విద్యాసంస్థల బంద్ సక్సెస్
- విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపుతో స్వచ్ఛందంగా మూతపడ్డ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు
- విద్యారంగ సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు
- జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపు మేరకు మంగళవారం జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను స్వచ్ఛంగా మూసివేయగా, విద్యార్థి లోకం ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించింది. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న సర్కారు తీరును ఎండగట్టింది.
ఆదిలాబాద్ టౌన్, జూలై 17 (టీ మీడియా): రాష్ట్రవూపభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పీడీఎస్‌యూ, ఎఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ఐ, ఏఐడీఎస్‌ఓ విద్యార్థి సంఘాల ఐ క్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, ఉట్నూర్‌లలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదని సంఘాల నాయకులు మండిపడ్డారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అక్రమ ఫీజుల వసూళ్లను నిలువరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు రా జ్యమేలుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. ఆదిలాబాద్‌లో విద్యార్థి సం ఘాల నాయకులు నిరసన ర్యాలీలు చేపట్టారు. అ నంతరం బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో ఎస్‌ఎఫ్‌ఐ నా యకులు ప్రేంకుమార్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు తోకల తిరుపతి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు అఫ్రోజ్‌ఖాన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో హోరెత్తించారు. మందమర్రి, లక్షెటిపేట, తాండూర్, బెల్లంపల్లిలలో ఆందోళనలు చేపట్టారు. నిర్మల్‌లో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు రాజు, ఏబీవీపీ నాయకులు సర్వేష్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. కాగజ్‌నగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు జాదవ్ ప్రేంకుమార్ నేతృత్వంలో నిరసన కార్యక్షికమాలను నిర్వహించారు. ఉట్నూర్, జన్నారంలలో విద్యార్థి సంఘాల నాయకులు రాస్తారోకో తీశారు. జైనూర్, ఇంద్ర ల్లి మండలాల్లో విద్యాసంస్థలను మూసి ఉం చా రు. జిల్లాలోని అన్ని మండలాలు, డివిజన్ కేం ద్రాలు, ప్రధాన ప్రాంతాలలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.
Other News