సార్లకు తిరగబడ్డ ‘రోగం’
- మళ్లీ తెరపైకి మెడికల్ రీయింబర్స్‌మెంట్ వ్యవహారం
- డీఈఓ విచారణతో కదులుతున్న డొంక
- వెలుగులోకి మరిన్ని వాస్తవాలు
- సూత్రధారులు నిర్మల్ ఉపాధ్యాయులు
- జిల్లావ్యాప్తంగా మరో 50 బోగస్ కేసులు
- ₹ 6 కోట్లకుపైగా స్వాహా
- అక్రమార్కుల్లో గుబులు
- బాధ్యులపై చర్యలు : డీఈఓ
ఎనిమిది నెలల కిత్రం జిల్లా విద్యాశాఖను ఓ కుదుపు కుదిపిన బోగస్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అక్రముల్లాఖాన్ మాయ‘రోగాన్ని’ తిరగదోడడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ బాగోతంలో ₹ ఆరు కోట్లకుపైగా స్వాహా అయినట్లు ఫిర్యాదులుండగా, నిర్మల్‌కు చెందిన పలువురు ఉపాధ్యాయులు ముఖ్యపాత్ర పోషించినట్లు దృష్టికి వచ్చింది. మరో 50 బోగస్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బాధ్యులపై క్రిమినల్ కేసులు చేయించడంతోపాటు, విచారణ ఎదుర్కొంటూనే విధుల్లో చేరిన ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ చెప్పడం అక్రమార్కుల్లో గుబులు రేపుతోంది.
(టీన్యూస్/నిర్మల్)జిల్లా విద్యాశాఖలో బోగస్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ వ్యవహారంలో అక్రమార్కుల డొంక కదులుతోంది. ఎనిమిది నెలలుగా మరుగున పడిన ఈ కేసును కొత్త డీఈఓ అక్రముల్లాఖాన్ తిరగదోడుతున్నారు. ఇప్పటికే జైనూర్ మండలంలో విచారణ నిర్వహించిన ఆయన క్రమం గా జిల్లా వ్యాప్తంగా సమగ్ర విచారణకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా ఉపాధ్యాయులు సస్పెన్షన్‌కు గురై.. తిరిగి విచారణ ఎదుర్కొంటూనే విధుల్లో చేరారు. కాగా మరో 50 మందికి పైగా ఉపాధ్యాయులు జిల్లాలో బోగస్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ పొందినట్లు అధికార వర్గాలకు ఉప్పందింది. ఈ వ్యవహారం తె రమీదికి రాకుండా ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యా శాఖపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి, ఫైళ్లను తొక్కిపెట్టాలని చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లు
జిల్లాలో భారీగా బోగస్ రీయింబర్స్‌మెంట్లు..
జిల్లా వ్యాప్తంగా బోగస్ మెడికల్ రీయింబర్స్‌మెంట్లు పొందిన ఉపాధ్యాయుల జాబితా భారీగానే ఉంది. కొన్ని మండలాల్లో మాత్రమే ఈ వ్యవహారం వెలుగులోకి రాగా మరిన్ని మండలాల్లో రాజకీయ ఒత్తిళ్లతో కేసును తొక్కి పెట్టినట్లు ఆరోపణలున్నాయి. నిర్మల్, ముథో ల్, నార్నూర్, జైనూర్, ఆదిలాబాద్ మండలాల్లో బోగస్ రీయింబర్స్‌మెంట్ పొందిన ఉపాధ్యాయుల వ్యవహారం 8 నెలల క్రితమే వెలుగు చూడగా ఈ వ్యవహారంలో నాలుగు మండలాల ఎంఈఓలు, బోగస్ బిల్లులు పొందిన ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటుపడింది. కాగా ఖానాపూర్, కడెం మండలాల్లో మరో 20 మంది ఉపాధ్యాయులు బోగస్ బిల్లులు పొందినట్లు ఆరోపణలున్నా ఈ వ్యవహారాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు బయటకు పొక్కనివ్వకుండా యత్నిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
బెల్లంపల్లి, మంచిర్యాల మండలాల్లోనూ ఈ అక్రమాలు జరుగగా, తాండూర్ మండలంలో సుమారు 30 మంది దాకా ఉపాధ్యాయు లు బోగస్ మెడికల్ బిల్లుల వ్యవహారంలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటుపడగా వారు రిక్వెస్టు ప్రాతిపదికన విధుల్లో చేరారు. వీరిపై ఇంకా విచారణ పూర్తి కాలేదు. అక్రమ బిల్లులు పొందిన ఉపాధ్యాయులపై ఇంకా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో జిల్లా విద్యాశాఖ తీరుపై విమర్శలు వెల్లు
సూత్రధారులు నిర్మల్ ఉపాధ్యాయులే..
బోగస్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ కేసుల వ్యవహారంలో నిర్మల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ముఖ్య పాత్రను పోషించినట్లు జిల్లా ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు వారిపై పోలీసులకు సైతం జిల్లా యంత్రాంగం ఫిర్యాదు చేసింది. వారిపై చార్జి షీట్ దాఖలు చేయాలనీ పోలీసు శాఖపై డీఈఓ యంత్రాంగం ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. వీరిలో ఒకరు ఎమ్మార్పీ హోదాలో నిర్మల్ ఎంఈఓకు అత్యంత సన్నిహితంగా ఉండి బోగస్ బిల్లుల పేరుతో పలువురు ఉపాధ్యాయులను నమ్మించి నట్టేట ముంచినట్లు ఆరోపణలున్నాయి. ఒక దశలో ఎంఈఓను సైతం తప్పుదోవ పట్టించారన్న అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. మ రో ఉపాధ్యాయుడు నిర్మల్ మండలంలో పని చేస్తూ బోగస్ మెడికల్ బిల్లుల తయారీలో కీల క పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. వీరిద్దరి కారణంగానే తాము బోగస్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ కేసుల్లో ఇరుక్కున్నామని పలువురు ఉపాధ్యాయులు, ఎంఈఓలు విచారణ సం దర్భంగా డీఈఓ దృష్టికి తీసుకురావడం గమనార్హం.
మేసింది ఐదారు కోట్లపైనే..
బోగస్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ కేసులో సుమారు 5 నుంచి 6కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాను ఉపాధ్యాయులు కొల్లగొట్టినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తం గా సుమారు 150 మంది ఉపాధ్యాయులు ఈ వ్యవహారంలో పాలు పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి ఉపాధ్యాయుడి వద్ద నుంచీ రూ.40వేల నుంచి రూ.60వేల మేర కమీషన్లు దండుకుని రీయింబర్స్‌మెంట్ పేరిట రూ. లక్ష నుంచి రూ.1.60 లక్షల దాకా ఇప్పించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే విచారణ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు తాము మోసపోయి బోగస్ బిల్లులు పొందినట్లు అధికారులకు వివరించడంతో పాటు డ్రా చేసిన మొత్తాన్ని ఖజానాకు జమ చేసి విధుల్లో చేరారు. కాగా మరికొందరు ఉపాధ్యాయులు మాత్రం తమకేం సంబంధం లేకున్నా తమ పేరిట బోగస్ బిల్లులు తయారు చేసి డ్రా చేసుకున్నారని అక్విటెన్సుల్లోనూ తమ సంతకాలను ఫోర్జరీ చేశారని అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అలాంటి ఉపాధ్యాయులకు సైతం రీపోస్టింగ్ ఇచ్చారు.
ఇక బోగస్ బిల్లులు పొందిన కొందరు ఉపాధ్యాయులపై ఎలాంటి వేటూ పడకుండా రాజకీయ ఒత్తిళ్లతో నడుపుకొస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం మళ్లీ తెరకెక్కడంతో ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడే ఈ బోగస్ వ్యవహారంలో ఇరుక్కోవడం గమనార్హం. హైదరాబాద్ స్థాయి లో గతంలో ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉండి ప్రస్తుతం ప్రజావూపతినిధిగా మా రిన నేత సహకారంతో కేసును మూసివేయించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.
ఇబ్బంది పడుతున్న వారెందరో...
ఈ వ్యవహారంలో కొందరు అమాయక ఉపాధ్యాయులు బలయ్యారు. ఎలాంటి సంబంధం లేని వారి పేరిట బిల్లులు లేపిన కారణంగా వారిప్పుడు తీరని వ్యథ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ వ్యవహారంలో చిక్కుకున్న ఉపాధ్యాయులు కొందరు ఇప్పటికే పదవీ విరమణ పొందగా వారికి రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్షన్ సైతం అందక అవస్థలు పడుతున్నారు. ఇక ఇద్దరు ఎంఈఓల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న సూత్రధారులు వారిని కేసు ల్లో వ్యూహాత్మకంగా ఇరికించినట్లు ప్రచారం జరుగుతోంది.
క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తా: డీఈఓ అక్రముల్లాఖాన్
జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారాన్ని సమక్షిగంగా దర్యాప్తు చేస్తున్నా. దాదాపు 6కోట్ల రూపాయల మేర బోగస్ బిల్లులు లేపినట్లు ఫిర్యాదులున్నాయి. సూత్రధారులను వదిలేది లేదు. క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తా. తిరిగి డబ్బులు చెల్లించిన వారికి రీపోస్టింగ్ ఇచ్చినా వారిపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. డబ్బులు చెల్లించినంత మాత్రాన వారికి శిక్ష పడదనుకుంటే పొరపాటే. విచారణ పూర్తయిన తర్వాత ఇలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం.
Other News