Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Adilabad>>  General News
టెండర్ వేద్దామా... వద్దా..?

- ఆబ్కారీ కొత్త పాలసీతో అంతా అయోమయం
- ఇలా ఇచ్చి.. అలా లాక్కున్న ప్రభుత్వం
- ఆరు రెట్ల బిజినెస్ తర్వాత పన్నుల మోతపై ఆందోళన
- కొత్త వ్యాపారుల వెనుకంజ.
- మళ్లీ పాత వ్యాపారుల పాగా..?


(టీ మీడియా, నిర్మల్) :కొత్త ఎక్సైజ్ పాలసీ లిక్కర్‌సావూమాట్టులను సైతం కలవరపెడుతోంది. మునుపెన్నడు లేని విధంగా అనేక చిక్కుముడులతో కొత్త పాలసీ అమలులోకి రావడంతో ఈయేడాది ఎక్సైజ్ వ్యాపారానికి సంబంధించి దుకాణాలు దక్కించుకునే విషయంలో అసలు టెండర్ వేద్దామా.. వద్దా? అనే అంశాన్ని వ్యాపారులు తే ల్చుకోలేకపోతున్నారు. గతంలో మాదిరిగా వ్యాపా రం లాభసాటిగా లేదన్న అభివూపాయాలే వ్యాపార వర్గాలనుంచి వ్యక్తమవుతున్నాయి. చేయి తిరిగిన సిండికేట్ వ్యాపారులు... అక్రమ మార్గాలను వెతికి పట్టి నాన్‌డ్యూటీపేయిడ్ (ఎన్‌డీపీ), జీరో లిక్కర్‌ను యథేచ్ఛగా మార్కెట్‌లోకి దింపి సొమ్ము చేసుకునే వ్యాపారులు మాత్రం పాలసీ ఏదైనా... తమకు దుకాణం దక్కాల్సిందేనన్న ట్లు ఈ యేడాది లిక్కర్ వ్యాపారంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.

కొత్త పాలసీతో వ్యాపారుల వెనుకంజ
ఈ యేడాది ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చి న లిక్కర్ వ్యాపారంలో ఉన్న ప్రతిబంధకాలు వ్యాపారుల వెనుకంజకు కారణమవుతున్నా యి. ఒక యేడాదికి లైసెన్సు ఫీజు కింద వసూ లు చేస్తున్న మొత్తానికి ఆరింతల వ్యాపారం జరిగేంత వరకే అమ్మకాలపై 20 శాతం లా భాన్ని ఇస్తున్న ప్రభుత్వం అటు తర్వాత జరిగే వ్యాపారంపై పన్నుల రూపేణా వ్యాపారుల నుంచే పన్నులు వసూలు చేసేలా నిబంధనలు ఉన్నాయి. దీంతో 20 శాతం వ్యాపారం తర్వా త మద్యం వ్యాపారులకు కేవలం 6 శాతం కమీషన్ మాత్రమే దక్కే పరిస్థితి ఉంది. దీంతో మ ద్యం వ్యాపారంలో టెండర్ వేస్తే లాభదాయక మా... కాదా? అన్న అనుమానంతో వ్యాపారు లు వెనుకంజ వేస్తున్నారు. ఉదాహరణకు నిర్మ ల్ మండలంలోని మంజులాపూర్ గ్రామంలో ఉన్న వైన్స్‌నకు ఏడాదికి ₹42లక్షల లైసెన్సు ఫీజు చెల్లించాలి.

ఈ ₹42లక్షలకు గాను ఆరింతలు అంటే...రూ.2కోట్ల52లక్షల మద్యం అ మ్మకాలు జరిగితే దీనిపై 20 శాతం కమీషన్ వ్యాపారికి దక్కుతుంది. అంటే సుమారు ₹50లక్షలు వ్యాపారికి సమకూరుతుంది. ఇం దులో నుంచి నేరుగా యేడాది లైసెన్సు ఫీజు ₹42లక్షలు పోను ₹లక్షలు మిగులుతుంది. ఇందులో నుంచి ప్రతినెలా వైన్సును నడిపేందు కు కనీసం ₹50వేల ఖర్చు తప్పదు. ఈ లెక్కన ఏడాదికి ₹6 లక్షలు ఖర్చయితే మిగిలేది ₹2లక్షలు మాత్రమే. అదీ పైన చెప్పినట్లుగా ఆ గ్రా మంలో ఈ స్థాయి అమ్మకాలు జరిగితే మాత్ర మే వ్యాపారికి కనీసం ₹2లక్షలు మిగిలే అవకాశం ఉంది. లేదంటే నష్టాలు తప్పవన్న అభివూపాయాలు వ్యాపారులనుంచి వ్యక్తమవుతున్నాయి. లెక్కకు మించి అమ్మకాలు సాగే దుకాణాల్లో మాత్రం వ్యాపారులకు లాభాలు దం డిగా ఉండే అవకాశం ఉంది.

నిర్మల్ పట్టణంలోని చైన్‌గేట్ సమీపంలో ఉన్న ఓ రెండు మద్యం దుకాణాల్లో గడిచిన రెండేళ్లల్లో ₹15 నుంచి ₹20కోట్ల మేర వ్యా పారం సాగినట్లు అంచనా. ఈ లెక్కన గడిచిన రెండేళ్లలో సదరు వ్యాపారులకు 20 శాతం క మీషన్ లభిస్తే ఒక్కొక్కరికి ₹3 నుంచి 4కోట్ల మేర లాభం లభించి ఉండవచ్చునన్న అభివూపాయాలు ఉన్నాయి. ఇలాంటి భారీ సేల్స్ ఉండే దుకాణాలకు మాత్రం వ్యాపారులు తెగపోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా కమీషన్ చెల్లింపుల వ్యవహారంలో దుకాణం యేడా ది లైసెన్సు ఫీజుకు ఆరింతల వ్యాపారం అనంతరం కమీషన్ గణనీయంగా తగ్గించడంతో పెద్ద పెద్ద దుకాణాల్లోనూ ఈ యేడాది మద్యం వ్యాపారంలో లాభాలే అంతంత మా త్రమే ఉండవచ్చునన్న అభివూపాయాలు ఉన్నా యి. ఇదంతా చూస్తుంటే సర్కారు ఇలా వ్యాపారులకు దుకాణాలు ఇస్తూ ఆపై వారినుంచే అ లా పన్నులు వసూలు చేసే కొత్త ప్రక్రియకు తెరలేపిందన్న అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాగా వేసేందుకు యత్నాలు...
లిక్కర్ వ్యాపారంలో తొలి నుంచి ఆదిపత్యం చెలాయిస్తున్న వ్యాపార వర్గాలే మరోసారి దుకాణాలు దక్కించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ సారి ఆదాయప్పు పన్ను చెల్లించేవారు మాత్రమే అర్హులు కావడంతో అ లాంటి వారి కోసం వ్యాపారులు పడరాని పా ట్లు పడుతున్నారు. తూర్పు జిల్లాకు చెందిన ఓ ప్రజావూపతినిధి తన సన్నిహితుల ద్వారా మరో సారి జిల్లా వ్యాప్తంగా దుకాణాలు దక్కించుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా, పశ్చిమ జిల్లాకు చెందిన ఓ ప్రజావూపతినిధి, ఓ మాజీ ప్రజావూపతినిధి సోదరుడు, మరో మాజీ ప్రజావూపతినిధి సన్నిహితులు ఇలా గతంలో మద్యం వ్యాపారంలో తలపండిన వారే మరోసారి దుకాణాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏసీబీ దాడులతో మొన్నటి వరకు ఉక్కిరిబిక్కిరి అయిన సారా వ్యాపారవేత్తలు నిండా మునిగాక చలేంటి అన్నట్లు... ఇదే వ్యాపారంలో మ రోసారి తమదే పై చేయి అనిపించేందుకునేందు కు తమ యత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కాగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకుమావూత మే లైసెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ తెగలకు చెందిన తమ సన్నిహిత వ్యక్తుల కోసం సారా వ్యాపార వేత్తలు వెంపర్లాడుతున్నారు.

జీరో మద్యం తప్పదా...?
ఇంతకాలం మద్యం ప్రియులను వేధించిన జీరో మద్యం ఈ యేడాది కూడా తప్పేట్టు లేద న్న అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. అయి తే గతంలో మొదటి రోజుల్లో ఎలాంటి ఆంక్షలు లేని కారణంగా సిండికేట్ వ్యాపారం యథే చ్ఛగా సాగిన నేపథ్యంలో జీరో మద్యం ఆనవా ళ్లు కనిపించలేదు. ఎమ్మార్పీతోనే అమ్మాల్సిన పరిస్థితి తలెత్తడంతో పొరుగు మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నాన్‌డ్యూటీ పేయిడ్ జీరో మద్యం జిల్లాలో ఏరులై పారిం ది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కల్తీమద్యం సైతం విచ్చలవిడిగానే అమ్మకాలు సాగాయన్న ఆరోపణలు వెల్లు ఇందుకు సంబంధించి జిల్లాలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలాఉంటే తాజాగా అమలులోకి వచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో చోటు చేసుకున్న కమీషన్ నిబంధనల కారణంగా జీరో మద్యం తిరిగి కోరలు చాచే ప్రమాదం ఉందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd