Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Adilabad>>  General News
ఇంకెప్పుడు అందేను?

- నేటికీ 18 మండలాల్లో పత్తాలేని పాఠ్యపుస్తకాలు
- 34 మండలాలకు 50 శాతమే సరఫరా
- రెండు రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు
- కావాల్సింది 20 లక్షలు.. వచ్చింది 10 లక్షలు

(టీ న్యూస్, ఆదిలాబాద్ ఎడ్యుకేషన్) ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యలో పాఠ్యపుస్తకాల ప్రాధాన్యం వెల కట్టలేని దే. జిల్లాలో 2012-13 విద్యా సంవత్సరానికి ప్ర భుత్వం సరఫరా చేసే పాఠ్య పుస్తకాలు సకాలంలో చేరతాయా? లేదా అన్న ప్రశ్న ఇపుడు విద్యార్థు లు, తల్లిదంవూడులను తొలుస్తుస్తోంది. ఒకటి నుం చి పదోతరగతి వరకూ 21,58,200 లక్షల పుస్తకాలు అవసరమని జిల్లా అధికారులు ప్రతిపాదన లు పంపారు. అయితే గత సంవత్సరం పుస్తకాలు 1,43,456 ఉన్నాయని, ఇవి పోను మిగితావి పంపించాలని అధికారులను కోరారు. ఇవి మే మొదటి వారానికే అందాలి. మొత్తం 20,16, 744లక్షల పుస్తకాల్లో ఇప్పటి వరకు గోదాంకు కేవ లం 9,92,960 లక్షల పుస్తకాలు మాత్రమే చేరా యి. మిగితా 10,23,784 లక్షల పుస్తకాలు వ చ్చాయి. జిల్లాకు ఇప్పటివరకు 50 శాతం పుస్తకా లు మాత్రమే అందాయి. మరో రెండురోజుల్లో పా ఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకం ఉండడం కలగానే కన్పిస్తోంది.

ఆ మూడు తరగతుల పరిస్థితి ఏమిటో..
2012-13 విద్యాసంవత్సరంలో మూడు, ఏ డు, తొమ్మిదో తరగతులకు సిలబస్‌ను మార్పు లు, చేర్పులు చేశారు. దీంతో ఇప్పటివరకు ఆరో తరగతికి సంబంధించిన ఉర్దూ రీడర్, హిందీ, తె లుగు, గణితం, సైన్స్, సోషల్, 7వ తరగతికి సం బంధించిన రెండో భాష తెలుగు, సైన్స్, సోషల్, గణితం, సబ్జెక్టుల పుస్తకాలు ఇప్పటిదాకా జిల్లాకు చేరుకోలేదు. జిల్లాలో సక్సెస్ పాఠశాలలు ఈ సం వత్సరం విద్యార్థులు 10వతరగతిలోకి అడుగుపెడుతున్నారు. సక్సెస్ స్కూల్స్ ప్రారంభం నుంచీ ఇప్పటిదాకా ఏ విద్యాసంవత్సరంలో నూ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పుస్తకాలు అందలేదు.

సకాలంలో పంపిణీ జరిగేనా..?
జిల్లా పుస్తక గోదాంకు ఇప్పటి వరకు చేరిన పు స్తకాలను జిల్లాలోని 34 మండలాలకు 50 శాతం చొప్పున పంపిణీ చేశారు. మరో 18 మండలాల కు రెండో విడత వచ్చే పుస్తకాలను సరఫరా చేయడానికి అదికారులు నిర్ణయించారు. అయితే ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిసంవత్సరం పుస్తకాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. సక్సెస్ పాఠశాల విద్యార్థులకు ప్రతి సంవత్స రం చాలావరకు పాఠ్య పుస్తకాలు అందకుండానే పోతున్నాయి. ఇప్పటివరకు జిల్లాకు 20 శాతం మాత్రమే ఆంగ్ల పుస్తకాలు వచ్చాయి. దీనికి తోడు 3,6,7 తరగతుల పుస్తకాలు మారడంతో ఉపాధ్యాయుల్లో సైతం ఆందోళన నెలకొంది.

బహిరంగ మార్కెట్‌లోనూ కొరతే..
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పాఠ్య పు స్తకాల పంపిణీ ఇలా ఉంటే.. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు బహిరంగ మార్కెట్‌లో కొందా మంటే పుస్తకాలు దొరకడం లేదు. సహజంగా ప్రా థమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు వి ద్యా సంవత్సరం ఆరంభానికి పక్షం రోజుల ముం దే పుస్తకాలు మార్కెట్‌లో దొరికేవి. కానీ డిమాండ్‌కు సరిపడా పుస్తకాల ముద్రణ కాకపోవడంతో బహిరంగ మార్కెట్‌కు అందడం లేదని తెలుస్తోం ది. ఒకవైపు పాఠశాలల ఆరంభానికి ఇంకా రెండు రోజులు గడువే మిగిలి ఉంటే పుస్తకాల కోసం దు కాణాల వెంట తిరగాల్సిన పరిస్థితి నెలకొందని వి ద్యార్థుల తల్లిదంవూడులుఆందోళన చెందుతున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd