రాసలీలల రాజధాని
దిల్‌సుఖ్‌నగర్/ హయత్‌నగర్, జూన్ 23 (టీ మీడియా) : హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్స్‌లు, ఫాంహౌస్‌లను విష సంస్కృతికి వేదికలవుతున్నాయి. రాజకీయ నాయకులు, బడా వ్యాపార వేత్త లు తోడు కావడంతో నియంవూతించడం లో పోలీసు వ్యవస్థ విఫలమవుతుంది. బర్త్‌డే పార్టీలు, వీకెండ్ విందుల పేరుతో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెంది న యువతులతో అశ్లీల నృత్యాలు చేయి స్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకోసం నగర శివారు ప్రాంతాలను జనసంచారం లేని నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. సకల హంగులతో అన్ని సౌకర్యాలతో ఉన్న రిసోర్ట్స్, ఫామ్‌హౌజ్, గెస్ట్‌హౌజ్‌లను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం వెనుక ప్రముఖుల అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్లబ్ డాన్సుల పేరుతో యువతులతో అశ్లీల నృత్యాలు చేయించడమే కాకుండా వచ్చిన విటులకు సకల హంగులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు మద్యం, మత్తుమందు, విందు, వినోదాలతో చెలరేగిపోతున్నా రు. గతంలో నగరంలో రేవ్ పార్టీ చేసుకుంటూ పోలీసులకు చిక్కిన యువతీ, యువకులు, నార్సింగి ప్రాంతం, హయత్‌నగర్ మండలంలోని పసుమాముల ప్రాంతంలోని ఐశ్వర్య గెస్ట్‌హౌస్‌లో ఇలాగే పార్టీలు చేసుకుం టూ పోలీసులకు పట్టుబడిన సంగతి విధితమే. తాజాగా శుక్రవారం రాత్రి హయత్‌నగర్ మండలంలోని బాటసింగారం గ్రామపంచాయతీలోని పిగ్లిపూర్‌లో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న స్వగృహ రిసోర్ట్స్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ.
గతంలో పసుమామూలలోని ఐశ్వర్య రెసిడెన్సిలో అంతపూరాష్ట్ర యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తుండగా పోలీసులు రెసిడెన్సీపై దాడి చేసి 11మంది యువతులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్వగృహా రిసార్ట్స్ ఘటనలో 20మంది యువతులను, 15మంది యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 15 కార్లు, మత్తుపదార్థాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు మాత్రం తప్పించుకున్నారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుటి మాదిరిగానే పోలీసులు మాత్రం నిర్వాహకులు పారిపోయారు.. అంటూ చెబుతున్నారు.
పట్టుబడిన వారి వివరాలు
శుక్రవారం రాత్రి స్వగృహా రిసార్ట్స్‌లో పట్టుబడిన వారిలో గాంధీనగర్‌కు చెంది న డాన్సర్ గౌడబెల్ల భాను, దోమలగూడకు చెందిన దన్వాడ లక్ష్మి(20), నెల్లూరుకు చెందిన గోదాము సుప్రజ, జూబ్లీహిల్స్‌కు చెందిన వసంత, నిజామాబాద్ కవాడిగూడకు చెందిన వైష్ణవి, సంగాడ్డికు చెందిన బండారు లక్ష్మి, బండారు సరస్వతి, తూర్పు గోదావరి వెలుగు గ్రామానికి చెందిన కమ్మరాజు మధు, ఉత్తరవూపదేశ్‌కు చెందిన పూనం, ఢిల్లీ ప్రాంతానికి చెందిన కాంచనకుమారి, పాయల్ కమారి, ముంబాయికి చెందిన శివాణి పటేల్, అబ్దుల్ రసూల్ షేక్, రత్నదాసి, సల్ల షేక్, మహారాష్ట్రకు చెందిన సీతారాం, సిక్కిం మస్తాక తుమ్మల్, లంగర్‌హౌజ్‌కు జోష, కరీంనగర్‌కు చెందిన రోహి, మహారాజ్‌గంజ్‌కు చెందిన రుచికా దేశాయ్ ఉన్నారు. వీరందరినీ రిస్క్యూ హోమ్‌కు తరలించారు.
కాగా, కాకినాడకు చెందిన జొన్నలగూడ శ్రావణ్, అనిల్‌కుమార్, సత్తెనపల్లికి చెందిన అయినవోలు తిరుమల సత్య శ్రీనివాస్‌రావు, బంజారాహిల్స్‌కు సాలె మహఫూజ్, మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన మీర్జా ఫారూఖ్, అబ్దుల్ హకీం, ఎండీ సాధిక్, కింగ్‌కోఠికి చెందిన ఫహద్ పిసల్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాదికే అనిల్‌కుమార్, యూసుఫ్‌గూడలో ఉండే నల్లగొండ జిల్లాకు చెందిన తంగడపల్లి సంతోష్, దారుల్-షాఫాకు చెందిన మహ్మద్ మాలికుద్దీన్, టప్పఛబుత్రా ప్రాంతానికి చెందిన సయ్యద్ అల్లావుద్దీన్, ప్రకాశం జిల్లాకు చెందిన బేదంశెట్టి వేణుగోపాల్‌తోపాటు తన స్నేహితుడితో పార్టీకి వచ్చిన జర్మనీ దేశానికి చెందిన అర్తూర్ మజూర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అర్తూర్ మజూర్ ఈఎస్‌ఐ ఆస్పవూతిలో ఇన్‌స్టాలేషన్ విభాగంలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
త్వరలోనే కేసును చేధిస్తాం :
డీసీపీ నాగేంద్రకుమార్
సాయి స్వగృహలో దేవిడ్డి నారాయణడ్డి బర్డ్‌డే పార్టీ ఏర్పాట్లను అక్తర్ మామూ చేసినట్టు గుర్తించామని, ప్రస్తు తం అతడు పరారీలో ఉన్నాడని డీసీపీ నాగేంవూదకుమార్ తెలిపారు. ఈ వెంచర్‌ను జీపీఆర్ ఎస్టేట్ వారు డెవలప్ చేయగా, దీనిని కే.శ్రీనివాస్‌డ్డి, మరో ఇద్దరు కలిసి నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. దీంతో పాటు ఎక్సైజ్ అనుమతులు లేకుండా మద్యం, యువతులతో అశ్లీల నృత్యాలు, వ్యభిచారం చేయిస్తున్నట్లు అక్కడి ఆధారాలను బట్టి గుర్తించామన్నారు. పట్టుబడిన వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రిసోర్ట్స్ నిర్వాహకులపై 3, 4, 5 సెక్షన్లతో పాటు ఎక్సైజ్ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు ఆయ న తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా మీడియా ముం దుండి సమాచారం ఇవ్వడంతో గతం లో ఇలాంటి ఘటనలు చేధించామన్నారు.
పట్టుబడిన వారిలో
పోలీసు ఉన్నతాధికారి కుమారుడు.?
రిసోర్ట్స్‌పై పోలీసులు దాడి చేసి పట్టుకున్న వారిలో ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు ఉన్నట్లు సమాచారం.
చాలా కాలంగా కొనసాగుతున్న వైనం :
హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామ పంచాయతీ పిగ్లిపురంలోని సర్వేనెం.12లో ఉన్న స్వగృహ రిసోర్ట్స్ గతకొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంది. 1999వ సంవత్సరంలోనే ఈ సర్వేనెంబర్‌లో వెంచర్ చేయ గా, మూడేళ్లుగా శ్రీనివాస్‌డ్డితోపాటు మరో ఇద్దరు భాగస్వాములు ఈ ప్రాంతంలో రిసోర్ట్స్ ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో గ్రామ రెవెన్యూ అధికారి ఈదు దశరథ ఓ భూమి సర్వే విషయమై నెల రోజుల క్రితం ఆ ప్రాంతానికి వెళ్ళిన్నప్పుడు అనుమానమొచ్చి స్వగృహ రిసోర్ట్స్ నిర్వహణ గురించి ఆరా తీయగా, తనను లోపలికి రానివ్వలేదని ఆయన తెలిపారు. అయితే వీఆర్‌ఓ ఫోన్ తీసుకుని సార్‌తో మాట్లాడిస్తానని సిబ్బంది అయూబ్ తెలిపాడని, అప్పటి నుంచి ఈ రిసోర్ట్స్‌పై నిఘా పెట్టామని తెలిపారు.
పరారీలో నిర్వాహకులు ...
స్వగృహ రిసోర్ట్స్ నిర్వాహకులు ఎవరూ అనేది పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన కార్యాలయం లక్డీకాపూల్‌లో ఉన్నట్లు ఓనర్ శ్రీనివాస్‌డ్డి అలియాస్ కేఎస్.డ్డి, మరో ఇద్దరు భాగస్వాములు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్వగృహ రిసోర్ట్స్ నిర్వాహకులు, సిబ్బంది పరారీలో ఉన్నారు.
అంతర్రాష్ట్ర యువతులతో
అశ్లీల నృత్యాలు :
బర్డ్‌డే పార్టీలు, వీకెండ్ ఫంక్షన్ల పేరుతో అంతపూరాష్ట్ర యువతులను తీసుకువచ్చి గుట్టుగా అశ్లీల నృత్యాలు చేయిస్తూ పట్టుబడిన సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. కాగా ఇతర రాష్ట్రాల అమ్మాయిలే కాకుండా ఆంధ్రవూపదేశ్‌కు చెందిన యువతులు కూడా ఈ అసాంఘీక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం గమనార్హం. పార్టీలకు హాజరైన యువతులకు ఒక్కొక్కరికి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు నిర్వాహకులు ముట్టజెప్పుతున్నట్లు సమాచా రం. ఇందుకోసం యువతులకు అయ్యే రవాణా, నిర్వహణ ఖర్చులను సదరు నిర్వాహకులే భరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా స్వగృహ రిసార్ట్స్‌లో పట్టుబడిన వారిలో ఢిల్లీ, సిక్కీం, ముంబాయికి చెందిన యువతులు కూడా ఉండటం గమనార్హం.
అమాయక యువతులను
వలలోకి లాగుతున్న ముఠాలు
కుటుంబ, ఆర్థిక పరిస్థితులు బాగా లేని యువతుల బలహీనతను ఆసరా చేసుకుని కొన్ని ముఠాలు ప్రత్యేకంగా వారిని ఈ రొంపిలోకి దించుతున్నాయి. ఉద్యో గం, ఆర్థికం, స్నేహం, నూతన పరిచయాలు తదితరాల నెపంతో స్నేహం చేసి వారిని ఈ రొంపిలోకి దింపుతున్నారు. అంతేకాకుండా కొన్ని పేద కుటుంబాల నుంచి యువతులను ప్రలోభపెట్టి భ్రమలు కల్పించి వారిని ఇలాంటి కార్యక్షికమాలకు వినియోగిస్తున్నారని తెలుస్తోంది.
పోలీసుల సహాయంతోనే...
పోలీసుల కనుసైగల్లోనే శివారుల్లో అసాంఘిక కార్యక్షికమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్షికమాలు గతంలో అనే కం వెలుగు చూసినా మామూళ్ల మత్తు లో మునిగిన సైబరాబాద్ పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో నిర్వాహకులు నిర్భయంగా దందా చేస్తున్నారని తెలిపారు. పోలీసుల నిర్వాహకంతో ప్రశాంతంగా ఉండే పల్లెసీమలు పాడై పోతున్నాయన్నారు. శుక్రవారం రాత్రి అర్ధరాత్రి బయటపడిన ఈ సంఘటనకు పోలీసులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానం వస్తుందని స్థానికులు డిమాండ్ చేశారు.
Other News