|
|
20 నుంచి ‘అసంఘటిత కార్మిక రణభేరి’
రాంనగర్, జూలై 11(టీ మీడియా): అసంఘటిత కార్మికుల స్థితిగతులను, విధి విధానాలను లోతుగా పరిశీలించిన అనంతరం ఈనెల 5 నుం చి వరకు హైదరాబాద్‌లో జరిగిన సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో అసంఘటిత కార్మిక సంక్షేమం కోసం ఈనెల 20 నుంచి 30 వరకు అసంఘటిత కార్మిక రణభేరి జాతను నిర్వహించాలని పిలుపునిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబా బు వెల్లడించారు. బుధవారం స్థానిక సుందర య్య భవనంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది అసంఘటిత రంగ కార్మికులున్నారని, వా రిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల కార్మికులకు యూనియన్లున్నాయని, లేనిచోట శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. వారి సంక్షేమం కోసం ఈనెల 20 నుంచి 30 వరకు రాష్ట్రంలోని 1140 మండలాలను కలుపుతూ 23 జిల్లాల్లో రణభేరి యాత్ర సాగుతుందని తెలిపారు. కార్మికులకు సంబంధిం చి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత, పీఎఫ్ ప్రమాద బీమా కల్పించాలన్నారు. ఆదిలాబాద్‌లో ఈనెల 2, 30 తేదీలలో ఎమ్మా ర్వో కార్యాలయం ముందు మహాధర్నాలు, 19, 20 తేదీల్లో మండల కార్మికుల సర్వేలు, యాత్ర ఎవరికోసం అనే దానిపై కరపవూతాల పంపిణీ, 21న రణభేరి యాత్రకు ఏర్పాట్లు, 22 నుంచి రణభేరి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇం దులో భాగంగా ఆయా మండలాల నుంచి కార్మికుల వద్దకు వెళ్లి సంతకాలు సేకరించి వారి స్థితిగతులను కలెక్టర్‌కు తెలియజేస్తామన్నారు. ఆగస్టు లో సీఎంను కలిసి కార్మికుల స్థితిగతుల గురించి వివరించనున్నట్లు వెల్లడించారు.
Other News
|
|||||