Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Adilabad>>  General News
ట్రాక్టర్.. ట్రాక్టర్ ఎందుకు దున్నలేదు..

-ట్రాక్టర్లిచ్చారు.. పరికరాలు మరిచారు..
-నిర్వహణ ఖర్చుల ఊసేలేదు
-పీఏసీఎస్ చైర్మన్ల ఇళ్లకే పరిమితం
-ఎస్సీ, ఎస్టీల భూముల్లో ఉచిత సేవలకు మంగళం
-ఉపయోగంలోకి తెస్తాం : జేడీఏ రోజ్‌లీన


‘చేపా.. చేపా ఎందుకు ఎండలేదు?’ అంటే.. ‘ఎండగొట్టలేదు’ అందట! ‘ట్రాక్టర్.. ట్రాక్టర్.. ఎందుకు దున్నలేదు’ అని ఇక్కడి ట్రాక్టర్లను అడిగితే.. ‘డీజిల్ పోస్తే గదా దున్నడానికి’ అంటున్నాయి! ఔను మరి.. గతేడాది ₹ 3 కోట్లు ఖర్చు చేసి వంద శాతం సబ్సిడీతో 70 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు అందజేసిన ట్రాక్టర్లలో సగానికిపైగా అధికారుల నిర్లక్ష్యంతో మూలనపడ్డాయి. ఎస్సీ, ఎస్టీల భూములను ఉచితంగా దున్నాల్సినవి కాస్తా చైర్మన్ల ఇంటి సేవలకే పరిమితమయ్యాయి. కనీస నిర్వహణ లేక చాలాచోట్ల తుప్పుపడుతున్నాయి. ఇకనైనా పట్టించుకోకపోతే ఎందుకూ పనికిరాకుండా పోనున్నాయి!

(టీ మీడియా, ఆదిలాబాద్):ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూములను ఉచితంగా ఉచితంగా దున్నడానికి వ్యవసాయశాఖ సహకార సంఘాలకు ఉచితంగా అందజేసిన ట్రాక్టర్లు చాలాచోట్ల తుప్పుపడుతున్నాయి. కొ న్నిచోట్ల చైర్మన్ల ఇంటిపనులకు ఉపయోగపడుతున్నాయి. ₹ 3కోట్లు ఖర్చుచేసి వందశాతం స బ్సిడీతో జిల్లాలోని 70 సొసైటీలకు పోయినేడు వ్యవసాయాధికారులు ట్రాక్టర్లు అందజేశారు. ఎంతో ఆర్బాటంగా ఉన్నతాధికారుల చేతులమీదుగా ఈ ట్రాక్టర్ల పంపకం జరిగింది. ఇందులో సగానికిపైగా ట్రాక్టర్లు రిజిస్ట్రేషన్‌కుకూడా నోచుకోకపోవడం సొసైటీ సభ్యుల, వ్యవసాయాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. జిల్లాలోని పదిశాతం ఎస్సీ, ఎస్టీలకుకూడా ఈ ట్రాక్టర్లు ఉ పయోగపడలేదంటే నమ్మశక్యం కాకపోయినా నమ్మక తప్పని పరిస్థితులున్నాయి. 70 శాతం ట్రాక్టర్లకు డ్రైవర్లుకూడా లేకుండా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు తుప్పుపడుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు కల్పించుకోకపోతే మిగిలేది పాతసామాన్లు, ఇనుపడబ్బాలేననే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.

₹3కోట్లు వృథా..
జిల్లాలోని 70 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్)లకు పోయినేడు వ్యవసాయాధికారులు ట్రాక్టర్లు అందజేశారు. ఒక్కో ట్రాక్టరుపై ₹ 4.20 లక్షలు ఖర్చుచేసి సొసైటీ స భ్యులకు అందజేశారు. గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ ల భూములను సస్యశ్యామలం చేయాలనుకుని వారికోసం ₹2.94 కోట్లు ఖర్చుచే సి ట్రాక్టర్లు ఇచ్చిన అధికారులు భూములు దున్నుకోడానికి ఉపయోగపడే రొటోవేటర్లు, ప్లౌలు కొనడానికిమాత్రం రూపాయికూడా ఖర్చుచేయలేదు. దాంతో ట్రాక్టర్లు దున్నడానికి బదులు పీఏసీఎస్‌ల చైర్మన్లు, కార్యదర్శుల ఇంటి పనులకు పరిమితమయ్యాయి. ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 7 ట్రాక్టర్లు, ఇచ్చోడ, భైంసా సబ్‌డివిజన్ పరిధిలో 6, నిర్మల్ పరిధిలో 4, చెన్నూర్ పరిధిలో 6, ఉట్నూర్ పరిధిలో 6, ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి పరిధిలో 5, ఖనాపూర్ పరిధిలో 4, కాగజ్‌నగర్ పరిధిలో 10, ఏజెన్సీ ప్రాంతంలో మరో ఐదు ట్రాక్టర్లు అందజేశారు. ట్రాక్టర్లు అందజేసి దాదాపు ఏడాది గడుస్తున్నా కనీసం 500 కిలోమీటర్లుకూడా తిరగని ట్రాక్టర్లున్నాయి. ఈలెక్కన వాటి వినియోగం ఏమేరకు జరిగిందో అర్థమవుతోంది.

నడవడానికి ఖర్చులు?
ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూములను ఉచితంగా దున్నడానికి ట్రాక్టర్లు అందజేసిన వ్యవసాయాధికారులు వాటి మెయింటనెన్స్ (డీసిల్, డ్రైవర్ వేతనం) ఖర్చులు మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఓవైపు ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూములను ఉచితంగా దున్నాలనే నిబంధన పెట్టి మరోవైపు డీజిల్‌కుకూడా డబ్బులివ్వకపోవడంతో ట్రాక్టర్లు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో సొసైటీ సభ్యులుకూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో పరిస్థితి ఇలా దాపురించిందనే ఆరోపణలున్నా యి. నిజానికి ఎస్సీ, ఎస్టీ యేతరుల భూములు దున్నడానకికూడా ఈ ట్రాక్టర్లను వాడవచ్చు. ఎందుకంటే వీరి భూములను దున్నితే వచ్చే డబ్బులతో మెంటేనెస్ ఖర్చులు తీరుతాయనేది ఇందులో దాగున్న మర్మం. ఈ పద్ధతిని జిల్లా లో ఎక్కడా పాటించిన పాపానపోలేదు. మొత్తానికి ₹3కోట్లు ఖర్చుచేసి పీఏసీఎస్‌లకు ఇచ్చిన ట్రాక్టర్లు చాలాచోట్ల తుప్పుపడుతున్నాయి.

ఉపయోగంలోకి తీసుకొస్తాం..
ఎస్సీ, ఎస్టీల వ్య వసాయ భూములను సస్యశ్యామ లం చేయడానికి జి ల్లాలోని 70 సహకార సంఘాలకు ఇ చ్చిన ట్రాక్టర్లు చాలాచోట్ల పనిచేయడంలేదని తె లిసింది. ట్రాక్టర్లు వృథా కావడానికి కారణాలను తెలుసుకుంటాను. వాటిని ఉపయోగంలేకి తె స్తాం. కొన్నిచోట్ల చైర్మన్ల ఇంటి పనులకు కూడా వినియోగిస్తున్నారని తెలిసింది. అలాంటివారిపై కఠిన చర్యలు తప్పవు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd