Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Hyderabad>>  General News
మళ్లీ కరెంట్ కట్

- ఎన్‌టీపీసీ, ఆర్‌టీపీపీలో సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
- నేటి నుంచి అధికారిక కోత
- రెండు విడుతల్లో రెండు గంటలు నిలిపివేత
- షెడ్యూల్ ప్రకటించిన సీపీడీసీఎల్ యాజమాన్యం


సిటీబ్యూరో, టీమీడియా: సాంకేతిక లోపాలతో ఎన్‌టీపీసీ, ఆర్‌టీపీపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి పడిపోవడంతో నగరంలో గురువారం నుంచి అధికారికంగా విద్యుత్ కోతలు పారంభిస్తున్నట్టు సీపీడీసీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలో ఉన్న సబ్‌స్టేషన్లను ఐదు గ్రూపులుగా విభజించి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు విడతల్లో రెండు గంటల పాటు విద్యుత్ కోతలు విధించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు నగరంలో కోతల షెడ్యూల్‌ను ప్రకటించారు. కింద తెలిపిన సమయాల్లో ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు గుర్తించాలని సీపీడీసీఎల్ కోరింది.

ఛాగూప్ ‘ఏ’ లో.. ఉదయం 6-7 గంటల వరకు, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఏసీ గార్డ్స్, అత్తాపూర్, సీఆర్‌పీఎఫ్, బారాదరి, దుర్గానగర్, ఎగ్జిబిషన్ , గోల్కొండ, గన్‌రాక్, హకీంపేట్, హుస్సేన్‌సాగర్, ఇందిరా పార్క్, ఆర్‌పీ నిలయం, ఆసిఫ్ నగర్, లేక్‌వ్యూ, లంగర్ హౌజ్, మచ్చ బొల్లారం, మాదాపూర్, మైత్రి వనం, ఎల్లాడ్డిగూడ, శంషాబాద్, తుర్కయాంజల్, తాండూర్, ఉప్పరపల్లి, ఎండీపల్లి, ఎన్‌ఐఆర్‌డీ, మామిడిపల్లి, ఎన్‌పీఏ, అప్పా, వికారాబాద్, ఇబ్రహింపట్నం, నందనవనం, సీబీఐటీ, చంపాపేట్, లెనిన్‌నగర్, వనస్థలిపురం, పుప్పాలగూడ, జల్‌పల్లి సబ్‌స్టేషన్ల పరిధిల్లో విద్యుత్ సరఫరా ఉండదని సీపీడీసీఎల్ అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఛాగూప్ ‘బి’లో.. ఉదయం 7 నుంచి వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు అంబర్‌పేట్, భూదేవినగర్, బోయిన్‌పల్లి, చిన్నతోకట్ట, క్లాక్‌టవర్, ఈఎన్‌టీ ఆస్పత్రి, ఫలక్‌నుమా, గోషామహల్, హెచ్‌ఏఎల్ , హైదర్‌గూడ (సెంవూటల్), ఐడీపీఎల్ ఐఐసీటీ, జేమ్స్‌స్ట్రీట్, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మిరాలం, యాకుత్‌పురా, మెండా మార్కెట్, స్ట్రీట్ నెం (హెచ్‌జీ)ఐడీఏ ఉప్పల్, ఉప్పల్, మౌలాలి, వాజ్‌పేయినగర్, నాచారం, మల్లాపూర్, కొత్తపేట్, మోహన్‌నగర్, మారుతీనగర్, బండ్లగూడ, ఆటోనగర్, హయత్‌నగర్, రాజీవ్ స్వగృహ(సరూర్‌నగర్)తట్టి అన్నారం సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ కోతలు ఉంటాయి.

ఛాగూప్ ‘సీ’లో.. ఉదయం నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు అడ్డగుట్ట, నెహ్రూనగర్, ఎయిర్‌పోర్టు, ఆల్విన్, కందికల్‌గేట్, రోడ్ నెం2 (కొత్త) అయ్యప్ప సొసైటీ (గచ్చిబౌలి, బంజారాహిల్స్), బన్సీలాల్‌పేట, బేగంపేట, చంచల్‌గూడ, చిలకలగూడ, ఈఎస్‌ఐ, ఫివర్ హస్పిటల్, ఫిల్మ్‌నగర్, గ్రీన్‌లాండ్స్, సంజీవయ్య పార్కు, సంతోష్‌నగర్, పీట్లబుర్జ్, పంజేషా, ఎస్‌డీ హస్పటల్, కొంపల్లి, సుభాష్‌నగర్, ఉషా ముళ్లపూడి, జగద్గిరిగుట్ట, విజయానగర్ కాలని, బాచుపల్లి, డీపీపల్లి, సూరారం, జీడీమెట్ల ఎస్‌ఎస్ 1, జీడీమెట్ల ఎస్‌ఎస్ 2, జీడీమెట్ల ఎస్‌ఎస్ 3, ఎఎల్‌ఈఎపీ, ఆర్‌జీకే సూరారం, మయూరినగర్, మదీనాగూడ, కళ్యాణనగర్ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదు.

ఛాగూప్ ‘డీ’లో.. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కంచన్‌బాగ్, కార్వాన్, కిల్వత్, కిమ్స్, లాలాగూడ, లుంబినీ పార్క్, ఎల్‌వీ ప్రసాద్ హస్పిటల్ మార్గ్, మలక్‌పేట్ గంజ్, ఎమ్మెల్యే కాలని, మోతీమహల్, మూసారాంబాగ్, నారాయణగూడ, నిమ్స్, ప్రాగా టూల్స్, ప్రశాంతినగర్, పబ్లిక్‌గ్డాన్, రోడ్‌నెం 22, సుల్తాన్ బజార్, విఠల్‌వాడీ, సాలార్‌జంగ్, టోలిచౌకి, రామతంపూర్, ఎన్జీర్‌ఐ, వినాయక్‌నగర్, మల్కాజ్‌గిరి, ఆనంద్ బాగ్, సైనిక్‌పురి, కుషాయిగూడ, చర్లపల్లి 1, సాకేత్, యాప్రాల్ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదు.
ఛాగూప్ ‘ఈ’లో.. ఉదయం 10 గంటల నుంచి 11వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు గుడి మల్కాపూర్, జింఖానా, హెచ్‌ఎంటీ, బతుకమ్మకుంట, సీతారాంబాగ్, జవహర్‌నగర్, జూబ్లీహిల్స్, కుందన్‌బాగ్, మలక్‌పేట, మారేడ్‌పల్లి, అస్మాన్‌ఘడ్, నాంపల్లి, మోతీనగర్, పాటిగడ్డ, సీతాఫల్‌మండి, శ్రీనగర్ కాలనీ, రోడ్‌నెంబర్ 12, యూసుఫ్‌గూడ, బాలాజీ నగర్, కేపీహెచ్‌బీ, ఐజెఎం, చందానగర్, నానక్‌రాంగూడ, ఈఎస్‌సీఐ, పాపిడ్డి కాలనీ, గచ్చిబౌలీ, ఐఐఐటీ, ఎల్ అండ్ టీ, సెజ్, కొత్తగూడ, ల్యాంకో హిల్స్, అయ్యప్ప సోసైటీ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా జరగదు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd