సమస్యలపై సమరం
రాంనగర్, టీ మీడియా: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మెడికల్, హెల్త్ కాం ట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆ ధ్వర్యంలో సోమవారం రిమ్స్ డైరెక్టర్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్, గెడం తిలక్ మాట్లాడుతూ గత ఏడు నెలల నుంచి కళాశాల, ఆరు నెలల నుంచి ఆసుపత్రి వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ విషయమై పలుమార్లు రిమ్స్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మూడు రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్షికమంలో ఆ సం ఘం నాయకులు ముక్రం సంజీవ్, మల్లయ్య, సత్యం, అంజేష్, సోహైల్, రాకేష్ పాల్గొన్నారు.
ఎమ్మార్పీలుగా కొనసాగించాలని..
రెండు సంవత్సరాల నుంచి ఆర్‌డబ్ల్యూఎస్‌లో సేవలందిస్తున్న ఎమ్మార్పీలను యథావిధిగా విధు ల్లోకి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ ఎమ్మార్పీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీ ఐటీయూ జిల్లా కోశాధికారి సతీష్, ఆ సంఘం నా యకులు తిరుపతి, మల్లేశ్ మాట్లాడుతూ పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ గత రెండేళ్ల నుంచి ఎమ్మార్పీలుగా సేవలందిస్తున్న తమను తొలగిస్తు న్నట్లు జిల్లా కోఆర్డినేటర్ తెలిపారన్నారు. కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆర్‌ఎంపీలను కొనసాగించాల ని పేర్కొన్నా, దానికి విరుద్ధ్దంగా 14 ఆగస్టు నుం చి విధుల్లోకి హాజరుకావద్దని తెలిపారన్నారు. ఎమ్మార్పీలను యదావిధిగా కొనసాగించాలని లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతా మని హెచ్చరించారు. కార్యక్రమంలో శశిమా ల, జయంత్, చంపత్, శుద్దోదన్, కమల్, రజిత, దీపక్, మల్లేష్, హుస్సేన్, రౌఫ్ పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులు..
అక్రమంగా తొలగించిన మధ్యాహ్న భోజన కా ర్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డి మాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సో మవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అద్యక్షుడు డి మల్లేష్ మాట్లాడుతూ అక్రమంగా తొలగించిన వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న, మోనవ్వ, భారతీబాయి పాల్గొన్నారు.
హెల్త్ ఎమర్జెన్సీ కోసం..
జిల్లాలో అతిసార, విషజ్వరాలతో గిరిజనుల మరణాలను అరికట్టడానికి హెల్త్ ఎమరెన్సీ ప్రకటించాలని సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎ దుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఐ నాయకులు లంకారాఘవులు, జిల్లా కమిటీ స భ్యులు కనకగణపతి మాట్లాడుతూ గిరిజనుల మరణాలను అరికట్టెందుకు జిల్లాను హెల్త్ ఎమ ర్జెన్సీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో నాయకులు స్వామి, ఆనంద్‌రావ్, లక్ష్మ ణ్, గంటుబాయి, స్వామి పాల్గొన్నారు.
ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై..
మంచిర్యాల కల్చరల్: ఫీజు రియంబర్స్‌మెంట్ ను ఎత్తివేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం ప్రయత్నిస్త్తోందని ఆరోపిస్తూ మంచిర్యాలలో సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేవై ఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనం తరం కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిప త్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆంజనేయు లు పట్టణ అధ్యక్షుడు విజయ్, ప్రధాన కార్యదర్శి గోలి రామాంజనేయులు, కిరణ్, నాగరాజు, లక్ష్మ ణ్, అశోక్, ప్రశాంత్, శ్రావణ్ పాల్గొన్నారు.
విద్యార్థుల సమస్యలపై..
ఉట్నూర్: ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటు న్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం పీఎమ్మార్సీ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సంధ ర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అద్యక్షుడు జాదవ్ రాజేం దర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శోభన్ నాయక్, జిల్లా కా ర్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ విద్యార్థు లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేం దుకు అధికారులు కృషిచేయాలన్నారు. ఈ మేర కు పీఓ ముత్యాల రాజుకు వినతి పత్రం సమ ర్పించారు. నాయకులు తుకారాం, ప్రేంకు మా ర్, సచిన్, రవి, అశోక్, కిరణ్, రాజు ఉన్నారు.
Other News