|
|
కొత్త సీసాలోకి పాత సార
- జిల్లాకేంద్రంలో ‘రింగ్’కు ఎత్తుగడ -టీ మీడియా, ఆదిలాబాద్ (టీ మీడియా, ఆదిలాబాద్):పరిస్థితులు చూస్తుంటే జిల్లాకేంవూదంలో మ ళ్లీ సిండికేట్ భూతం అవతారమెత్తనుందని తె లుస్తోంది... పాత వ్యాపారులకు దుకాణాలు దక్కనిచోట్ల కోట్ల రూపాయలు ఖర్చుచేసైనాస రే లక్కీదారులను కొనేసేందుకు పన్నాగం చేస్తున్నారు. ఆదిలాబాద్‌లోని నాలుగు దుకాణాలపై సిండికేట్ వ్యాపారుల చూపు పడింది. ఈ నాలుగు దుకాణాలను దక్కించుకునేందుకు ఇప్పటికే ₹1.5 కోట్లు ఖర్చుచేసిన వ్యాపారులు రెండో నెంబర్ దుకాణంకోసం మరో ₹50 ల క్షలు ఖర్చుచేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ దుకాణం దక్కించుకున్న లక్కీ.. అ భ్యర్థి అందుకు ససేమిరా అన్నట్లు సమాచా రం.! ఏది ఏమైనపపటికీ దుకాణం తానే నడుపేందుకు సిద్ధమయినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో తాజాగా ఇదేవిషయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తాజాగా విధించిన పకడ్బందీ నిబంధనల నడుమ వ్యాపారులు పె ట్టదలిచిన కోట్లరూపాయల పెట్టుబడిని ఎలా రాబడతారని సందేహంగా ఉందా..? ఇంకేముంది పక్కనున్న మహారాష్ట్ర నుంచి జీరో మాల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మేయడమే..! అం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా, వినియోగదారులకు నకిలీ మద్యం తాగించేందుకు స్కెచ్ చేసినట్లు అర్థమవుతోం ది. ఏదోవిధంగా డబ్బులు సంపాదించవచ్చనే ధీమాతోనే సిండికేటుగాళ్లు జిల్లా కేంద్రంలోని నాలుగు దుకాణాలను దక్కించుకునే పనిలో పడ్డారు. మద్యం వ్యాపారం ఎక్కువగా ఉండే నిర్మల్, మంచిర్యాలలో సిండికేట్ వ్యూహాలు మాత్రం పెద్దగా కనిపించడంలేదు. వ్యూహం పన్నేనా.. సిండికేట్ వ్యాపారానికి జిల్లా కేంద్రం ము ఖ్యమైన కేంద్రం.. ఇక్కడ జరిగే వ్యాపారం జి ల్లాలో మరే పట్టణంలో జరగదు. అందుకే బ డావ్యాపారుల కళ్లన్నీ ఈ దుకాణాలపై పడ్డా యి.. పోయినేడు కోట్లు గుమ్మరించి తీసుకున్న దుకాణాలన్నీ ఈ యేడు కొత్తవారి చేతుల్లోకి వె ళ్లిపోయాయి. పాత వ్యాపారులు లక్కీవూడాలో పాల్గొన్నా వారికి ఒక్క దుకాణంకూడా దక్కకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూ స్తున్నారు. ఆదిలాబాద్‌లోని ఒకటో నంబర్ దు కాణం దక్కించుకున్న బోథ్ మండలం సొనాలకు చెందిన రమణాడ్డిని, రెండో నంబర్ దు కాణం దక్కిన కొత్తూరు మహేందర్‌డ్డిని, మూడో నంబర్ రాజాగౌడ్, నాలుగో నంబర్ అనిశ్‌రావ్‌ను మభ్యపెట్టే పనిలో బడా వ్యాపారులు పడ్డట్లు తెలిసింది. వీరందరూ మద్యం వ్యాపారంలో కొత్తవారు కావడంతో ఇప్పటికే మద్యం సామ్రాజ్యాన్ని ఏలుతున్న బడా వ్యా పారులతో చేతులుకలిపే అవకాశాలుంటాయనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నలుగురిలో రెండో నంబర్ దుకాణం దక్కించుకు న్న కొత్తూరి మహేదర్‌డ్డి మాత్రం పాతవారి తో చేతులు కలపడానికి ససేమిరా అన్నట్లు వి శ్వసనీయ సమాచారం. నాలుగు దుకాణాలవా రు సహకరిస్తేనే సిండికేట్ ఏర్పాటుచేయొచ్చు. ఒక్క దుకాణందారు కాదన్నా.. మళ్లీ మద్యం అమ్మకాల్లో పోటీ ఏర్పడి ధరలు పూర్తిగా తగ్గి వ్యాపారం దెబ్బతినే అవకాశాలుంటాయి. ఈ భయంతోనే పాత వ్యాపారులు ఆచీతూచీ వ్య వహరిస్తున్నారని తెలిసింది. మహారాష్ట్ర సరుకు అమ్మేందుకు.. కోట్ల రూపాయలు ఖర్చుచేసి దుకాణాలు ద క్కించుకున్నా.. తిరిగి పెట్టిన పెట్టుబడులు సం పాదించాలంటే పక్క మార్గాలు వెతక్క తప్పని పరిస్థితి. పక్కనున్న మహారాష్ట్ర నుంచి జీరోలో మద్యం తెప్పించుకుని ప్రభుత్వానికి రూపాయికూడా కట్టకుండా డబ్బులు సంపాదించేందు కు ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నారని అ ర్థమవుతోంది. గతంలో ఇక్కడి సిండికేట్ వ్యా పారులు మహారాష్ట్రనుంచి మద్యం తెస్తూ పోలీసులకు, ఎక్సైజ్ అధికారుల చేతికి చిక్కిన సందర్భాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చే మద్యానికి బిల్లులుండవు. ప్రభుత్వానికి చిల్లిగవ్వా కట్టాల్సిన అవసరముండదు. ఈ లెక్కన ప్రభుత్వాదాయానికి గండి కొట్టేందుకు ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ వ్యవహారమం తా సజావుగా జరగాలంటే ఎక్సైజ్ అధికారుల అండ ఉండాల్సిందే.. ప్రభుత్వం తాజాగా వి డుదలచేసిన నిబంధనల్లో ఎక్సైజ్ నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిసినా.. వ్యా పారులు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారంటే ఎక్సైజ్ అధికారులను బుట్టలో వేసుకోవడం వారికి తెలియందేమీ కాదనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ తొలుత దుకాణాలు దక్కించుకుని, ఆ తరువాత అక్ర మ వ్యాపారం చేయడానికి వ్యాపారులు ఇప్పటినుంచే సిద్ధమయినట్లు తెలుస్తోంది. మిగతా పట్టణాల్లో కనిపించని సిండికేట్లు? మద్యం వ్యాపారంలో ఆదిలాబాద్ తరువా త నిలిచే నిర్మల్, మంచిర్యాల పట్టణాల్లోని దుకాణాలకు ఈసారి పెద్దగా వ్యాపారులు పోటీపడినట్లు కనిపించలేదు. పోయినసారి అక్కడి వ్యాపారులు పెట్టిన పెట్టుబడులకు ఈసారి స్లా బ్‌రూపంలో పెట్టే పెట్టుబడి ఎక్కువవడంతోనే పరిస్థితులు తారుమారయ్యాయనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ మద్యందుకాణల టెండర్‌లో పోటాపోటీగా తలబడే కాంగ్రెస్ ప్రత్యర్థి వర్గాలు ఈసారి టెండర్ల వ్యవహారంలో కనిపించకపోవడం గమనార్హం. నిర్మ ల్ 1వ దుకాణం శ్రీనివాస్‌కు, 5వ దుకాణం రాజేంవూదవూపసాద్‌కు, 6వ దుకాణం అనిల్‌కుమార్‌కు దక్కాయి. 2, 3 దుకాణాలకు ఒక్క ద రఖాస్తుకూడా రాకపోగా, దుకాణాలన్నీ కొత్తవారికే దక్కాయి. వీరిలో ఎవరుకూడా పాత వ్యాపారులకు సంబందీకులు కాకపోవడం వి డ్డూరంగా ఉంది. గడిచిన 30 సంవత్సరాలనుంచి నిర్మల్‌లో మద్యం వ్యాపారం చేస్తున్నవారికి ఈసారి ఒక దుకాణం తప్పించి దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే పరిస్థితి తూర్పు ప్రాంతంలోకూడా కనిపిస్తోంది. తూర్పులోని దాదాపు దుకాణాలు కొ త్తవారికే దక్కినట్లు తెలుస్తోంది. మొత్తానికి సిం డికేటు భూతాలు ఒక్క జిల్లా కేంద్రంలో తప్పిం చి మరెక్కడా కనిపించడంలేదు.
Other News
|
|||||