ఆగడాలు సాగవనే అసత్య ప్రచారం
- కాగజ్‌నగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు కావేటి, జోగు
తాండూరు (టీ మీడియా) : టీబీజీకేఎస్ గెలిస్తే ఆంధ్రా వలసవాద సంఘాల ఆగడాలు సాగవనే అసత్య ప్రచారం చేస్తున్నారని కాగజ్‌నగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, జోగు రామన్న అన్నారు. గోలేటి 1ఏ గనిపై ఫిట్ సెక్రటరీ బైరి శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ వారు మాట్లాడారు. తెలంగాణవాదాన్ని అణచి వేసేందుకే జాతీయ సంఘాలు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై కుట్రలు పన్నుతున్నాయని, ఎన్నికలకు రాష్ట్ర ఏర్పాటు సంబంధం లేదంటూ ప్రచారం చేస్తున్నాయని అన్నారు. టీబీజీకేఎస్ గెలిస్తే ఇక్కడి వనరులు దోచుకు సాధ్యం కాదని, ఎలాగైనా గెలవాలని కార్మికులను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను సాధించడం ఒక్క టీబీజీకేఎస్‌కే సాధ్యమని, వారసత్వ ఉద్యోగాలను పోగొట్టడమే కాక సమ్మె అడ్వాన్స్ కోత విధించడానికి అంగీకరించిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్చెమ్మెస్, బీఎంఎస్ ఇప్పుడు కట్టుకథలు చెబుతున్నాయని మండిపడ్డారు.
కార్మికులు టీబీజీకేఎస్‌ను అధిక మెజారిటితో గెలిపించాలని, ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కార్మికుల సత్తా ఏంటో ఢిల్లీలోని సోనియాగాంధీకి తెలిసిరావాలని అన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూమాడ్డి, నాయకులు బోజిడ్డి, టీబీజీకేఎస్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు ఆర్‌పవీణ్, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి కడియాల నర్సయ్య, బెల్లంపల్లి టౌన్ అధ్యక్షుడు పసుల సురేష్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడ సతీష్, తాండూరు మండలాధ్యక్షుడు మంగపతి సురేష్‌బాబు, యువత అధ్యక్షుడు ఎస్కే రషీద్, టీబీజీకేఎస్ నాయకులు గోవర్థన్, సాంబాగౌడ్, భీమగోపాల్, కుమారస్వామి, రాజు, రాయమల్లు, కోవ లక్ష్మి, శంకరమ్మ, భాగ్య ఉన్నారు.
Other News