|
|
రెండో రోజు మెరుగు పడిన సౌకర్యాలు
మైలార్‌దేవ్‌పల్లి: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మూలంగా తొలిసారిగా చేప ప్రసాద పంపిణీ తీవ్ర విమర్శలను చవి చూసింది. స్థలాన్ని నిర్ణయించటంలో అధికారులు నిర్వాహకులతో బంతాట ఆడుకున్నారు. రంగారెడ్డి కలెక్టర్ నుంచి హైదరాబాద్ కలెక్టర్, సెక్రటేరియట్ ఇలా ఒకచోటు నుంచి మరోచోటకు మారుస్తూ రోగులను, నిర్వాహకులను గందరగోళంలో పడేశారు. చివరకు 24 గంటల ముందుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్ణయించారు. రాత్రింబవళ్లు ఎంతో శ్రమించినప్పటికీ అరకొర వసతలను కల్పించగలిగారు. చివరకు శుక్రవారం ఉదయం .30 గంటల ప్రాంతంలో ప్రధాన ద్వారం వద్ద వేచి ఉన్న వందలాది మంది ఒక్కసారిగా దూసుకు వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి సుమారు 50 మంది గాయపడగా... వారిలో మహరాష్ట్రకు చెందిన ఘోరక్ పాటిల్ మృతిచెందాడు. ఇలా తొలి రోజు అస్తవ్యస్తంగా తయారైంది. ఆపై తేరుకున్న ఉన్నతాధికారులు షామియానాలు, బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు వద్ద మంచినీటి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా లోపల తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేసి మూడు భాషల్లో చూచనలు చేశారు. ఆరోగ్యశాఖ అధికారులు 10, 104 వాహనాలను, భారీ జనరేటర్లను సిద్ధంగా ఉంచారు. ఇలా వివిధ శాఖల అధికారులు మొదటి రోజు కన్నా రెండో రోజు కాస్త సౌకర్యాలు మెరుగు చేశారు.
Other News
|
|||||