Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Adilabad>>  General News
‘ఏజెన్సీ పదోన్నతుల్లో గిరిజనులకే అవకాశం కల్పించాలి’

ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 6 (టీ మీడియా): జీఓ 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేయాలని నిబంధనలున్నాయని, దీని ప్రకారం పీజీ హెచ్‌ఎం, పీఎస్ హెచ్ ఎం, ఎస్‌ఏ కేడర్ పోస్టులను గిరిజన ఉపాధ్యాయులతో భర్తీ చే యాలని ఏజెన్సీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం కన్వీనర్ సాహెబ్‌రావ్ పవార్ కోరారు. సోమవారం సంఘ నాయకులతో కలిసి డీఈఓకు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ ఈ జీఓ ప్రకారమే ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి పోస్టులను భర్తీ చేస్తుందన్నారు. ఈ ప్రాంతంలో గిరిజన ఉద్యోగులు మాత్రమే పనిచేయాలని జీఓ స్పష్టంగా చెబుతుందని, అయితే ప్రమోషన్ల విషయంలో ఈ జీఓను అమలు పర్చడం లేదని ఆరోపించారు. ఐటీడీఏ యాజమాన్యం కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దీని ప్రకారమే ప్రమోషన్లు ఇస్తున్నట్లు, లోకల్ బాడీ(జడ్పీ, ఎంపీ) మేనేజ్‌మెంట్, ప్రభుత్వ మేనేజ్‌మెంట్, ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న పోస్టులను బదిలీల్లో గిరిజన ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని కోరారు. కోకన్వీనర్ తులసీ రాం జాదవ్, బలిరాం, భిక్కులాల్, మదన్‌సింగ్ పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd