|
|
బది‘లీలల్లో’ దళారులదే హవా..!
సిటీబ్యూరో, టీమీడియా : సీపీడీసీఎల్‌లో జరిగిన ఇంజినీర్ల బదిలీల్లో అవినీతి చోటు చేసుకున్నదని విమర్శలు వెల్లు బదిలీల కోసం సీపీడీసీఎల్ యాజమాన్యం విడుదల చేసిన టీఓఓలో పెర్కోన్న నిబంధనలను విస్మరించారని ఆరోపణలు వస్తున్నాయి. బదిలీల నిబంధనల ప్రకారం ఫోకల్‌లో పనిచేసిన ఇంజినీర్‌ను నాన్ ఫోకల్‌కు, నాన్ ఫోకల్‌లో పనిచేసిన వారిని ఫోకల్ పోస్టుకు పంపించాలని పేర్కొన్నప్పటికీ అసలుకొచ్చే సరికి అంతా తారు మారైందని ఇంజినీర్లు బాహాటంగా విమర్శిస్తున్నారు. బదిలీలు గుర్తింపు పొందిన ఇంజినీర్స్ అసోసియేషన్ కనుసన్నల్లో జరిగాయని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. 10వ తేదీ అర్థరాత్రి వరకు అధికారులు, అసోసియేషన్ సభ్యులు ఓ రహస్య ప్రాంతంలో ఉండి జాబితా తయారు చేశారని, అందులో భాగంగానే అసోసియేషన్ వారికి నాన్ ఫోకల్ పోస్టులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పే అసోసియేషన్ నాయకులు వీరిని పణంగా పెట్టి వారి స్వలాభాలు చూసుకుంటున్నారని, అసోసియేషన్ సభ్యులతో తేడాలేకుండా యాజమాన్యం వారికి లోంగిపోతుంన్నదని ఆరోపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో చాలా మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు బదిలీల్లో అన్యాయం జరిగిందని వాపోతున్నారు. పైరవీలు ఉన్న వారికి, డబ్బులతో మధ్యవర్తుల ద్వారా వ్యవహారం చేసిన వారికి మాత్రమే ఫోకల్ పోస్టులు దక్కాయని, ఎవరు దిక్కులేని వారిని నాన్ ఫోకల్ పోస్టులకే పరిమితంచేసి అన్యాయం చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరధిలో ఎక్కువ విద్యుత్ చౌర్యం జరిగే నార్త్ సర్కిల్లో ఒక డీఈ పోస్టును 5 నెలలుగా ఖాళీగా ఉంచడమే కాకుండా, ప్రస్తుత బదిలీల్లో స్థానాన్ని భర్తీ చేయక పోవడం శోచనీయమన్నారు. చార్మినార్ డివిజన్‌లో ఏడీఈగా పనిచేస్తున్న వ్యక్తికి అదనపు బాధ్యతలు ఇస్తూ, 15 సంవత్సరాలుగా కనీసం సర్కిల్ మార్చడం లేదంటే యాజమాన్యం చేసిన బది ‘లీలలు’గా మారయనడంలో అతిశయోక్తి లేదని, యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందనడానికి ఇంతకన్నా మరో నిదర్శనం ఉండదని ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు.
Other News
|
|||||