Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, May 22, 2013
 
దిశ కోసం మార్కెట్ల ఎదురు చూపులు

trade
సంస్కరణలపై మదుపర్ల ఆశలు
ఈవారం ఆర్థిక ఫలితాలే కీలకం

దలాల్ స్ట్రీట్‌లో ఈవారం ట్రేడింగ్ స్వల్ప ఒడిదుడుకుల్లో కొనసాగే అవకాశాపూక్కువగా కన్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వర్షపాతం, కంపెనీల తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు స్టాక్ సూచీల దిశను నిర్దేశించనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు కూడా ముగియడంతో మార్కెట్ వర్గాలు సంస్కరణలపైనే ఆశలు పెట్టుకున్నారు. డీజిల్, వంటగ్యాస్‌లపై సబ్సిడీ కోతతో పాటు రిటైల్, బీమా, విమానయాన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిచ్చే విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు మార్కెట్ మూడ్‌ను మార్చే అవకాశం ఉంది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) ఇన్వెస్ట్‌మెంట్లు 10 బిలియన్ డాలర్లు దాటాయి. ఏప్రిల్, మే నెలల్లో భారీగా కుంటుపడ్డ ఎఫ్‌ఐఐ హోల్డింగ్స్ సంస్కరణల అమలుపై చిగురించిన ఆశలతో మళ్లీ పుంజుకున్నాయి. ఆగస్టు 8న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే సంస్కరణల అమలుకు కేంద్ర ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వంలో శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ అలకతో ఏర్పడ్డ అభివూపాయభేదాలు మున్ముందు ఎటువైపు దారితీస్తాయో కూడా మదుపర్లు నిశితంగా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ వీరు సంకీర్ణం నుంచి వైదలొగితే ఏర్పడే రాజకీయ సంక్షోభంతో స్టాక్ మార్కెట్లో ప్రతికూలత మరింత పెరిగే అవకాశం ఉందని ఈక్విటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే 2జీ స్పెక్ట్రమ్ వేలంపాటకు సంబంధించి బిడ్డింగ్ కనీస రిజర్వు ధర, వన్ టైమ్ చార్జిపై సాధికార మంత్రుల బృందం ప్రతిపాదనలు చేయనుండటంతో ఈవారం టెలికం రంగ స్టాకుల్లో కూడా ఎక్కువ కదలికలు కన్పించనున్నాయి. కనీస ధరలు గరిష్ఠ స్థాయిలో ఉంటే గనక టెలికం షేర్లన్నీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.

గడిచిన వారంలో విడుదలైన జూన్ నెల టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 7.25 శాతానికి తగ్గడంతో మార్కెట్ వర్గాల దృష్టంతా వర్షపాత గణాంకాలపైకి మళ్లింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగానే నమోదైంది. ఈ కారణంగా ఖరీఫ్ పంట దిగుబడి తగ్గి ధరలు మరింత ఎగబాకుతాయనే అంచానాలున్నాయి. మున్ముందు కూడా వర్షపాతం సాధారణ స్థాయి కంటే తగ్గితే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 31న జరగబోయే త్రైమాసిక పరపతి సమీక్షలో సైతం ఆర్‌బీఐ దేశంలో వర్షపాత పరిస్థితులను బట్టే రెపో రేట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అభివూపాయపడుతున్నారు. జూన్ నెల ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ఠ స్థాయిలోనే ఉందని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఇప్పటికే మార్కెట్ వర్గాల వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లారు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వర్షపాతం ఆర్‌బీఐ పరపతి విధానాన్ని సడలించేలా నిర్ణయం తీసుకునేట్లు చేస్తుందని ఆశాభావంతో ఉన్నారు. దేశ పారిక్షిశామిక రంగంలో నిధుల లభ్యత పెరగాలంటే వడ్డీ రేట్లు తగ్గించాలని పారిక్షిశామిక రంగం డిమాండ్ చేస్తున్నది.దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రభావితం చేయగలిగే అంశాలు పెద్దగా లేకపోవడంతో మార్కెట్లు దిశా నిర్దేశం కోసం ఎదురు చూస్తున్నాయి. త్రైమాసిక ఫలితాలతో ఈ వారం మార్కెట్లో ఎక్కువగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగనుంది. ఈవారం ఫలితాలు ప్రకటించనున్న ప్రధాన కంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, మారుతి సుజుకీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐటీసీ,బీహెచ్‌ఈఎల్, హెయూఎల్, ఎల్ అండ్ టీ, కెయిర్న్ ఇండియా, సెసాగోవా, జిందాల్ స్టీల్, స్టెరిలైట్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ఉన్నాయి. గతవారంతంలో మార్కెట్ ట్రేడింగ్ ముగిశాక విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలు సోమవారం మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. గతేడాదిలో జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్-జూన్ 2012 మధ్యకాలంలో ఆర్‌ఐఎల్ నికరలాభం 21 శాతం పడిపోయినప్పటికీ, నిర్వహణ లాభం పుంజుకోవడం, రిఫైనింగ్ వ్యాపార మార్జిన్లు మార్కెట్ వర్గాలు ఆశించిన స్థాయి కంటే మెరుగ్గా ఉండటంతో షేర్ పుంజుకునే అవకాశం ఉందని ఈక్విటీ నిపుణులంటున్నారు. ఈ వారం సూచీలు రేంజ్ బౌండ్‌లో ఉండే అవకాశాపూక్కువగా ఉన్నాయి. గురువారం ఈనెల డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో వారాంతంలో సూచీల్లో ఒడిదుడుకులు ఎక్కువగా కన్పించనున్నాయి.

Other Articles
Most Viewed galleries
Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine