రేపు మంత్రి బస్వరాజు సారయ్య రాక
- మంచిర్యాల, మందమర్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
మంచిర్యాల రూరల్, అగస్టు 2 (టీ మీడియా) : తూర్పు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య శనివారం మంచిర్యాలకు రాను న్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డివిజన్‌అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం, ఓవర్ బ్రిడ్జిసమీపంలోని ఉర్దూ మీడి యం పాఠశాల ప్రారంభోత్సవం, అదనపు తరగతి గదులు, రక్తనిధి కేంద్రంలో రక్తదాన శిబిరం, ఆసుపవూతిలో ఆరోగ్య శ్రీ వార్డు, రాజీవ్‌నగర్‌లోని లబ్దిదారులకు పట్టాల పంపిణీ, మోడల్ స్కూల్ భవనం, బాలికల వసతి గృహం శంకుస్థాపన చేయనున్నారని ఆర్డీవో నర్సింగరావు తెలిపారు.
మందమర్రి రూరల్ : మందమర్రి నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య మందమ ర్రికి రానున్నారు. ఆయన వెంట పెద్దపల్లి ఎంపీ వివేకానంద్,ఎమ్మెల్యేలు గడ్డం అరవిందడ్డి, నల్లాల ఓదెలు పాల్గొంటారు. మధ్యాహ్నం మూ డు గంటలకు మంత్రి మందమపూరికి చేరుకుంటా రని తహసీల్దార్ అశోక్ తెలియజేశారు.
Other News