉంటే సర్ప దోషం కులుగుతుందట. ఈ దోషం వల్ల స్త్రీలకు వివాహం ఆలస్యం అవుతుందని, సంతాన సమస్యలు తలెత్తుతాయని విశ్వసిస్తారు. శ్రావణ పంచమి రోజున నాగేంవూదుడిని పూజిస్తే సర్పదోషాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే నాగ పంచమి రోజున నాగేంవూదుడుని పూజించడం హిందూ సంప్రదాయం. దేవాలయాల్లో, పంటపొలాల్లో ఉన్న పుట్టలను దర్శించి, పాలుపోసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడే కాకుండా శివుడు సర్పాన్ని మెడలో ధరించి ఉన్న శివాలయాల్లోనూ, ఇతర హిందూ దేవాలయాల్లోనూ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున నాగులకు పూజ చేయడం, పాలు పోయడం వల్ల ఎన్నటికీ సర్పాల నుంచి ముప్పు వాటిల్లదని జ్యోతిష్య పండితులంటున్నారు. నాగ దేవతను పూజించడం వల్ల వంశ వృద్ధికి, సంతానానికి శుభకరమని భావిస్తారు. ఉదయం నుంచి జరిగే ప్రత్యేక పూజల కోసం నగరంలోని ప్రధాన దేవాలయాలన్నింటినీ ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
Other News
|
|||||