Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Adilabad>>  General News
ధరలిట్ల..కొనేదెట్ల?

-పైపైకి బియ్యం
-కొండెక్కిన చికెన్
-ముడితే కూర‘గాయాలు’
-ఉడకని పప్పులు
-కాగుతున్న నూనెలు
-ఆవిరవుతున్న పెట్రోల్
-అన్నింటా పెరుగుదల
-సామాన్యుడు విలవిల


బియ్యం క్వింటాల్‌కు ₹400 నుంచి ₹600 దాకా, చికెన్ కిలోకు ₹20 నుంచి ₹0 వరకు, పెట్రోల్ లీటర్‌కు ₹5.50 దాకా.. ఇలా గడిచిన నెలరోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూలేనంతగా పెరిగాయి. ఉప్పు నుంచి పప్పు వరకు.. నూనెల నుంచి కూరగాయల దాకా అన్నీ భగ్గుమంటూ సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి.

ఆదిలాబాద్ టౌన్, జూన్ 13(టీ మీడియా): మార్కెట్‌కు వెళ్లాలం జనం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారైతే ఏరోజు ధరలు ఎంత పెరుగుతాయోననే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. బి య్యం, పప్పులు, కూరగాయలు, వంటనూనెలు వేటిని చూసినా ధరలు మండిపోతున్నాయి.

నెల రోజుల క్రితం వరకు బియ్యం ధరలు ఓ మోస్తారుగా ఉండగా, 15 రోజులుగా ధరలు అ మాంతంగా పెరిగిపోతున్నాయి. క్వింటాలుకు నెల రోజుల్లోనే ఏకంగా ₹200 నుంచి ₹600 పెరగడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ కూలీలు ప్రతిరోజూ అవసరం మేరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలం ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న డబ్బులతో సర్దుకుపోతున్నారు. సాధారణ రకం బి య్యం కిలోకు ₹1 నుంచి ₹22 పెట్టాల్సి వస్తోంది. ఇక బీపీటీ బియ్యం కిలోకు ₹24 నుంచి ₹36 వరకు పలుకు తోంది. సోనామసూరి లాంటి రకా లు ₹33 నుంచి ₹4కి చేరుకున్నాయి. అయినా తప్పని స్థితిలో అధిక ధరలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.

నూనె, పప్పుల ధరలు సైతం ఆకాశాన్ని అం టుతున్నాయి. కందిపప్పు ₹.55, పెసరపప్పు ₹65, శనగపప్పు ₹55కు కిలో చొప్పున అమ్ముతున్నారు. ఇక పల్లినూనె లీటరు ₹120లకు చేరుకుంది. కాటన్‌నూనె ₹65, సన్‌ఫ్లవర్ రూ.65, పా మాయిల్ ₹60 పలుకుతోంది. వీటితో పాటు ఉ ప్పు, కారం, పసుపు, చక్కెర ధరలు సైతం విపరీతంగా పెరగడంతో ఏంచేయాలో తోచని పరిస్థితి నెలకొంది. మటన్, చికెన్ ధరలు సైతం సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. మటన్ ధర కిలోకు ₹300కు చేరుకోగా చికెన్ ధర ₹10కు చేరుకుంది. దీంతో అసలు ఏంకొనాలో అర్థం కాక సాధారణ, మధ్యతరగతి ప్రజలు తల లు పట్టుకుంటున్నారు. ధరలు చూసి వారు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలతో కూరగాయల ధరలు పోటీపడుతున్నా యి. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ బావులు, బోర్లలో నీటిమట్టం తగ్గిపోయింది తెలిసిందే. దీంతో కూరగాయల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కారణం తో కూరగాయలను ఇతర ప్రాంతాల నుం చి దిగుమతి చే సుకోవాల్సి వస్తోంది. ఆయా మార్కెట్‌లకు వస్తున్న కూరగాయలకు డి మాండ్ ఉండడం, అక్కడి నుం చి జిల్లా కు తీసుకురావడానికి రవాణా ఖర్చులతో ధరలు అ మాంతం పెరిగిపోతున్నాయి. టమాట, మిర్చిలాంటి వాటి ధ రలు సైతం సామాన్యులకు అందు బాటులో లేకపోవడం తో ఆందోళన చెందుతున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd