Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Adilabad>>  General News
టీబీజీకేఎస్ హవా

- మందమర్రి ఏరియాలో విజయభేరి
- శ్రీరాంపూర్‌లో ముందంజ
- ఏఐటీయూసీదే బెల్లంపల్లి


సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం హోదా కోసం గురువారం జరిగిన ఎన్నికల్లో బెల్లంపల్లి రీజియన్‌కు సంబంధించి టీబీజీకేఎస్ సత్తా చాటింది. గురువారం అర్ధరాత్రి కడపటి వార్తలందేసరికి మందమర్రి ఏరియాలో విజయం సాధించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, శ్రీరాంపూర్ ఏరియాలోనూ ముందంజలో ఉంది. ఇక్కడ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నందున ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బెల్లంపల్లిలో ఏఐటీయూసీ విజయభేరి మోగించింది.

రాంనగర్, జూన్ 28(టీ మీడియా) : ప్రైవేట్ పాఠశాలలో పెంచిన అధిక ఫీజులపై యువజన సంఘాల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మూడు రోజులుగా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షను గురువారం విరమించారు. దీక్షలకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న మద్దతు తెలిపిన అనంతరం యువజన సంఘాల సమితి సభ్యులతో కలి సి కలెక్టర్‌ని కలిశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల తీరును కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి 15 రోజులలోపు అధిక ఫీజులపై, నిబందనలు పాటించని పాఠశాలలపై, ప్రతి కార్పొరేట్ స్కూల్లో పేద విద్యార్థులకు కచ్చితంగా 20 శాతం సీట్లు కేటాయించేలా చూస్తాననే హామీతో రిలే నిరాహార దీక్షను విరమించారు.

చర్య తీసుకోవాలి
ప్రైవేట్ పాఠశాలలు విద్యావ్యవస్థను వ్యాపార సంస్థలుగా మార్చుకుంటున్నాయని, చర్యలు తీ సుకోవాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రైవేట్ పాఠశాల, కళాశాల యజమానులు ఎందుకు స్పం దించడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ప్రశ్నించారు. యువజన సంఘాల సమితి దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. ఆయన వెంట నియోజక వర్గ ఇన్‌చార్జి లో క భూమాడ్డి, పట్టణ అధ్యక్షుడు రఫీక్, నాయకు లు రతన్‌డ్డి, బేల మాజీసర్పంచ్ పూసం ప్రభాక ర్, రామన్న యువసేన అధ్యక్షుడు బాషన్ నర్సిం గ్, గౌరవ అధ్యక్షుడు బండారి సతీష్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, వికలాంగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు ఉన్నా రు. దీక్షలో యువజన సంఘాల సమితి నాయకు లు ఉరె.గణేశ్, శ్రీపతి వార్ శ్రీనివాస్, గోలి శంక ర్, సతీష్, నర్సింగ్, సంజీవ్, శ్రీకాంత్ ఉన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd