రాకాసి ‘ఆర్టీసీ’
సిటీబ్యూరో, టీ మీడియా : ‘సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఆశ్రయించాలి. ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు అధికం’. షిర్డీ బస్సు ప్రమాద ఘటన రోజున ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తిచేశారు. ఖాన్ ప్రకటన మరుసటి రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు పెరిగిపోయాయి. దీంతో షాక్ తిన్న ఆయన వర్షాకాలం.. డ్రైవర్లు జాగ్రత్తగా బస్సులను నడపండంటూ రెండు రోజుల తరువాత మరో బహిరంగ ప్రకటన చేశారు. ‘ఫిట్‌నెస్‌తోపాటు నిబంధనల విషయంలో ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీ చేస్తాం. ఆర్టీసీపై కూడా ఆర్టీఏ దాడులు ఉంటాయి. నిబంధనల విషయంలో ఎవరినీ ఊపేక్షించేది లేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’. ఇది రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన.. ఎవరి ప్రకటనలు ఏలా ఉన్నా షిర్డీ ఘటన తర్వాత అందరి దృష్టి బస్సుల ప్రమాదాలపై పడింది.
ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురవుతుండగా ఆర్టీసీ ఎంత సురక్షితం అనే చర్చ కూడా జరుగుతున్నది. ఆర్టీసీలో శిక్షణ పొందిన డ్రైవర్లు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఏటా ఆర్టీసీ బస్సు ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం డొక్కు బస్సులే అంటున్నారు డ్రైవర్లు. కాలం చెల్లిన బస్సులు బ్రేకులు పడక ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్లు పేర్కొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 డిపోల్లో 3785 బస్సులున్నాయి. నిత్యం దాదాపు 10 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. 45వేల ట్రిప్పులతో 33లక్షల మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందిస్తుంది. ఇదిలా ఉండగా 11లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన బస్సుల కాలం చెల్లినట్లే. అంటే వాటిని స్క్రాప్‌కు వదిలేసి కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావాలి. గ్రేటర్‌లో మొత్తం 743 బస్సులకు పైగానే 11లక్షల కిలోమీటర్లు దాటిపోయాయి. వాటికే మరమ్మతులు చేపడుతూ రోడ్లపైకి తెస్తున్నారు. 176 బస్సులు 11లక్షలు కిలోమీటర్లు దాటిపోగా, 211బస్సులు 12లక్షలు, 356బస్సులు ఏకంగా 13లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. అయినా వాటిని ఇంకా తిప్పుతూనే ఉన్నారు. డొక్కు బస్సులకే రంగులు వేసి మెరుగులు దిద్దుతూ రోడ్లపైకి పంపుతున్నారు. అయితే పాత బస్సులతో డ్రైవర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్సులకు బ్రేకులు సరిగా పడకా, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడే నిలిచిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలతో ఏటా 100మందికి పైగానే మృత్యువాత పడుతుండగా వందలాది మంది క్షతగావూతులవుతున్నారు.
2008-09 సంవత్సరంలో బస్సు ప్రమాదాల్లో 344గాయాలకు గురికాగా వీటిలో 136మంది ప్రాణాలు కోల్పోయారు. 2009-10లో 277మంది గాయాలకు గురికాగా 118మంది మృతిచెందారు. 2011-12లో 311మంది మంది బస్సు ప్రమాదాల్లో గాయపడగా 116మంది మృతిచెందారు. ఈ సంవత్సరం మే నెల వరకు 52మంది ఆర్టీసీ బస్సు ప్రమాదాల్లో గాయపడగా 15మంది మృందిచెందారు. 24మంది తీవ్రంగా గాయపడిన వారిలో ఉన్నారు. ఈ లెక్కలు చూస్తుంటే ఆర్టీసీ సురక్షిత ప్రయాణంపై కూడా ప్రయాణికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షిర్డీ ఘటన జరిగిన ఈ తొమ్మిది రోజుల వ్యవధిలో కూడా ఇద్దరు ఆర్టీసీ బస్సు చక్రాలకు బలైపోయారు. నగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురవుతూనే ఉంటుంది. అయితే ప్రమాదాలకు డొక్కు బస్సులు, డ్రైవింగ్‌పై పూర్తిగా అవగాహన లేని కాంట్రాక్ట్ డ్రైవర్లు ఓ కారణమంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీలోని అద్దె బస్సుల డ్రైవర్లకు సరైన శిక్షణ ఉండకపోవడం ప్రమాదాలకు కారణమే అంటున్నారు. నగరంలో బైక్‌లపై వేగంగా తిరుగుతున్న యువకులే ఎక్కువగా బస్సు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్లు జాగ్రత్తగానే వెళుతున్నప్పటికీ బైక్‌లపై వేగంగా వస్తూ బస్సుల కిందపడి చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల పనివేళల్లో సాయంత్రం వేళ బస్సుల్లో వేలాడుతూ వస్తూ చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. అయినప్పటికీ ఆర్టీసీ విద్యార్థులకు సరిపడు బస్సులను అందించలేకపోతున్నది. ప్రమాదాలు ఇలా ఉంటే నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిలో కూడా ఆర్టీసీ డ్రైవర్లే ముందు వరుసలో ఉంటున్నారు. సిగ్నల్స్ పాటించకుండా ఇష్టారీతిగా బస్సులు నడుపుతున్నారని ఇటీవల జరిగిన ఆర్టీసీ డ్రైవర్ల అవగాహన సదస్సులో నగర ట్రాఫిక్ పోలీసు కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ సమస్యకు కూడా డ్రైవర్లే కారణమంటున్నారని ట్రాఫిక్ పోలీసులు. ఎక్కడ పడితే అక్కడే రోడ్లపై అడ్డదిడ్డంగా బస్సులు నిలిపివేస్తూ ఆర్టీసీ డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిబంధనలు పాటించని ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లలో మార్పు రావాల్సి ఉన్నది. నగరంలో నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణ కోసం కృషి చేయని పక్షంలో ప్రయాణికులు బస్సును చూస్తేనే బయపడే పరిస్థితులు కూడా వస్తాయి.
Other News